కొంద‌రు మంత్రుల‌పై కోటరీ కోపం - అమాత్యుల‌కు త్వ‌ర‌లోనే శాపం

హైద‌రాబాద్‌) ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ఉన్న‌ప్ప‌టికీ రాష్ట్రాన్ని ప‌రిపాలిస్తున్న‌ది మాత్రం కోట‌రీయే అన్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌యం. కోట‌రీ క‌నుసన్న‌ల్లోనే అవినీతి లావాదేవీల‌న్నీ జ‌రిగిపోతున్నాయి. చంద్ర‌బాబు ఎంతో త‌హ త‌హ‌లాడుతున్న అమ‌రావ‌తి రాజ‌ధాని పూర్తిగా కోట‌రీ ద్వారానే న‌డుస్తోంది. అయితే ఈ కోట‌రీ చెప్పిన మాట గుడ్డిగా వింటున్న మంత్రుల మీద ఈగ వాల‌కుండా ఈ సీక్రెట్ నేత‌లు కాపాడుకొంటున్నారు. కోటరీ అవినీతి కి ఏమాత్రం అడ్డంకి చెప్పినా ఆ మంత్రుల మీద కారాలు మిరియాలు నూరేస్తున్నారు. ఇది రోజు రోజుకి పెరుగుతోంది.

తాజాగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌ని ప్ర‌చారం తీవ్రంగా జ‌రుగుతోంది. రాష్ట్రంలో ఇటీవ‌ల ఎమ్ఎల్‌సీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకి బాగా ఇష్టులు అన ద‌గ్గ నేత‌లు స్థానాలు ద‌క్కించుకొన్నారు. వీరికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల‌న్నా కొంద‌రిని క‌ద‌పాల్సి ఉంది. ఇక్క‌డే కోట‌రీ కొత్త టెక్నిక్ కు తెర లేపింది. మీడియా పిచ్చి బాగా ఉన్న చంద్ర‌బాబు. ఆయన కోట‌రీ ఆ రూట్ లోనే న‌రుక్కొని వ‌స్తున్నారు. అవినీతి గుడ్డిగా ఆమోదించ‌ని మంత్రుల‌మీద కావాల‌ని లీకులు ఇచ్చి క‌థ‌నాలు రాయిస్తున్నారు ముందునుంచీ ఆయా మంత్రుల పేషీల్లో కోట‌రీకి చెందిన కొంద‌ర్ని అధికారులుగా నియ‌మించారు. ఈ అధికారుల ద్వారా ఎప్పటిక‌ప్పుడు స‌మాచారం తెప్పించుకొని, ప‌త్రిక‌ల్లో కొన్ని క‌థ‌నాలు రాయిస్తున్నారు. త‌ద్వారా ఆ మంత్రుల్ని అస‌మ‌ర్థులుగా చిత్రించి బ‌య‌ట‌కు పంపించేందుకు కుట్ర చేయిస్తున్నారు.

మునిసిప‌ల్ మంత్రి ఎప్పుడు చంద్ర‌బాబు చుట్టూ ఉంటారు త‌ప్పితే శాఖ‌ను ఎప్పుడూ ప‌ట్టించుకోరు. ఆయ‌న‌కు అమ‌రావ‌తి, సింగ‌పూర్ వీటి ద్వారా వ‌చ్చే ప్ర‌యోజ‌నాలే ముఖ్యం అని బ‌హిరంగంగా చెబుతుంటారు. ఇక‌, విద్య శాఖ మంత్రి, నీటిపారుద‌ల శాఖ మంత్రి ముఖ్య‌మంత్రి మ‌న‌స్సు తెలుసుకొని న‌డుచుకొంటారు కాబ‌ట్టి వారికి ఢోకా లేదు. రుణ‌మాఫీ ఘోరంగా విఫ‌ల‌మై రైతు లోకం శాప‌నార్థాలు పెడుతున్నా వ్య‌వ‌సాయ మంత్రిని ఎవ‌రూ ఏమీ అన‌రు. ఉపాధి లేక నిరుద్యో్గులు అల్లాడిపోతుంటే కార్మిక శాఖ మంత్రికి చీమ అయినా కుట్ట‌దు.

కానీ, కోట‌రీ చెబుతున్న అవినీతి ని పూర్తిగా అంగీక‌రించ‌ని కార‌ణంగా దేవాదాయ‌, హోమ్ శాఖ‌, ఎక్సైజ్‌, గృహ‌నిర్మాణ శాఖ ల మంత్రుల మీద కోట‌రీ క‌క్ష క‌ట్టింద‌న్న మాట వినిపిస్తోంది. దీంతో ఈ శాఖ‌ల మంత్రుల‌కు వ్య‌తిరేకంగా లీకులు ఇచ్చి క‌థ‌నాలు రాయిస్తున్నారు. పాత చైనా సామెత ప్రకారం జంతువును చంపాలంటే ముందుగా అది చెడిపోయింద‌ని ప్ర‌చారం చేస్తే జ‌న‌మే రాళ్ల‌తో కొట్టి చంపేస్తార‌ని చెబుతారు. ఇప్పుడు అదే మార్గంలో ఇష్టం లేని మంత్రుల మీద ప్ర‌చారాలు చేస్తున్నార‌ని అంటున్నారు 
Back to Top