టీడీపీది బలం కాదు వాపే

– ఉప ఎన్నికల్లో ఎప్పుడైనా అధికార పార్టీదే హవా
– ఓటర్లను బెదిరించి ప్రలోభపెట్టి సాధించిందే నంద్యాల విజయం

చంద్రబాబు పిచ్చి చూస్తుంటే నంద్యాల ఎన్నికల తర్వాత మరో స్టేజికి చేరినట్టుంది. తాను చేపట్టిన మామూలు పనులనే గొప్పలుగా చెప్పుకుంటూ బతికే చంద్రబాబు నంద్యాల విజయంతో భూమి మీద నిలబడటం లేదు. రూ.200 కోట్లు ఖర్చు చేసి,రూ. 1500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి.. మంత్రి వర్గం మొత్తాన్ని 100 మంది ఎమ్మెల్యేలను రెండు నెలలు నంద్యాల్లో మోహరించి రోజుకొక సర్వే చేయించి ఓటుకు పది వేలు పంచి పెట్టి సాధించిన విజయాన్ని చంద్రబాబు తన గొప్పతనంగా చెప్పుకోవడం నవ్వులు తెప్పిస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ రాక మునుపు నుంచే చంద్రబాబు పడిన పాట్లు మామూలుగా లేవు. కులాల వారీగా జనాలను విడగొట్టి చేసిన ప్రచారం రాష్ట్ర ప్రజల కంటే స్థానిక నంద్యాల వాసులకే ఎక్కువ తెలుసు. 

అయితే ఇక్కడ ఫన్నీ విషయం ఏంటంటే నంద్యాల ఉప ఎన్నిక గెలుపుని టీడీపీ కార్యకర్తలు, నేతలకు పాఠ్యాంశంగా తెలియజేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారట. నియోజకవర్గానికి మంత్రులంతా వెళ్లి, అక్కడి తాజా పరిస్థితుల్ని అంచనా వేయమంటున్నారట. ’ఇంకే విభాగంలో అయినా ఫెయిల్‌ అయ్యామో తెలుసుకోండి..’ అంటూ చంద్రబాబు, పార్టీ ముఖ్య నేతలను ఆదేశాలు జారీ చేశారనేది ఈ వార్త సారాంశం.  

ఒక్క మాటలో చెప్పాలంటే నంద్యాల ఉప ఎన్నికని రోల్‌ మోడల్‌గా చేసుకుని, మొత్తంగా 175 నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యక్రమాలు ఉధృతంగా చేపట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చేశారు. కామెడీకే పరాకాష్ట ఇది. అయితే ఇది సాధ్యమయ్యే పనేనా అనేదే ఇక్కడ అసలు విషయం. ఒక్క నియోజకవర్గం కాబట్టి పనులన్నీ మానుకుని నాయకులను, పార్టీ కార్యకర్తలను మోహరించగలిగారు. పది పదిహేను  నియోజకవర్గాలకు పెట్టే ఎన్నికల ఖర్చును ఒకే నియోజకవర్గంలో పెట్టడం 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కుదురుతుందని అనుకుంటే అంతకన్నా అవివేకం ఇంకోటి ఉండదు. అసలే అధికారంలో ఉన్నారు.. మరో రెండేళ్లు పాలన ఉంది. ప్రభుత్వం నుంచి దక్కాల్సిన సంక్షేమ పథకాలు తమకు అపేస్తారేమోనన్న భయంతోనేనంద్యాలలో ప్రజలు  టీడీపీని గెలిపించారని అందరికీ తెలుసు. ఒక్క ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీని గెలిపించడం ద్వారా ప్రభుత్వం పడిపోదు కదా అనే విధంగా ప్రజలు ఆలోచించారు తప్ప టీడీపీ మీద ఉన్న అభిమానంతోనో.. చంద్రబాబు పాలన చూసి మురిసిపోయో కాదు. 

పోస్టల్‌ బ్యాలెట్లను పరిశీలిస్తేనే తెలుస్తుంది ఎంత బెదిరిపోతున్నారోనని. వారంతా ప్రతిపక్షానికి ఓటెయ్యాలని ఉన్నా అధికార పార్టీ వేధింపులను భరించలేమని భావించి ఓటును మురిగిపోయేలా చేసుకున్నారు. ఓటేయడం చేతకాదని చెప్పడానికి వారేమీ నిరక్ష్యరాస్యులు అసలే కాదు. అందరూ ఉద్యోగస్తులే. సో.. వంద శాతం వారంతా టీడీపీకి ఓటెయ్యడం ఇష్టం లేకనే అలా చేశారని అర్థమవుతుంది. ప్రభుత్వం ఉద్యోగులను వేధిస్తున్న దానికి నిరసనగానే వారంతా టీడీపీకి ఓటెయ్యడానికి ఇష్టపడలేదు. అయితే చంద్రబాబు మాత్రం తన ఘనతగా ప్రచారం చేసుకుని అపర చాణక్యుడిలా బిల్డప్‌లు దంచేస్తున్నారు. ఇక పచ్చ ఛానెళ్లు ఉండనే ఉన్నాయి చంద్రబాబు ఏం చేసినా కీర్తించడానికి.. ప్రతిపక్ష నాయకుడిలో తప్పులు వెతకడానికి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం 2012లో 18 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయదుందుభి మోగిస్తే టీడీపీ డిపాజిట్లు కోల్పోయింది. అన్ని చోట్లా మూడో స్థానానికే పరిమితం అయ్యింది. గంటలకు గంటలు విశ్లేషణలు చేసే పచ్చ ఛానెళ్లకు మాత్రం ఇవేమీ కనపడవు. 
Back to Top