చదువు చట్టబండలు చేస్తున్న చంద్రబాబు..!

స్కూళ్ల మూసివేతకు శ్రీకారం..!
ఆదర్శ పాఠశాలలను  కుదించే యత్నం..

హైద‌రాబాద్: ప్రతీ ఒక్కరూ చదువుకోవాలని తపించిన నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి  డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి. విద్యార్థులకు చదువు భారం కావొద్దనే ఉద్దేశ్యంతో బడిబాట, ఫీజు రియింబర్స్ మెంట్ లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి విద్యాదాతగా నిలిచారు. కానీ ఇప్పుడొచ్చిన చంద్రబాబు సర్కార్ వాటికి తూట్లు పొడుస్తోంది.  పిల్లలను చదువుకు దూరం చేస్తోంది. విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ప్రోత్సహించాల్సింది పోయి.. ఉన్న పాఠశాలలను కూడే మూసివేసేందుకు టీడీపీ సర్కార్ చర్యలు చేపట్టడం బాధాకరం.

స్కూళ్ల మూసివేత ముమ్మరం...!
80 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలను ఆదర్శపాఠశాలలుగా మార్పు చేస్తారు.  బడ్జెట్ పరిమితుల పేరుతో జిల్లాల వారీగా ఆదర్శపాఠశాలలను కుదించే బాధ్యతలను చంద్రబాబు డీఈఓలకు అప్పగించారు.  3,544 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ప్రభుత్వమే..ఇప్పుడు వాటిని తగ్గించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వతీరుపై ఆగ్రహావేశాలు..!
విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచిపోతున్న సమయంలో పాఠశాలల విలీన కార్యక్రమం చేపట్టడం గందరగోళానికి దారితీస్తోంది. విద్యార్థులను ఇతర పాఠశాలల్లోకి మార్చాలన్న ప్రతిపాదనను తల్లిదండ్రులు, విద్యావేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రైమరీ స్కూల్ పిల్లలను దూరంగా ఇతర పాఠశాలలకు పంపడం కష్టతరం అవుతుంది. దీనివల్ల పిల్లలు ఆయా పాఠశాలలకు దూరమవ్వడమే కాక, అసలు చదువులే మానుకునే పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top