రాజధాని పేరుతో సామాన్యుడి దోపిడీ

() ప్రజల్ని కొట్టు..కార్పొరేట్లకు పెట్టు

() అమరావతి లో యూజర్ ఛార్జీల మోత

() ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం

అమరావతి) ప్రపంచం నివ్వెరపోయే రాజధాని కడతానంటూ గొప్పలు చెప్పే చంద్రబాబు
చర్యలు చూస్తే మాత్రం..అంతా నివ్వెరపోవాల్సిందే. ఎందుకంటే రాజధానిలో అడుగడుగుకి
ఛార్జీల మోత మోగేలా చర్యలు చేపడుతున్నారు.  

వసూల్ రాజా..!

సింగ‌పూర్ త‌ర‌హా రాజ‌ధాని అని చెప్పిన సీఎం చంద్ర‌బాబు స‌దుపాయ‌లెలా ఉన్నా
రాజ‌ధాని నిర్వ‌హ‌ణ చార్జీల‌ను ప్ర‌జ‌ల నుంచి వ‌సూలు చేయ‌నున్నారు. అంటే పౌర సేవ‌ల‌న్నిటికీ
యూజ‌ర్ చార్జీలు విధిస్తారు. సిటీ నిర్వ‌హ‌ణ చార్జీల రూపంలో ప్ర‌జ‌ల నుంచి వ‌సూలు
చేస్తారు. పార్కుకు వెళ్లినా, ర‌హ‌దారిపై న‌డిచినా,
ఆసుప‌త్రుల‌కు
వెళ్లినా,
ఏసేవ‌కైనా యూజ‌ర్
చార్జీలు చెల్లించాల్సిందేన‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తోంది. అయితే రాజ‌ధాని
నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌ధాన పాత్ర కేపిట‌ల్ సిటీ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్
కంపెనీ (సీసీడీఎంసీ)ది. ఇప్ప‌టికే స్పెష‌ల్ ప‌ర్స‌న్ వెహిక‌ల్ (ఎస్‌పీవీ) పేరిట ఈ
కంపెనీని ఏర్పాటు చేశారు. కాగా, సీసీడీఎంసీ బాధ్య‌త‌లు,
విధుల‌ను సీఆర్‌డీఏ
తాజాగా రూపొందించింది. వాటికి ఆమోదం తెల‌పాల్సిందిగా రాష్ట్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌ల‌ను
పంపింది.   

నిర్వహణ ఎలాగంటే..!

మాస్ట‌ర్‌ప్లాన్‌కు అనుగుణంగా కేపిట‌ల్ సిటీలో స‌వివ‌ర‌మైన అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు
రూపొందించాలి. కేపిట‌ల్ సిటీ సేవ‌లకు సంబంధించిన ప్రాజెక్టుల డిజైన్‌, అభివృద్ధి, అమ‌లు త‌దిత‌ర ప‌నులు చూడాలి. అలాగే సిటీ సేవ‌ల
నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు సైతం చూడాలి. మౌలిక స‌దుపాయ‌లకు అనుగుణంగా భ‌వ‌నాల ప్ర‌ణాళిక‌ల‌ను
అద్యయానం చేసి సిఫార్సు చేయాలి. ప్రైవేట్ డెవ‌ల‌ప‌ర్స్ నుంచి డెవ‌ల‌ప్‌మెంట్
చార్జీల‌ను,
వార్షిక లీజుల‌ను
వ‌సూలు చేయాలి. సీఆర్‌డీఏ నిర్థారించిన వివిధ చార్జీల‌తో పాటు యూజ‌ర్ చార్జీల‌ను, సిటీ నిర్వ‌హ‌ణ చార్జీలు వ‌సూలు చేయాలి.
కేపిట‌ల్ సిటీ డెవ‌ల‌ప్‌మెంట్ భాగ‌స్వామ్య ఏజెన్సీల‌ను ఎంపిక చేయాలి. లీజు
అగ్రిమెంట్ మేర‌కు నిర్మాణాలు చేప‌ట్టే స్థ‌లాల‌ను 99 ఏళ్ల పాటు లీజుకు కేటాయించాలి. ప్ర‌భుత్వ
నిధుల‌తో సంబంధం లేకుండా రాజ‌ధానికి అవ‌స‌ర‌మైన నిధుల‌ను మార్కెట్ నుంచి స‌మీక‌రించాలి.

వసతులకు ఏర్పాట్లు

       హడావుడి
బాగానే జరుగుతున్నప్పటికీ సామాన్యుడికి వీటి తో ఒనగూరే ప్రయోజనాలు ఏపాటివి అన్న
అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం లేకుండా పథకాలు రచిస్తున్నారు.
దీంతో వీటి పనితీరు మీద అనుమానాలు కలుగుతున్నాయి. స్మార్ట్ సిటీల ప్ర‌కారం ర‌వాణా, విద్యుత్ పంపిణీ, నీటి స‌ర‌ఫ‌రా, వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, ఐటీ ప‌రిజ్ఞ‌నం త‌దిత‌ర మౌలిక వ‌స‌తుల‌ను
పీపీపీ విధానంతో అందించాలి. వైద్య‌, ఆరోగ్యం, క్రీడ‌లు, విద్య‌, వినోదం త‌దిత‌ర సామాజిక స‌దుపాయాల‌ను వివిధ
బాగ‌స్వామ్య సంస్థ‌ల ద్వారా అందించాలి. మౌలిక వ‌స‌తులు, భ‌వ‌నాల అభివృద్ధికి ఎస్‌పీవీ కంపెనీ ఏర్పాటు
చేస్తారు. ఈ కంపెనీ కింద అమ‌రావ‌తి డెవ‌ల‌ప్‌మెంట్ కంపెనీ, అమ‌రావ‌తి భ‌వ‌న నిర్మాణ నిర్వ‌హ‌ణ కంపెనీ
ఉంటాయి.  

        

 

తాజా వీడియోలు

Back to Top