పోలవరానికి ‘చంద్ర’ గ్రహణం

  • పోలవరం ఆహా ఓహో అని ప్రభుత్వం తనకు తానే కితాబు
  • కేంద్రం, పోలవరం కమిటీల అసంతృప్తిని కూడా తిరగేసి రాసిన పచ్చమీడియా
  • అంతా తూతూ మంత్రంలా ఉందన్న పోలవరం కమిటీ
  • పరిహారాల విషయంలో ఏం చేసారని ప్రశ్నించిన అధికారులు
  • నిర్మాణ పనుల జాప్యం పై పరిశీలన
  • కేంద్రం నిధులు రావడం ఇక హుళక్కే
  • ముడుపుల కోసమే బాబు పోలవరం జపం
 పోలవరం ఆంధ్రరాష్ట్రానికి ఒక వరం. లక్షలాది రైతులకు, ప్రజల తాగునీటి అవసరాలకు, పరిశ్రమలకు పుష్కలమైన నీటి వనరు. కాని దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టును కాగితాల్లో మూలిగేలా చేసారు పాలకులు. వైయస్ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు మోక్షం దక్కింది. పోలవరం తోపాటు, వంశధార, తోటపల్లి ప్రాజెక్టులను ఒకేసారి ఆరంభించారు దివంగతనేత వైయస్ రాజశేఖర్ రెడ్డి. వాటిలో పోలవరం తప్ప మిగిలిన రెండు ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసారు. ప్రజల అవసరాలను, ఆశలను గుర్తించి అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించి, సంక్షేమ పాలను అందించిన నాయకుడు వైయస్సార్. ఆయన కల అయిన పోలవరం ఆరంభం అయ్యాక హఠాత్తుగా మరణించారు. అప్పటి నుంచే పోలవరానికి మళ్లీ గ్రహణం పట్టింది. పోలవరం కుడికాలువను తవ్వించిన ఘనత వైయస్ఆర్ దే. అప్పుడు వైయస్ఆర్ అన్ని అనుమతులు తీసుకొచ్చి పోలవరానికి అంకురార్పరణ చేస్తే....దాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు.  

2014లో చంద్రబాబు సిఎమ్ అయిన తర్వాత జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నిర్మించాల్సిన పోలవరాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. అప్పటి నుండీ  ప్రాజెక్టు పనులేమో నత్తనడకన, వ్యయమేమో కుందేలు తీరునా సాగుతున్నాయి. మూడేళ్లలో పోలవరం అంచనా వ్యయం మూడు రెట్లు పెరిగింది. ప్రాజెక్టు మొదలైనప్పుడు దాని అంచనా వ్యయం 11వేల కోట్లు కాగా తాజా అంచనాల ప్రకారం పోలవరం వ్యయం 40వేల కోట్లు అంటోంది చంద్రబాబు సర్కార్. ఇంత భారీగా పెరిగిన అంచనా వ్యయాన్ని రాష్ట్రానికి ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుంటుందా అంటే మోడీ ప్రభుత్వం అందుకు ఒప్పుకున్నట్టుగా సమీకరణాలు లేవు. ఇప్పటికే పోలవరం పై కమిటీల మీద కమిటీలతో అంచనా వ్యయం పెరుగుదల, పనుల జాప్యం గురించి కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఇదే కాక నిర్మాణ లోపాలు, ఇంజనీర్ల అసమర్థత, టెండర్ల ప్రక్రియలో జరుతున్న లాలూచీల గురించి కూడా కేంద్రప్రభుత్వానికి నివేదికలు అందాయి. గుజరాత్ లో అతిపెద్ద జాతీయ స్థాయి ప్రాజెక్టు అయిన నర్మదాను, అతివేగంగా పూర్తిచేశారు మోడీ.  ఆయనకు పోలవరం విషయంలో చంద్రబాబు  వైఖరేమిటో పూర్తిగా తెలిసిపోయినట్టుంది. పోలవరం తన చేతికి రాకముందు ఉన్న కాంట్రాక్టర్ గురించి విమర్శించిన బాబు, ప్రాజెక్టు రాష్ట్రసర్కారు చేతికి వచ్చాక అదే కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించడంతోనే మోడీకి చంద్రబాబు పై అనుమానం మొదలైంది. అందుకే జాతీయ స్థాయి కమిటీలతో పరిశోధక బృందాన్ని వెంట వెంటనే పంపించారు. ఇటీవలే ఆ బృందాలు పోలవరాన్ని పరిశీలించి పెదవి విరిచాయి. ఈ పద్ధతిలో సాగితే పోలవరం 2018కి కాదు కదా 2019కి కూడా పూర్తయ్యే అవకాశమే లేదని తేల్చేసాయి. ఆడిట్ పూర్తయి అంచనా వ్యయాల పెరుగుదలకు కారణాలు తేలితేకాని రాష్ట్రానికి నిధులు అందిచలేమని తేల్చేసాయి. 

అసలు చంద్రబాబు కు పోలవరం ప్రాజెక్టు పై చిత్తశుద్ధి లేదని విపక్ష నేతలు ఆరోపించడంలో వాస్తవం లేకపోలేదు. 1996 దేవెగౌడ ప్రధానిగా ఉన్నసమయంలో పోలవరానికి నిధులు ఇస్తామని, నివేదిక పంపమని అడిగినా చంద్రబాబు దాని ఊసే ఎత్తలేదు. కాని వైయస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం కోసం తపించి దాన్ని ప్రారంభించారు.  ఇక దాన్ని ఆపడం సాధ్యం కాలేదు కనుక సాధ్యమైనంతగా ఆలస్యం చేయడం, అలక్ష్యం చేయడం ద్వారా తన పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు చంద్రబాబు. దానికి కారణం కేంద్ర నిధులు విడుదల చేయకపోవడమే అనే కుంటి సాకుతో తప్పించుకోవాలని చూస్తున్నారు. పెంచిన అంచనా వ్యయం గురించి తెలుసుకునేందుకు కేంద్రం కమిటీలతో కాలక్షేపం చేస్తే, ఉన్న నిధులను గుటకాయస్వాహా చేస్తూ, ప్రాజెక్టు పనులను సాగదీస్తూ రాష్ట్రం కాలం వెళ్లబుచ్చేస్తోంది. మును ముందు ఈ నిర్మాణం పూర్తవుతుందా? కృష్ణా డెల్టా, రెండు గోదావరి జిల్లాలు, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగు నీరు అందుతుందా అంటే టిడిపి ప్రభుత్వం ఉన్నంతకాలం అది అనుమానాస్పదమే అంటున్నారు పరిశీలకులు.

తాజా వీడియోలు

Back to Top