ట్రెండ్ మార్చిన చంద్రబాబు..!

బాబు వచ్చే జాబు పోయే..!
సర్కారీ కొలువులకు కత్తెర..!

జాబు రావాలంటే బాబు రావాలని కళ్లబొళ్లి మాటలు చెప్పారు. ఇంటికో ఉద్యోగమిస్తాం, లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టారు. ఐతే,ఇదంతా అప్పటి మాట. ఇప్పుడు చంద్రబాబు ట్రెండ్ మార్చారు. బాబు వచ్చాడు జాబు పోయింది అన్న నూతన సాంప్రదాయానికి  తెరదీశాడు. అవును, సాంకేతిక పరిజ్ఞానం పేరుతో ప్రభుత్వ ఉద్యోగాల కుదింపునకు చంద్రబాబు ఎసరు పెట్టేస్తున్నాడు.

అప్పుడు ఓ మాట..ఇప్పుడో మాట..!
ఎన్నికలకు ముందు జాబుల పేరుతో చంద్రబాబు పెద్ద హడావుడే చేశాడు. గోడల మీద, పత్రికల్లో, టీవీల్లో ఎక్కడ చూసినా జాబు అంటే బాబు ..బాబు అంటే జాబు అన్నవిధంగా ప్రకటనలిచ్చేశాడు. అసెంబ్లీలోనూ ఇదే అంశంపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉద్యోగాలిస్తామంటూ మాయమాటలు చెప్పి అదికారంలోకి వచ్చిన చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా మోసం చేశాడని అసెంబ్లీ వేదికగా గళమెత్తారు. ఐనా, ప్రభుత్వ బుద్ధి మారడం లేదు. అధికారం చేపట్టి  ఏడాదిన్నర అయినా నోటిఫికేషన్లు ప్రకటించకపోగా...ఉన్న సర్కారీ కొలువులను కత్తిరించే కార్యక్రమానికి శ్రీకారం చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.

బాబు వచ్చే జాబు పోయే..!
నా నేతృత్వంలో ఆరుగురితో కమిటీ వేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు . కమిటీ సభ్యులుగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ బాబు, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, సభ్య కన్వీనర్ గా ఆర్థికశాఖ కార్యదర్శి ఎం. రవిచంద్రను నియమించారు.పరిపాలన సంస్కరణల ముసుగులో  కొత్త నియామకాలకు తిలోదకాలిచ్చేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. దీనిలో భాగంగానే మంత్రి నారాయణ నేతృత్వంలో ఆరుగురితో కమిటీ వేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు . కమిటీ సభ్యులుగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ బాబు, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, సభ్య కన్వీనర్ గా ఆర్థికశాఖ కార్యదర్శి ఎం. రవిచంద్రను నియమించారు.

తాజా వీడియోలు

Back to Top