() చంద్రబాబుది ఇనుప పాదం అని నానుడి() కరువు బాబు కవల పిల్లలు అని ప్రచారం() చంద్రబాబుకు డాక్టరేట్ ప్రదానం చేస్తామన్న చికాగో స్టేట్ యూనివర్శిటీ మూసివేత
హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబుది ఐరన్ లెగ్ అని బలంగా ప్రచారం ఉంది. ఆయన ఎక్కడ అధికారం చెలాయిస్తే అక్కడ కరువు కాటకాలు చెలరేగుతాయన్న మాట ఉంది. ఆయనతో చెట్ట పట్టాల్ వేసుకొన్న సంస్థలు అలాగే చతికిల పడిన దాఖలాలు ఉన్నాయి. ఈ ఐరన్ లెగ్ ఎఫెక్ట్ ఇప్పుడు ఖండాంతరాలకు పాకింది. సీఎం చంద్రబాబునాయుడుకు డాక్టరేట్ ప్రదానం చేస్తామని ప్రకటించిన చికాగో స్టేట్ యూనివర్శిటీ(సీఎస్‌యూ) మూతపడింది. అమెరికాలో ఇలినాస్ రాష్ట్రం నిధులను సమకూర్చకపోవడంతో యూనివర్శిటీని మూసివేస్తున్నట్లు సీఎస్‌యూ అధ్యక్షుడు డాక్టర్ థామస్ కల్హన్ శుక్రవారం ప్రకటించారు. అమెరికాలో చికాగో యూనివర్శిటీ అనే పేరుతో ప్రముఖమైన విశ్వ విద్యాలయం ఉంది. ఇది ప్రపంచ స్థాయిలో వినుతి కెక్కింది. చికాగో స్టేట్ యూనివర్శిటీ పేరుతో మరొక విశ్వవిద్యాలయం ఉన్నాయి. ఈ పేరు ఊరు లేని యూనివర్శిటీ బాబుకి డాక్టరేట్ ఇవ్వడానికి సిద్ద పడింది. అందుకు గాను జె. ఎన్ టీ యూ తో ఒక మౌలిక ఒప్పందం కూడా కుదిర్చి పంపించారు. అయితే చంద్రబాబుకి విశిష్ట చికాగో విశ్వ విద్యాలయమే డాక్టరేట్ ఇస్తోందని డప్పు కొట్టుకొన్నారు. నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేకపోవడం వల్ల చికాగో స్టేట్ యూనివర్శిటీకి అమెరికా ప్రభుత్వంగానీ.. ఇలినాస్ రాష్ట్ర ప్రభుత్వంగానీ ఎలాంటి నిధులు సమకూర్చడం లేదు. దీంతో క్యాంపస్ మూత పడటం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇప్పుడు చంద్రబాబు డాక్టర్ బాబు అయ్యారో లేదో తెలీనిసమస్య అయి కూర్చొంది.