చంద్రబాబు పాపాలకు నిలువెత్తు దర్పణం

() జాతీయ స్థాయిలో
చర్చనీయాంశం అయిన చంద్రబాబు

() భూ దందాతో ఎకా
ఎకిన ధనవంతుల జాబితాలో స్థానం

() రాష్ట్ర
మంత్రుల్లో సగం మంది క్రిమినల్సే

() నలుగురు
మంత్రులు అత్యంత తీవ్రమైన నేరాలు చేసిన వారుగా గుర్తింపు

() మహిళల్ని
వేధించిన కేసుల్లో టాపర్లుగా మంత్రి దేవినేని, అచ్చెన్నాయుడు

 

రెండేళ్లుగా
చంద్రబాబు చేస్తున్న అవినీతి, అరాచకాల దందా తో మంత్రుల పేర్లు జాతీయ స్థాయిలో
మార్మోగిపోతున్నాయి. అసోసియేషన్ ఆఫ్ డెమక్రాటిక్ రీఫార్మ్స్ అనే జాతీయ స్థాయి
సంస్థ చేసిన సర్వే లో నిప్పులాంటి నిజాలు బయట పడ్డాయి.

 

ధనికుల దందా

రెండేళ్లుగా
అమరావతి పేరుతో చంద్రబాబు సాగిస్తున్న భూ దందా అంతా ఇంతా కాదు. అంతర్జాతీయ స్థాయిలో
జరుగుతున్న ఈ అవినీతి కుంభకోణానికి సూత్రధారి చంద్రబాబు అయితే పాత్రధారి మునిసిపల్
మంత్రి నారాయణ. సింగపూర్ బినామీ కంపెనీలతో చేసే లావాదేవీలన్నీ పూర్తిగా  ఈ ఇద్దరికే తెలుసు. సంబంధిత మంత్రులకు కూడా వీటి
వివరాలుచెప్పకుండా దందా సాగిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో
అనధికారికంగా నల్లధనం ఏ స్థాయిలో పోగు పడుతోందో లెక్క పెట్టడానికి కూడా సాధ్యం
కాదు. అధికారికంగా పోగేసుకొంటున్న ఆస్తుల్లోనే దేశంలోనే టాప్ స్థాయికి
వెళ్లిపోయారు. ఏడీయార్ సంస్థ అందించిన వివరాల ప్రకారం రూ. 496 కోట్ల రూపాయిల
ఆస్తులతో మంత్రి నారాయణ మొదటి స్థానంలో నిలిచారు. 177 కోట్ల తో చంద్రబాబు నాయుడు
నాలుగో స్థానంలో నిలిచారు. ఇవి నికరంగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న ఆస్తులు, అదే
అనధికార ఆస్తుల్ని లెక్క చూస్తే అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకులు కొట్టేసి ఉండేవారు.

 

సగం మంది మంత్రులు
క్రిమినల్సే

చంద్రబాబు
అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు చెలరేగిపోతున్నారు. మాఫియాలు, స్కాములు, కుంభకోణాలతో
అడ్డూ అదుపు లేకుండా దూసుకొని పోతున్నారు. టీడీపీ నాయకుల జోలికి పోవాలంటే పోలీసు
యంత్రాంగం వణికి పోతోంది. ఇసుక మాఫియాను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన ఒక మహిళా
తహశీల్దార్ ను జుట్టు పట్టి ఇసుకలో ఈడ్పించి కొట్టించాడో ప్రభుత్వ విప్. ఇక
విజయవాడ వేదికగా కాల్ మనీ సెక్సు రాకెట్ కు పాల్పడి వేల మంది మహిళల మాన ప్రాణాలతో
ఆటలాడుకొన్న నీచులంతా టీడీపీ నేతలే అనటంతో సందేహం లేదు. టీడీపీ ప్రభుత్వంలోని
మంత్రుల గుణాలన్నీ లెక్క చూస్తే సగం మంది మంత్రులు క్రిమినల్స్ అని ఏడీయార్ సర్వే
లెక్క తేల్చింది. 50 శాతం మంది మంత్రుల మీద పోలీసు కేసులు ఉన్నాయి. పైగా అందులో
నలుగురు అతి తీవ్రమైన క్రిమినల్స్ అని గుర్తించింది. మహిళల్ని తీవ్రంగా వేధించిన
మంత్రుల్ని లెక్క చూస్తే అందులో మొదటి, రెండో ర్యాంకులు తెలుగు తమ్ముళ్లవే. మొదటి
ర్యాంక్ లో టీడీపీ మంత్రి దేవినేని ఉమ నిలుస్తుండగా, రెండో ర్యాంక్ లో మంత్రి
అచ్చెన్నాయుడు చేరి ఉన్నారు. అసెంబ్లీ లో నీతులు చెప్పే ఈ ఇద్దరు మంత్రుల వాస్తవ
రూపం ఇదన్న మాట.

 

చంద్రబాబు బాటలోనే
మంత్రులు

ముఖ్యమంత్రి గా
చంద్రబాబు సక్రమమైన మార్గంలో నడిస్తే, మిగిలిన మంత్రులు ఆ బాటలో నడుస్తారని
ఆశించవచ్చు. స్వయంగా చంద్రబాబే పట్టిసీమ, లిక్కర్ మాఫియా, రాజధాని దందా వంటి
అవినీతి పనులకు పాల్పడుతూ ఉంటే, ఇక మంత్రులు ఎలా నీతిమంతులుగా ఉంటారని ఆశిస్తాం.
అందుకే మంత్రులు కూడా చెలరేగిపోయి అవినీతి పనులకు పరుగులు తీస్తున్నారు.
ముఖ్యమంత్రే స్వయంగా మహిళల మీద దౌర్జన్యాలకు పాల్పడిన కేసుల్ని సెటిల్ మెంట్
చేయిస్తు ఉంటే ఇక మంత్రులు ఏమాత్రం ఆగతారు. అందుకే టీడీపీ మంత్రిమండలి ఖ్యాతి
జాతీయ స్థాయికి ఎక్కింది.

 

 

Back to Top