చంద్రబాబు కొత్త ప్రచారం

హైదరాబాద్: తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. పట్టి సీమ నుంచి గోదావరి నీళ్లు పరవళ్లు తొక్కుతూ క్రష్ణా నదిలో కలుస్తున్నట్లు. అక్కడ నుంచి నీళ్లు అదే పనిగా రాయలసీమకు తరలుతున్నట్లు ప్రచారం చేసుకొంటున్నారు. 
పట్టి సీమ మీద అదే పట్టు
పట్టి సీమ ఎత్తిపోతల పథకం ద్వారా భారీగా గోదావరి నీటిని లాగేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు. ముఖ్యంగా రాజధాని కోసం, సింగపూర్ కంపెనీల కోసం నీళ్లు తీసుకోవాలని పథకం రచించారు. ఈ విధంగా ప్రకటిస్తే గొడవలు చెలరేగుతాయని భావించి దీనికి రాయల సీమ రంగు పూసారు. పట్టి సీమ ను కాదంటే రాయల సీమ వ్యతిరేకి అని ముద్ర వేసేందుకు పథక రచన చేశారు. 

సాధించకుండానే గొప్పలు
వాస్తవానికి పట్టి సీమ పథకం అర కొర గానే నడుస్తోంది. ఒక్కటంటే ఒక్క పంపును సాకారం చేయటానికి ఇన్ని రోజులు పట్టింది. ఈ పంపుతో నీటిని తోడి పోలవరం కుడి కాల్వ నుంచి క్రిష్ణా నదిలోకి పంపించేందుకు రంగం సిద్దం చేశారు. కానీ దీన్ని విపరీతంగా ప్రచారం చేసుకొనేందుకు పచ్చ మీడియా ను రంగంలోకి దింపారు. రెండు మూడు రోజుల పాటు అదే పనిగా దీని మీద ప్రచారం సాగించుకొనేందుకు రంగం సిద్దం చేశారు. 
Back to Top