డబ్బులివ్వు.. దారికి తెచ్చుకో

- వైయస్‌ఆర్‌సీపీని నిర్వీర్యం చేసే కుట్రలో చంద్రబాబు
– ప్రలోభాలతో ఫిరాయింపులు ప్రోత్సహించే వ్యూహం 
– అధికారంతో కేసులు పెట్టించి వేధించాలని పథకం
– తెలుగు తమ్ముళ్ల మనోభావాలను పట్టించుకోని సీఎం

పబ్లిసిటీ చేసుకోవడానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదులోకి చంద్రబాబు 

నంద్యాల, కాకినాడ విజయాలను ఎరగా వేసి వైయస్‌ఆర్‌సీపీని నిర్వీర్యం చేయాలన్న కుటిల రాజకీయ పన్నాగాలకు తెరలేపారు. వైయస్‌ఆర్‌సీపీలో డబ్బులకు అమ్ముడుపోయే చిన్నా చితకా నాయకులను వెతికిపట్టుకునే పనిలో పడ్డాడీ ఆంధ్రా శకుని. డబ్బులు గుమ్మరించి కొనుగోలు చేసిన నంద్యాల, కాకినాడ విజయాలను తన తన ఘనత ప్రచారం చేసుకునేందుకు ఎమ్మెల్యేలకు లాగాలని చూసిన చంద్రబాబుకు చుక్కెదురైంది. దీంతో ఖంగుతిన్న చంద్రబాబు ఎన్నికల వేడి చల్లారక ముందే చిన్నాచితకా వైయస్‌ఆర్‌సీపీ నాయకులను టీడీపీలోకి చేర్చుకోవడం ద్వారా ఏదో అద్భుతం చేసేసినట్టుగా పత్రికల్లో రాయించుకోవాలని తహతహలాడిపోతున్నారు. 

ఫిరాయింపులను కప్పిపుచ్చుకునేందకు
అనైతికంగా 21 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు నంద్యాల ఎన్నికల్లో గెలవడం ద్వారా ఫిరాయింపులను ప్రజలు స్వాగతించారని చెప్పాలనేది చంద్రబాబు వ్యూహం. నంద్యాల విజయాన్ని ఆ విధంగా ఫోకస్‌ చేయాలని చంద్రబాబు ఆస్థాన పత్రికలకు ఇప్పటికే పురమాయించి ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా పార్టీ శ్రేణులను ఎన్నిలకు సిద్ధం చేసే ఉద్దేశంతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబునాయుడు ఈ వైఖరిని మరోమారు బయటపెట్టారు.

రాజ్యాంగ వ్యతిరేక విధానాలతో అభివృద్ధి అనే దొంగ ముసుగేసుకుని చంద్రబాబు వైయస్‌ఆర్‌సీపీని దెబ్బతీయాలని కాచుకు కూర్చున్నారు. అధికారం, డబ్బును అడ్డం పెట్టుకుని సందర్భం దొరికిన ప్రతిసారీ వైయస్‌ఆర్‌సీపీ మీద ఒంటికాలి మీద లేస్తున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి టాప్‌ లెవెల్లోని నాయకులను ఓ పదిమందినైనా తమ పార్టీలో కలిపేసుకోవాలని ఉన్నదనే ఆకాంక్షను ఆయన బయటపెట్టారు. వైయస్‌ఆర్‌సీపీ ‘పని అయిపోవాలంటే’ అదొక్కటే మార్గమని ఆయన కోరుకుంటున్నారు. కాకపోతే.. తన కోరికకు ఓ అందమైన ముసుగు తొడుగుతున్నారు.  దీనికి సంబంధించిన బాధ్యతను విశ్వాసపాత్రులైన కొందరు సీనియర్‌ నాయకులకు అప్పగించినట్లుగా కూడా తెలుస్తోంది. తమ చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ప్రత్యర్థి పార్టీలోని వారికి ఆశలు చూపించి... వారిని తమలో కలిపేసుకోవాలనే దుర్నీతికి ఆయన ఒడిగడుతున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

జెండా మోసిన నాయకులను కాదని

చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో టీడీపీలోని జెండా మోసిన నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తమకు అవకాశాలు సన్నగిల్లి పోతాయని ఆవేదన చెందుతున్నా చంద్రబాబు షరామామూలుగానే నాయకుల మనోభావాలను పట్టించుకోకుండా తన పబ్లిసిటీ కోసం వారి జీవితాలను పణంగా పెడుతున్నారు. ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా భవిష్యత్‌ ప్రశ్నార్థమైన నాయకులకు తోడు ఇప్పుడు మరో కొంతమందిని పార్టీలో చేర్చుకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారికి చంద్రబాబు కొత్తభాష్యం చెబుతున్నారు. పార్టీలోని నాయకులు ఆందోళన చెందడం సరికాదంటూ.. ఆయన సొంత పార్టీలోని వారికి క్లాస్‌ తీసుకోవడం విశేషం. మీ బుద్ధులు మార్చుకోవాలి.. పార్టీ బలోపేతం కావడానికి ఎవరు వచ్చినా సరే చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.. అంటూ ఆయన ఇన్నాళ్లు పార్టీ జెండా మోసిన వారికి స్పష్టత ఇచ్చేశారు.
Back to Top