సీక్రెట్ ఆఫ్ సింగపూర్ @చంద్రబాబు..!

లోపాయికారి ఒప్పందం కోసమే సింగపూర్...!
డెవలప్ మెంట్ పేరుతో భూముల పంపకం..!
నారాయణ,యనమలలే ఎందుకు వెళ్తున్నట్లు..!

హైద‌రాబాద్‌: దేవుని మాన్యాలు దొంగలు పంచుకున్నట్లు రైతుల భూములు పంచుకునేందుకు అధికారనేతలు, సింగపూర్ ప్రతినిధులు ఎడతెగని చర్చలు సాగిస్తున్నారు. ఇదే పనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సింగపూర్ వెళుతున్నారు. నూతన రాజధాని అమరావతి మాస్టర్ డెవలపర్ గా ఎంపిక చేయనున్న.... సింగపూర్ కు చెందిన అసెండాస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తదితరులతో చర్చించేందుకు చంద్రబాబు ఈనెల 20న విమానం ఎక్కుతున్నారు. ఐతే, సీఎంతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణలు వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతమంది మంత్రులున్న వీరిద్దరినే చంద్రబాబు వెంట తీసుకెళ్లడం వెనక మతలబేంటో చెప్పాలని ప్రజలు అడుగుతున్నారు. 

లోపాయికారి ఒప్పందం కోసమే..!
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మంత్రులిద్దరూ చంద్రబాబుతో సింగపూర్ కు పయనమవుతున్నారు. లోపాయికారి ఒప్పందాల కోసం రాజధాని డెవలప్ మెంట్ పేరుతో హైడ్రామా నడిపించేందుకు సింగపూర్ వెళ్తున్నారు. ఇప్పటికే రాజధాని డెవలప్ మెంట్ కు సంబంధించి అసెండాస్ కంపెనీ ప్రతినిధులతో సీఆర్డీఏ అధికారులు చర్చించారు కూడా. మాస్టర్ డెవలపర్ గా ఉండేందుకు అసెండాస్..  ప్రభుత్వానికి కొన్ని షరతులు విధించింది . ఈనేపథ్యంలోనే అసెండాస్, సింగపూర్ ప్రతినిధులతో  సీక్రెట్ గా చర్చించేందుకు ముఖ్యమంత్రి బృందం సింగపూర్ కు తుర్రుమంటోంది. 

నాకు నీకు నోకియా..! బాబుది అంతా మాఫియా..!
తొలిదశలో రాజధానిలోని మూడు వేల ఎకరాల భూమిని అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వం అసెండాస్ కంపెనీకి అప్పగించింది. ఐతే, ఈల్యాండ్ పై పూర్తిహక్కు కావాలని షరతు విధించడంతో పాటు...ప్రతిగా ఐకానిక్స్ నిర్మాణం కోసం 250 ఎకరాలు  ఫ్రీగా ఇవ్వాలని అసెండాస్  కోరింది. ఇందుకు సంబంధించి సింగపూర్, ఏపీల మధ్య ఎలాంటి జాయింట్ వెంచర్ ఉండకూడదని మెళిక పెట్టింది. అలాగే నూతన రాజధానిలో భూముల విక్రయం ద్వారా వచ్చే నిధుల్లో వాటా కూడా అడుగుతోంది. ఈక్రమంలోనే ఇరువురి మధ్య సయోధ్యకు సింగపూర్ వేదికైంది.  ఫస్ట్ ఫేజ్ లో  కేపిటల్ డెవలప్ మెంట్ ని   2018 అక్టోబర్ నాటికి పూర్తి చేసేందుకు అసెండాస్ అంగీకరించింది. తొలిదశలో 3000 ఎకరాల అభివృద్ధితో పాటు మిగతా రాజధానిని 20 నుంచి 30 ఏళ్లలో డెవలప్ మెంట్ చేసేవిధంగా హక్కు కల్పించాలని అసెండాస్ పట్టుబడుతోంది. 
Back to Top