హోదాకోసం వైఎస్సార్‌సీపీ పోరాట క్రమం

ప్రత్యేక హోదా కోసం నిరంతరాయంగా పోరాడుతున్నది వైఎస్సార్సీపీ పార్టీయే.
రెండేళ్లుగా సాగిస్తున్న పోరాట క్రమం ఇది...!

 

2014,
మే 19:  ప్ర‌ధానిగా ప‌ద‌వి చేప‌ట్ట‌డానికి ముందే
నరేంద్ర‌మోదీని త‌మ పార్టీ ఎంపీల‌తో పాటుగా ఢిల్లీలో క‌లిసి ప్ర‌త్యేక హోదా కావాల‌ని
వైఎస్ జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి

2015 మార్చి: ఎంపీల‌తో ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని
మోదీని క‌లిసి రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రాన్ని గుర్తు చేసిన జ‌గ‌న్‌.

మే:  హోదా కోరుతూ పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా గాంధీ బొమ్మ వ‌ద్ద
నిర‌స‌న తెలిపిన పార్టీ ఎంపీలు

జూన్ 3,
4: మ‌ంగ‌ళ‌గిరిలో వైఎస్
జ‌గ‌న్ చేసిన రెండు రోజుల స‌మ‌ర దీక్ష‌లో రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాల‌ని గ‌ట్టిగా
డిమాండ్ చేశారు. 

జూన్ 9:
 ఢిల్లీలో
రాష్ట్ర‌ప‌తిని క‌లిసి ప్ర‌త్యేక హోదా అంశాన్ని ఆయ‌న దృష్టికి తెచ్చిన జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

 

ఆగ‌ష్టు 10:
 వైఎస్సార్‌సీపీ
ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు, ఎంపీల‌తో క‌లిసి ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద
ఒక రోజు ధర్నా చేసి రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌త్యేక హోదా ఆకాంక్ష‌ను జాతీయ‌స్థాయిలో
చాటి చెప్పారు. అదే రోజు మార్చ్ టు పార్ల‌మెంట్‌ను నిర్వ‌హించి ఢిల్లీ వీధుల్లో
అరెస్ట‌య్యారు. 

ఆగ‌స్టు 29:
 ప్ర‌త్యేక
హోదా-ఆంధ్రుల హ‌క్కు అనే నినాదంతో రాష్ట్ర బంద్‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. 

సెప్టెంబ‌ర్ 15:
 తిరుప‌తిలో
యూనివ‌ర్శిటీ విద్యార్థులు,
యువ‌కుల‌తో యువ‌భేరి
స‌ద‌స్సుల‌ను నిర్వ‌హించిన జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదాపై వారిని జాగృతం చేశారు.

సెప్టెంబ‌ర్ 22:
 విశాఖ‌లో యువ‌భేరి
స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌

 

అక్టోబ‌ర్ 7:
 ప్ర‌త్యేక హోదా
కోసం జ‌గ‌న్ నిర‌వ‌ధిక నిరాహార దీక్ష ప్రారంభం 

అక్టోబ‌ర్ 14:
 ప్ర‌జ‌ల నుంచి
భారీ స్పంద‌న వ‌స్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ దీక్ష‌ను భ‌గ్నం చేసిన ప్ర‌భుత్వం

2016 జ‌న‌వ‌రి 27:  ప్ర‌త్యేక హోదా అవ‌శ్య‌క‌త‌ను వివ‌రిస్తూ
కాకినాడ‌లో యువ‌భేరి

ఫిబ్ర‌వ‌రి 2:
 శ్రీ‌కాకుళంలోనూ
విద్యార్థులు,
యువ‌కుల‌ను స‌మీక‌రించి
యువ‌భేరి స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌.

ఫిబ్ర‌వ‌రి 23,
24:  ఢిల్లీకి వెళ్లి
రాష్ట్ర‌ప‌తిని,
కేంద్ర
హోంమంత్రిని క‌లిసి ప్ర‌త్యేక హోదా ఆవ‌శ్య‌క‌త‌ను మ‌రోసారి గుర్తు చేసిన జ‌గ‌న్‌.

 

Back to Top