ప‌ట్టిసీమ చాటున మ‌రో మోసం



హైద‌రాబాద్ ) ప‌ట్టి సీమ ప‌థ‌కం అంటే చంద్ర‌బాబుకి ఎంతో ముద్దు. పోల‌వ‌రం ప్రాజెక్టుని ప‌ణంగా పెట్టి మ‌రీ ఈ ప‌నుల్ని చేయిస్తున్నారు. ఇందులో ముందుగానే కాంట్రాక్ట‌ర్ నుంచి వంద‌ల కోట్ల రూపాయిల మేర ముడుపులు ముట్టాయి కాబ‌ట్టే ఈ ప‌నుల్ని వెంట‌ప‌డి మరీ చేయిస్తున్నార‌నే మాట వినిపిస్తోంది. ఇందుకోసం తాజాగా మ‌రో మోసానికి పాల్ప‌డుతున్న‌ట్లు తేలింది.

కాంట్రాక్ట‌ర్ కు లాభం చేకూర్చ‌ట‌మే ల‌క్ష్యం..!
ప‌ట్టి సీమ పథ‌కాన్ని ప్ర‌క‌టించిన‌ప్పుడే తెలివిగా ఒక మెలిక పెట్టారు. అంచ‌నా వ్యయం క‌న్నా 5 శాతం ఎక్కువ కోట్ చేస్తే ఆ ప్ర‌తిపాద‌న్ని అంగీకరించ రాద‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న స్ప‌ష్టంగా ఉంది. అయితే ముడుపులు ముట్ట చెప్పిన సంస్థ కోసం దీన్ని చంద్ర‌బాబు తెలివిగా మార్చేశారు. ఐదు శాతం ఎక్సెస్ అని, సుమారు 16 శాతం బోన‌స్ అని ప్ర‌క‌టించారు. ఒక ఏడాదిలో పూర్త‌య్యే ఎత్తి పోత‌ల ప‌థ‌కం అని స్ప‌ష్టం గా పేర్కొన్న పట్టిసీమ ప‌థ‌కాన్ని ఏడాదిలోపు పూర్తి చేస్తే, 16శాతం బోన‌స్ అని ప్ర‌క‌టించారు. అదే పెద్ద మోసం అయితే, దీన్ని ఏడాదిలోపు పూర్తి చేయించేందుకు స‌క‌ల శ‌క్తులు ఒడ్డుతున్నారు. 

ప‌ట్టిసీమ కోసం తాడిపూడికి శాపం
దివంగ‌త ముఖ్య‌మంత్రి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా మెట్ట రైతుల కోసం తాడిపూడి ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు. ఇందులో భాగంగా 2007 వ సంవ‌త్స‌రంలో  ప‌థ‌కాన్ని ప్రారంభించారు. అప్ప‌ట్లోనే దాదాపు 40వేల ఎక‌రాల‌కు సాగు నీరు అందించారు మ‌రో రెండేళ్ల‌కు అద‌నంగా 70 వేల ఎక‌రాల‌కు నీరు స‌ర‌ఫ‌రా చేశారు. మ‌హానేత మ‌ర‌ణం త‌ర్వాత మిగిలిన ప‌నులు అలాగే ఆగిపోయాయి. 
ఇప్పుడు ప‌చ్చ నేత‌ల క‌న్ను దీని మీద ప‌డింది. తాటిపూడి ప్ర‌ధాన కాలువ కు సంబంధించిన క‌స‌ర‌త్తును పూర్తిగా ప‌ట్టి సీమ‌కు మ‌ళ్లించేస్తున్నారు. ఇందుకోసం లెక్క‌ల్ని అడ్డ గోలుగా మార్చేస్తున్నారు. ల‌క్ష్యం ప్ర‌కారం ఇది 2ల‌క్ష‌ల ఎక‌రాల‌కు ఇది నీరు అందించాల్సి ఉంటుంది. ఇక్క‌డ నుంచి ల‌క్ష‌కు పైగా ఎక‌రాల‌కు సాగునీరు అందుతున్న‌ట్లు లెక్క‌లు రూపొందించేశారు. దీంతో మిగిలిన నీటిని మ‌ళ్లిస్తున్న‌ట్లుగా వ్యూహం పన్నారు. 

హ‌డావుడిగా ప‌నులు పూర్తి చేయ‌ట‌మే ల‌క్ష్యం..!
తాడిపూడి నీటిని ప‌ట్టి సీమ‌కు మళ్లించేందుకు కుట్ర జ‌రిగిపోతోంది. దీంతో దీనికింద సాగునీరు అందుతుంద‌ని ఆశ‌లు పెట్టుకొన్న రైతుల నెత్తిన కుచ్చు టోపీ పెడుతున్నారు. రాజధాని అవ‌స‌రాల కోసం ప‌ట్టి సీమ పేరుతో నీటిని తీసుకొని వెళ్ల‌ట‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు అండ్ కో ప‌నిచేస్తున్నారు. దీంతో గోదావ‌రి జిల్లా మెట్ట రైతుల‌కు తీవ్ర ఇబ్బందులు త‌ప్ప‌టం లేదు.   

Back to Top