అంబేద్కర్ ఆత్మకు శాంతి కలుగు గాక

తెలుగుదేశం అధ్యక్షుడు
చంద్రబాబు మరోసారి తన బుద్ది ప్రదర్శించుకొన్నారు. అవసరం అనుకొంటే కాళ్లు, లేదంటే
జుట్టు పట్టుకొనే మనస్తత్వం ఉన్న చంద్రబాబు ఈ సారి తన స్వార్థ రాజకీయాల కోసం బాబా
సాహెబ్ అంబేద్కర్ ను ఉపయోగించుకొన్నారు.

అసెంబ్లీ శీతాకాల
సమావేశాల్ని అయిదు రోజుల పాటు మాత్రమే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే అయిదు రోజులు సరిపోదని, ఇంకా
ఎక్కువ రోజులు కావాలని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ విజ్జప్తి చేస్తోంది. అయతే
ఈ వినతిని బేఖాతరు చేస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

ఈ లోగా రాష్ట్రమంతా పట్టి
కుదిపేస్తున్న కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని అసెంబ్లీ వేదికగా
లేవనెత్తేందుకు వైఎస్సార్సీపీ సమాయత్తమైంది. ఈ విషయంలో తమ దగ్గర జవాబులేదని
గ్రహించిన చంద్రబాబు ఒక్కసారిగా అంబేద్కర్ అంశాన్ని తెర మీదకు తెచ్చారు. అంబేద్కర్
ఈ దేశానికి చేసిన త్యాగాల్ని చర్చిద్దామంటూ ప్రతిపాదించారు. అంతేకానీ, కాల్ మనీ ,
లిక్కర్ మాఫియా వంటి ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా పక్కకు పెట్టించే
పనిచేపట్టారు. ప్రజా సమస్యలు అంటే అంబేద్కర్ వ్యతిరేకులు అని, దళిత జాతి
వ్యతిరేకులు అని ముద్ర వేసేందుకు, బురద చల్లేందుకు ప్రయత్నించారు.

అసలు అంబేద్కర్  125వ జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించింది
వైస్సార్సీపీ నే. నవంబర్ 26న పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపటమే కాకుండా గుంటూరు
వేదికగా పెద్ద ఎత్తన ర్యాలీ, సభ నిర్వహించింది. అయినప్పటికీ ఏ మాత్రం మాటలాడకుండా
అసెంబ్లీ లో అయిదు రోజుల్లోనూ 1,2 రోజులు దీని మీదకు మరల్చేందుకు ప్రయత్నాలు
చేసింది. దీన్ని బట్టి చంద్రబాబు వైఖరి అందరికీ తెలిసి వచ్చింది. 

Back to Top