మాదారి దొడ్డిదారి అంటున్న చంద్రబాబు

() మొదట నుంచి కాసుల్ని నమ్ముకొన్న చంద్రబాబు

() విలువల్ని తుంగలోకి తొక్కి వ్యవహరిస్తున్న బాబు

() చివరి నిముషం దాకా నాలుగో అభ్యర్థి కోసం ప్రయత్నం

() ఎన్నికలు అంటేనే డబ్బుల వ్యవహారంగా చంద్రబాబు మేనేజిమెంటు 

హైదరాబాద్) రాజ్యసభ ఎన్నికల నామినేషన్ చివరి రెండు రోజుల పాటు  చంద్రబాబు చేసిన ప్రయత్నాలు చూసి ప్రజాస్వామ్య
వాదులు ఆశ్చర్యపోతున్నారు. బలం లేకపోయినా నాలుగో అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు
విఫలయత్నం చేశారు. చివరకు పరువు పోతుందన్న భయంతో వెనుకడుగు వేశారు.

      రాజ్యసభ కు ఎన్నిక అవ్వాలంటే 36
మంది ఎమ్మెల్యేల మొదటి ప్రాతినిధ్య ఓటు కావాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తుంటే
ముగ్గురు అభ్యర్థుల్ని గెలిపించుకోవాలంటే 108 మంది ఎమ్మెల్యేల బలం తప్పనిసరి.
వాస్తవానికి టీడీపీకి అధికారికంగా ఉన్న బలం 102, ఇద్దరు స్వతంత్ర్య సభ్యులు,
నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలతో కలుపుకొంటేనే ఈ సంఖ్య సమకూరుతోంది. అంటే ముగ్గురిని
గెలిపించుకోవటానికే బొటా బొటీ బలం అన్నమాట.

చివరి దాకా అడ్డదారి ప్రయత్నాలు

      వైయస్సార్సీపీ నుంచి సిగ్గు
లేకుండా డబ్బు పెట్టి కొనుగోలు చేసిన 17 మంది ఎమ్మెల్యేలతో కలుపుకొని మరో
అభ్యర్థిని నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రయత్నం చేశారు. ఇందుకోసం
చివరి రెండు రోజులు విస్తారంగా మంతనాలు సాగించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో
ఫిరాయింపు ఎమ్మెల్యేలతో నాలుగు గంటల పాటు చర్చలు జరిపారు. పరిపాలన ను గాలికి
వదిలేసి మంత్రుల్ని ఈ పని కోసం పురమాయించారు.

గతమెంతో ఘనకీర్తి

      తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం
లేకపోయినా టీడీపీ ఏడాది క్రితం అభ్యర్థిని దింపింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ
చంద్రబాబు అండ్ గ్యాంగ్ పక్కాగా దొరికిపోయింది. ఆడియో, వీడియో టేపుల సాక్షిగా
చంద్రబాబు బాగోతం ప్రపంచానికి తెలిసి వచ్చింది. వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో దిట్ట
అయిన చంద్రబాబు వెంటనే తన అరాచక మెదడుకు పదును పెట్టారు. ప్రజల ప్రయోజనాల్ని
తాకట్టు పెట్టారు. దీంతో కేసు గండంనుంచి బయట పడ్డారు.

మారని చంద్రబాబు బుద్ది

      అడ్డగోలుగా దొరికిపోయినప్పటికీ
చంద్రబాబు బుద్ది మారలేదు. ఎన్నిక ఏదైనా గెలుపు తమదే కావాలంటూ మహానాడు వేదికగా
క్యాడర్ కు పిలుపు ఇచ్చారు. ఏ దారిలో అయినా గెలుపు సాధించటమే లక్ష్యంగా పనిచేయాలని
సూచించారు. అన్నట్లుగా రాజ్యసభ ఎన్నికల్లో సైతం అడ్డదారిలో ప్రయాణించేందుకు
తహతహలాడారు. చివరకు దారులు మూసుకోవటంతో తోక ముడిచారు.

 

Back to Top