చంద్రబాబుది వంచన రాజకీయం

() రాజ్యసభ సీటు కోసం
జిత్తుల మారి యత్నాలు

() నాలుగో అభ్యర్థిని
బరిలోకి దింపేందుకు ఎత్తుగడలు

() పాలన గాలికి
వదిలేసి మంత్రులకు టార్గెట్ పెట్టిన చంద్రబాబు

() ఫిరాయించిన
ఎమ్మెల్యేలతో సమాలోచనలు

హైదరాబాద్) నిప్పు,
విలువలు, వగైరా పేర్లు పదే పదే పలికించే చంద్రబాబు వాస్తవంలో తన బుద్ధి మరోసారి
బయట పెట్టుకొంటున్నారు. రాజ్యసభ సీట్ల కోసం నీచాతి నీచమైన రాజకీయాలకు
పాల్పడుతున్నారు. తగినంత బలం లేకపోయినప్పటికీ నాలుగో అభ్యర్థిని రంగంలోకి దింపి
అల్పబుద్ది ప్రదర్శిస్తున్నారు.

          ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి నలుగురు
రాజ్యసభ ఎంపీలను ఎన్నుకొనేందుకు నోటిఫికేషన్ విడుదల అయింది. ప్రాతినిధ్య ఓటు
బదలాయింపు పద్దతిలో ఈ ఎన్నిక జరుగుతుంది. అంటే ఎమ్మెల్యేలు తమ మొదటి ఓటుని, రెండో
ఓటుని, మూడో ఓటుని నాలుగో ఓటుని సూచించాలి. అయితే స్థిరీకరించబడిన విలువల ప్రకారం మొదటి
ఓటుని 36 మంది ఎమ్మెల్యేలు సూచిస్తే ఆ అభ్యర్థి గెలుపు ఖాయం.

          ఈ లెక్కన చూస్తే తెలుగుదేశానికి
అసెంబ్లీ లో 102 మంది సభ్యుల బలం ఉంది. ముగ్గురు అభ్యర్థుల్ని గెలిపించుకోవాలంటే
108 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అంటే టీడీపీ కి తోడు ఇద్దరు ఇతర అభ్యర్థులు,
నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు జత కూడితే అప్పుడు ముగ్గురు ఎంపీ ల ఎన్నికకు మార్గం
సుగమం అవుతుంది. ప్రతిపక్ష పార్టీ వైయస్సార్సీపీ కి సాంకేతికంగా 67 మంది
ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అందులో దాదాపు 17 మంది దాకా నగదు, ఇతర ప్రలోభాలకు ఆశపడి
పార్టీ ఫిరాయించారు. అయినప్పటికీ 50 మంది దాకా ప్రతిపక్ష వైయస్సార్సీపీ కి
ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో నాలుగో స్థానం నుంచి వైయస్సార్సీపీ అభ్యర్థి
గెలుపొందటం ఖాయం.

          వంచన, నీచపూరిత రాజకీయాలకు
పెట్టిందిపేరైన చంద్రబాబు ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ముగ్గురు
అభ్యర్థుల్ని గెలిపించుకొనేందుకు సరిపడా బలం ఉన్న చంద్రబాబు నాలుగో అభ్యర్థి కోసం
పథక రచన చేస్తున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలను
కొనేందుకు ప్రయత్నించి చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయారు. అయినప్పటికీ
బాబు వైఖరిలో మార్పు రాలేదు. తగినంత బలం లేకపోయినప్పటికీ నాలుగో అభ్యర్థిని
రంగంలోకి దింపి కోట్లు కుమ్మరించి గెలిపించుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
దీన్ని బట్టి నీచాతి నీచమైన రాజకీయాలకు తెగబడుతున్నారని అర్థం అవుతోంది. 

Back to Top