వైఎస్ జగన్ దీక్షపై చంద్రబాబు అక్కసు..!

వైఎస్ జగన్ ను చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించిన మీడియా..?
మీ ఇంట్లో దీక్ష చేస్తే ఊరుకుంటావా అంటూ  విలేకరులపై ఆగ్రహం..!
పచ్చచొక్కాల వింత ప్రవర్తన..!

న్యూఢిల్లీః ప్రత్యేకహోదా సాధన కోసం పోరాడుతున్న ప్రతిపక్షనాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షపై చంద్రబాబు తన అక్కసు వెళ్లగక్కాడు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమిస్తున్న జననేత దీక్షను సమర్థించాల్సిందిపోయి అవహేళన చేసేలా మాట్లాడారు. ఎక్కడిపడితే అక్కడ దీక్షలు చేస్తారా..? ట్రాఫిక్ జామ్ చేస్తే చూస్తూ ఊరుకోవాలా..?చనిపోతామని దరఖాస్తు చేసుకుంటే ఎలా అనుమతిస్తారు..? మీరు అలాంటి వాటికి మద్దతు తెలపడం నేరమంటూ మీడియాపై చిందులు తొక్కారు. రాష్ట్రానికి ఓ ముఖ్యమంత్రి అయి ఉండి బాధ్యత మరచి విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు.

హక్కుపై ఉక్కుపాదం..!
విపక్షనేతను చూసి ఎందుకు భయపడుతున్నారని, దీక్షను ఎందుకు అడ్డుకుంటున్నారని, మీరు గతంలో దీక్షలు చేశారుకదా అని ప్రశ్నించిన విలేకరులపై చంద్రబాబు శివాలెత్తారు. మీ ఇంట్లో దీక్ష చేస్తామంటే అనుమతిస్తావా..? దానికి చట్టం ఒప్పుకుంటుందా అంటూ విసుక్కున్నారు. హోదాను సాధించుకునేందుకు ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందడంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఆ బాధ్యతను తన  భుజస్కందాలపై వేసుకున్నారు. నిరాహార దీక్షను ఓ హక్కుగా భావించి ఆంధ్రుల హక్కైన ప్రత్యేకహోదా కోసం ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు.  ప్రజాసంక్షేమం కోసం ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడుతున్న వైఎస్ జగన్ కు మద్దతుగా రాష్ట్ర ప్రజానీకమంతా కదం తొక్కుతుంటే ...చంద్రబాబు మాత్రం దీక్షను అణగదొక్కే పనులు చేస్తున్నారు. 
Back to Top