చంద్రన్నకానుకల్లో భారీ అవినీతి

హోటళ్లో అక్రమార్కుల మకాం
రహస్యంగా టెండర్లు..రూ.400 కోట్లు హాంఫట్

హైదరాబాద్
: పచ్చసర్కార్ అవినీతికి అంతే లేకుండా పోతోంది. తెలుగుతమ్ముళ్లు
రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని
అన్ని విధాలుగా లూటీ చేసిన చంద్రబాబ్ అండ్ కో...మరో దోపిడీకి రంగం సిద్ధం
చేసింది. సంక్రాంతి పండుగకు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన చంద్రన్న కానుల్లో
...మరోసారి భారీ అవినీతికి తెరలేచింది. సుమారు రూ. 400 కోట్ల మేర
నొక్కేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్
అవినీతి తతంగానికి వేదికైంది. 

చంద్రన్న కానుక
ద్వారా 6 రకాల వస్తువులను అర, పావు కిలోల లెక్కన సంక్రాంతికి అరకొరగా
అందించారు. ఆతర్వాత మళ్లీ సరుకులు అందించిన  పాపాన పోలేదు టీడీపీ
ప్రభుత్వం. చంద్రన్న కానుకల పేరుతో అప్పట్లో భారీగా అవినీతి వెలుగుచూసింది
కూడా. తెలుగుతమ్ముళ్లు సరుకులను దారిమళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇప్పుడు మరోసారి చంద్రన్న కానుకలకు సంబంధించి నగరంలోని ఓ హోటళ్లో రహస్యంగా
టెండర్ లు పాడుతున్నారు. నిన్నటి నుంచే హోటళ్లో మకాం వేసిన
అక్రమార్కులు...60 ల్యాప్ ట్యాప్ ల ద్వారా ఈ-టెండర్ వేస్తున్నారు. 

ఒక
దానిపై ట్యాక్స్, మరో దానిపై ట్యాక్స్ లేకుండా పరాయి రాష్ట్రంలో కొందరు
వ్యక్తులకు ఉద్దేశపూర్వకంగా లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పేషీలోని వ్యక్తులకు దీనిలో సంబంధాలున్నట్లు ఆరోపణలు
వినిపిస్తున్నాయి. పై స్థాయి నుంచి కింద స్థాయి వరకూ పంపకాలకు
సిద్ధమయ్యారు. ఇక రివర్స్ బిడ్‌ పేరులో కూడా భారీగా రింగ్ అయ్యారు.  ఈ
వ్యవహారంలో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నారు.  
Back to Top