కొత్త అప్పు తెచ్చుకో..పాత అప్పు పట్టుకో

హైదరాబాద్: రాజధాని శంకుస్థాపనకు 400 కోట్లు తగలేయాలని చంద్రబాబు ఫిక్స్ అయిపోయారు. ఇందుకోసం ఖజానా ను ఊడ్చి పెట్టేందుకు సిద్ద పడుతున్నారు. అదే సమయంలో ప్రజల నెత్తిన అప్పులు కుప్పను మిగిల్చేందుకు ఆరాట పడుతున్నారు. 

రాష్ట్రంలో డబ్బులు పూర్తిగా అయిపోయాయి. చంద్రబాబు ప్రత్యేక విమాన ఖర్చులు, దుబారాలు, స్టార్ హోటళ్లలో మీటింగ్ లకు ఉన్న డబ్బు అయిపోయింది. రెండు రోజుల కింద మార్కెట్ నుంచి అప్పు కింద 15 వందల కోట్ల రూపాయిలు తెచ్చారు. దీంతో వేస్ అండ్ మీన్స్ పద్దు కింద 770 కోట్లు, ఓవర్ డ్రాఫ్ట్ కింద 100 కోట్లు చెల్లించారు. 600 కోట్లు చేతిలో ఉన్నాయి. నాలుగైదు పెద్ద పద్దులకు బిల్లులు చెల్లిస్తే ఈ మొత్తంలో కొంత చిల్లు పడుతుంది. ఈలోగా శంకుస్థాపన కింద వందల కోట్ల రూపాయిల ఖాళీ అయిపోయేట్లుగా పరిస్థితి ఉంది. 
మొత్తం మీద అప్పు చేసి పప్పు కూడుకి చంద్రబాబు సిద్ద పడుతున్నారు. కొత్త అప్పు తెచ్చి పాత అప్పులను సర్దుబాటు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్ప గా మారుస్తున్నారు. 
Back to Top