చెరపకురా చెడేవు...


నా చిన్నప్పుడు మా అమ్మ నాకు చెరపకురా చెడేవు అనే కథ చెప్పింది. అందులో నీతి నాకు ఈ రోజుకూ గుర్తుంది. అన్యాయంగా ఎదుటివారిని వేధించినందుకు ఫలితం అనుభవించిన చెడ్డవాడి కథ అది. నేడు జగన్ ను అతడి కుటుంబాన్నీ అన్యాయంగా వేధిస్తున్న వాళ్లని చూస్తే నాకు ఆ కథే గుర్తుకు వస్తోంది. 
వైఎస్సార్ చనిపోయిన క్షణం నుంచి జగన్ పైమ నిందలు వేసి, కుట్రలు చేసి, అన్యాయంగా జైలుకు వెళ్లడానికి కారణమైన వాళ్లంతా నేడు దాని ఫలితం అనుభవిస్తున్నారు. జగన్ ఆస్తుల గురించి హైకోర్టుకు లేఖ రాసి అధిష్టానం చెప్పినట్టల్లా ఆడిన శంకర్రావు ఆ తర్వాత మంత్రి పదవి పోగొట్టుకుని అవమానపూరితంగా అరెస్టు అయ్యాడు. జగన్ ను నోటికొచ్చినట్టల్లా తిట్టిన ఎర్రన్నాయుడు గారు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బిఎన్ రవీందర్ రెడ్డి కూడా జగన్ ను తిట్టిపోసి సంపాదించుకున్న మంత్రిపదవి ఊడగొట్టుకుని మట్టికొట్టుకు పోయాడు. జగన్ మీద ఒంటికాలి మీద లేస్తూ, జగన్ ని జైలు పక్షి అంటూ ఎద్దేవా చేసిన రేవంత్ రెడ్డి కూడా జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. అది కూడా ఓటుకు నోటు కేసులో పబ్లిక్ గా దొరికిపోయి. అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం జగన్ ను కేసుల్లో ఇరికించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆయన ఆయన పుత్ర రత్నం సిబిఐ కేసుల్లో ఇరుక్కుని కక్కలేక మింగలేక సతమతం అవుతున్నారు. అసలీ కథనానికంతటికీ కారకురాలు, నాయకురాలు నాగమ్మ అయిన సోనియా రాజకీయంగా తుడిచిపెట్టుకుపోయింది. ఇటు రాష్ట్రంలో అటు దేశంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోయాయి. వైఎస్ జగన్ ను అతిగా తిట్టినా నానా దుర్భాషలాడిన టిడిపి ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు రాలేదు సరికదా, బాబు కాస్తా వైఎస్సార్ కాంగ్రెస్ లోంచి జంప్ అయి వచ్చిన వాళ్లకి పెద్ద పీట వేసాడు. వాళ్లకే మంత్రి పదవులు కట్టబెట్టాడు. కళ్ల ముందే ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చిన వాళ్లు మంత్రులుగా చెలామణీ అవుతుంటే కడుపు మండినా చేసేదేం లేక భోరుమంనుటున్నారు తెలుగు తమ్ముళ్లు. 
ఇదంతా ఒక ఎత్తైతే నేడు వైఎస్ భారతిపై చల్లుతున్న బురద మరో ఎత్తు. అన్ని హద్దులను దాటుకుంటూ రాజకీయ ప్రత్యర్థిత్వాన్ని గెలవలేక జగన్ భార్యను కేసుల్లో ఇరికించాలనే కుట్రలకు తెరతీసారు. భారతీ రెడ్డి పేరు ఛార్జి షీట్లలో ఉందంటూ గొడవ చేస్తున్నారు. ఇద్దరూ కలిసి కోర్టులకు వెళ్లబోతున్నారంటూ చంకలు గుద్దుకుంటున్నారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వారిని తమ పనులు చేసేలా తయారు చేసుకున్న పార్టీల అధినాయకులు, జగన్ పై కుట్రల ఉచ్చు మరింత బిగించాలని, కుటుంబాన్ని కేసుల్లోకి లాగడం ద్వారా అతడి ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టాలని, రాబోయే ఎన్నికల్లో దీన్నో పావుగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు క్లియర్ గా అర్థం అవుతోంది. ఏడేళ్లుగా గుర్తుకు రాని భారతి పేరు, ఏడేళ్లుగా సిబిఐ చెప్పని పేరు ఇన్నేళ్లకు ఛార్జ్ షీట్ గా నమోదవడం వెనుక ఉన్న హస్తాలెన్నో ప్రజలు ఆమాత్రం అర్థం చేసుకోగలరు. ధర్మరాజు రక్తం, మంచి వారి కన్నీరు నేల చిందకూడదంటారు. న్యాయం దక్కాలని పోరాడుతున్న వైఎస్ జగన్, జరుగుతున్న ఈ కుట్రలపై తన మనో వ్యధను లేఖగా రాసి ప్రజల ముందుంచాడు. ఇంకెన్ని కుట్రలు చేసినా సత్యం నిలబడుతుందనే నమ్ముతానని విశ్వాసంగా చెబుతున్నాడు. మరి ఆ ధర్మం వెంట నడిచే మనిషిని అధర్మ యుద్ధంతో గెలవాలనుకుంటున్న వారికి చెరపకురా చెడేవు అనే నీతి గుర్తుందా లేదా???
 
Back to Top