ఎంత మోసం

  • వైయస్‌ జగన్‌ పర్యటనలో వెలుగు చూసిన నిజాలు
  • బయటపడిన ఆక్వాఫుడ్‌ పార్కు యాజమాన్యం అసలు రంగు
  • 20 గ్రామాల ప్రజలు వద్దన్నావినని సర్కార్‌
  • కలెక్టర్‌తో గవర్నమెంట్‌ సంస్థ అంటూ తప్పుడు ప్రచారం
  • బాబుకు ముడుపులు అందడం వల్లే ఆక్వా ఫ్యాక్టరీకి ఆమోదం
  • ఆక్వా ఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా పోరాడతామన్న ప్రతిపక్ష నేత
  • పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్‌ జగన్‌ పర్యటన విజయవంతం

పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మించ తలపెట్టిన ఆక్వా ఫుడ్‌ పార్కుపై పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  జిల్లాలో పర్యటించిన సందర్భంగా బాధిత గ్రామాల ప్రజలు తమ గోడు చెప్పుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండానే కాలుష్యకారకమైన ఆక్వా ఫుడ్‌ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు యాజమాన్యం ముందుకు రాగా..వారికి సర్కార్‌ తోడుగా నిలిచిన విషయాలు బాధితుల నోటి నుంచే బహిర్గతమయ్యాయి. మెగా ఆక్వాఫుడ్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారనే నెపంతో అమాయక ప్రజలపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం, బాధిత గ్రామాల్లో 144 సెక్షన్‌ విధించడం,  ప్రజల ఆకాంక్షలను అణచివేస్తూ.. పాశవిక చర్యలతో జన సంక్షేమాన్ని బలిపీఠం ఎక్కించిన సర్కారు తీరుపై బాధిత గ్రామాల ప్రజలు కన్నెర్రజేశారు. రెండున్నరేళ్లుగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ను వ్యతిరేకిస్తున్న వారు తమ ఆవేదనను వెళ్లగక్కారు. తమకు బాసటగా నిలిచిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. తక్షణమే ఫుడ్‌పార్క్‌ను ఇక్కడి నుంచి తరలించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తమ పక్షాన నిలిచిన జననేతకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. 

–కాలుష్య కోరలు చాచిన విష రక్కసి ఫుడ్‌పార్క్‌ అని, దీనిని సాగర తీరానికి తరలించాలని, లేకుంటే సర్కారునే బంగాళాఖాతంలో కలిపేస్తామని వైయస్‌ జగన్‌  ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. 

–తుందుర్రు ఆక్వా ఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా పోరాడుతామని వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.  బాధిత గ్రామాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తక్షణమే ఫుడ్‌పార్క్‌ను సముద్ర తీరానికి తరలించేలా ప్రభుత్వంపైనా, యాజమాన్యంపైనా ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు.  

–ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే విపరీతమైన దుర్గంధం వస్తుంది. కాలువలు కలుషితమై వ్యవసాయం దెబ్బతింటుంది. పొలాలపై ఆధారపడిన కూలీలు బతికే పరిస్థితి ఉండదని వ్యాఖ్యానించారు.

– పరి శ్రమలు రాకూడదని ఎవరూ అనుకోరు. కానీ.. ఇక్కడ కడితే వీళ్ల పొట్టమీద కొట్టినట్టు అవుతుంది. ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి కూడా నా సిన్సియర్‌ రిక్వెస్ట్‌ ఒక్కటే. ఫ్యాక్టరీ పెట్టిన తరువాత ఏ ఇబ్బంది ఉండకూడదనే విషయాన్ని చూసుకోవాలి. ఫ్యాక్టరీని సముద్ర తీరానికి తరలిస్తే యాజమాన్యానికి పూర్తి మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. 

–చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఇంకా ఉండేది రెండేళ్లే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలని, తర్వాత తమ ప్రభుత్వం ప్రజాభీష్టం మేరకు ముందుకు వెళ్తుందని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. 

–ఫ్యాక్టరీ స్థలం మొత్తాన్ని పూర్తిగా పోలీసులతో నింపేసి, అక్కడ యుద్ధవాతావరణం సృష్టించారు. గ్రామాల్లో 144 సెక్షన్‌ విధించి.. ఉద్యమకారులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం దారుణం. ప్రజల అభీష్టం మేరకు ఆక్వా పార్క్‌ను తక్షణమే ఇక్కడి నుంచి తరలించాలి. కాదు.. కూడదు అని చంద్రబాబు మాటను నమ్ముకుంటే ఆయనతోపాటు యాజమాన్యం కూడా బంగాళాఖాతంలో కలిసిపోవాల్సిందేనని వైయస్ జగన్ హెచ్చరించారు.

–ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించకుంటే ప్రజల కోసం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని వైయస్ జగన్ బాధితులకు కొండంత ధైర్యాన్నిచ్చారు.
Back to Top