గిరిజనులకు ద్రోహమే..!మైదాన ప్రాంతానికి దూరంగా
ఉంటూ అడవుల్లో తమ బతుకు తాము బతుకుతున్న గిరిజనులంటే ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడుకి పెద్దగా పట్టదు. అందునా గిరిజన ప్రాంతాల్లో దాదాపుగా అన్ని ఎమ్మెల్యే
స్థానాలను (ఒక్క పోలవరం మినహా) ప్రతిపక్ష వైఎస్సార్సీపీ గెలుచుకొంది. దీన్ని మనస్సులో
పెట్టుకొన్న చంద్రబాబు గిరిజనుల సంక్షేమాన్ని అస్సలు పట్టించుకోవటం లేదు.

రాజ్యాంగం ప్రకారం గిరిజనుల
హక్కులు, గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోవాల్సిన ప్రత్యేక బాధ్యత రాష్ట్ర
గవర్నర్ మీద ఉంటుంది. రాష్ట్రంలో గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ
సలహా మండలి నేరుగా గిరిజనులకు సంబంధించిన విధాన నిర్ణయాలు, సంక్షేమ పథకాల్ని
పరిశీలిస్తూ ఉంటుంది. గిరిజనులకు ఇబ్బంది కలిగే పరిస్థితి తలెత్తితే ఈ విషయాల్ని
గవర్నర్ ద్రష్టికి తీసుకొని వస్తుంది. సాధారణంగా గవర్నర్ తన విధుల్ని రాష్ట్ర
ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి సలహా మేరకు నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ,
గిరిజనులకు సంబంధించిన అంశాల విషయంలో మాత్రం గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ విధానాల్ని
ప్రశ్నించగలుగుతారు. ఈ ప్రక్రియ సజావుగా జరగాలంటే గిరిజన సలహా మండలిని
నియమించాల్సి ఉంటుంది.

కానీ, రాష్ట్రంలో
గిరిజనులంతా ప్రతిపక్ష వైఎస్సార్సీపీని గెలిపించినందున చంద్రబాబు వారి మీద కక్ష
కట్టారు. గిరిజన సలహా మండలిని నియమించాల్సి వస్తే అందులో వైఎస్సార్సీపీ
ఎమ్మెల్యేలను నియమించాల్సి వస్తుందని,  ఆ
సలహా మండలి అప్పుడు చైతన్య వంతంగా పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. గిరిజనులకు
ద్రోహం చేసే పనుల్ని తలపెడితే ఈ సలహా మండలి వెలికితీసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ గిరిజన
మండలిని నియమించకుండా కాలక్షేపం చేస్తోంది. తద్వారా గిరిజనుల సంక్షేమాన్ని గవర్నర్
పర్యవేక్షించకుండా బంధనాలు వేస్తున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top