ఆంధ్రప్రదేశ్‌లో గాడి తప్పిన పాలనఈవెంట్ మేనేజర్ అవతారమెత్తిన ముఖ్యమంత్రిబాబు పబ్లిసిటీ పిచ్చికి గోదావరి పుష్కరాల్లో 30 మంది మృత్యువాతఅమరావతి శంకుస్థాపనలతో కాలయాపనత్వరలో విశాఖ నగరంలో ప్రేమికుల ఉత్సవం బాబు ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలుచంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రో.. ప్రచారకర్తనో సామాన్యులకే కాదు సొంత పార్టీ నేతలకు, కార్యకర్తలకు కూడా అర్థం కావడం లేదు. పనికొచ్చే విషయాలకు తక్కువగా.. పనికిమాలిన అంశాలమీద ఎక్కువగా ఆయన స్పందించడం చూసి మతిపోతోంది. ప్రతి సందర్భంలోనూ అతిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బాబుకు బొత్తిగా చెవికెక్కడం లేదు. సందర్భం ఉన్నా.. లేకపోయినా కల్పించుకుని మరీ ఆయన చేస్తున్న ప్రచార ఆర్భాటం చూస్తుంటే బాబుకు మతి భ్రమించిందని జనం చెప్పుకుంటున్నారు. ఇప్పుడు బహిరంగ సభల్లో మైకుల్లో వార్నింగ్‌లిచ్చే బాబు రాబోయే రోజుల్లో జనాల్లోకి దూకి కరిచినా కరిచేసే పరిస్థితి వచ్చినా రావొచ్చని అనుకుంటున్నారు.
రాజధాని పేరుతో బాబు అక్కడ చేస్తున్న వికృత చేష్టలు అన్నీ ఇన్నీ కావు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా పునాదిరాయి కూడా వేయని బాబు..అదిగో అద్భుత రాజధాని అంటూ జనం చెవిలో పువ్వులు పెడుతున్నాడు. రాజధాని ప్రాంతంలో ఎక్కడ చూసినా పిచ్చిమొక్కలే దర్శనమిస్తున్నాయి. కానీ ప్రపంచస్థాయి రాజధాని అంటూ బాబు మాటల కోటలు దాటిస్తున్నాడు. ఇక రాజధాని అమరావతికి క్లాప్ కొట్టిన దగ్గర్నుంచి బాబు చేస్తున్న వింతలు మతిపోయేలా చేస్తున్నాయి. ఓ సారి దంపతులతో కలిసి భూమి పూజ చేస్తాడు. మరోసారి ప్రధానిని తీసుకొచ్చి రాజధానిలో మట్టి, నీళ్లు కొట్టి శంకుస్థాపన చేసి ఇదే అమరావతి అద్భుత నిర్మాణం అని చెప్పేస్తాడు. మరోసారి శంకుస్థాపనకు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని తీసుకొచ్చి బాగా చేస్తున్నానని యథావిథిగా గొప్పలు చెప్పుకుంటాడు. బాబు మీటింగ్‌లు విన్న వారికి పస తక్కువ నస ఎక్కువ అన్నట్టు తయారైంది. మాయమాటలతో బురిడీ కొట్టిస్తూ...బాబు చేస్తున్న పబ్లిసిటీ హంట్, హంగూ ఆర్భాటాలు చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. బాబు ఎకిలిచేష్టలను చూసి నవ్వుకుంటున్నారు.
అన్నీ ఈవెంట్‌లే..!కొంతకాలం క్రితం జరిగిన పుష్కరాల్లో బాబు చేసిన ’ఓవర్ యాక్షన్’ చూశాం. పుష్కరాల ప్రాశస్త్యం, పుణ్య స్నానం ప్రాధాన్యం, పవిత్ర సగమం విశిష్టత...ఒకటా రెండా? అదేపనిగా వాయించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ణా నదిలో గోదావరిని కలిపారు. అంటే రెండు నదులను అనుసంధానం చేశారు. దాన్ని ’పవిత్ర సంగమం’గా ప్రచారం చేశారు. ఆంధ్రా సర్కారు గోదావరి– కృష్ణా నదులు కలిసే ప్రాంతం అంటే సంగమ ప్రదేశం అత్యంత పవిత్రమైందని, అక్కడ స్నానం చేస్తే బోలెడు పుణ్యం వస్తుందని సర్కారు ప్రచారం ప్రారంభించింది. పవిత్ర సంగమమే కావొచ్చు. కాదనం. కానీ బాబు సంగమాన్ని ఇంకా వదిలిపెట్టలేదు. తాజాగా ఈ సంగమం దగ్గర దీపావళి పండుగ జరుపుకోవడం శుభపరిణామమని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలంతా ఈ సంగమం దగ్గర దీపావళి సంబరాలు జరుపుకోవాలంటూ మరొపదం అందుకున్నారు. సంగమం దగ్గర ప్రజలంతా దీపావళి జరుపుకోవడంవల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందని చెప్పారు. దీపావళి టపాసులకే కాలుష్యం తగ్గిపోతే ప్రపంచ దేశాల నాయకులంతా తలలు బద్దలు కొట్టుకోవడం ఎందుకు? వేలాది ఎకరాల్లో అడవులు కొట్టేసి పరిశ్రమలకు భూములు ఇవ్వాలనుకుంటున్నారు చంద్రబాబు. వాటి ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గించడానికి, అడవులు లేకపోవడంతో కలిగే నష్టానికి దీపావళి టపాకాయలే పరిష్కారమంటారా? రాష్ట్ర ప్రజలంతా ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఏడాది పొడవునా వేడుకలు నిర్వహిస్తున్నట్లు బాబు చెప్పారు. అంటే సమస్యలనుంచి ప్రజల కళ్లు కప్పేందుకు పండుగల సెంటిమెంట్ తో కొట్టి మేనేజ్ చేస్తున్నాడన్నమాట
30 మందిని పొట్టనబెట్టుకున్నాడుగోదావరి పుష్కరాల ప్రారంభోత్సవం పేరుతో మొదటిరోజు బోయపాటి శ్రీనుతో షూటింగ్ ఏర్పాటు చేసిన బాబు తొక్కిసలాటకు కారకుడయ్యాడు. దాదాపు 30 మందిని పొట్టనబెట్టుకున్న సంగతి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ సంఘటన నుంచి బాబు గుణపాఠం నేర్చినట్టే కనబడలేదు. పైగా పుష్కరాల చివరిరోజు మళ్లీ హడావుడి చేసి అందర్నీ ఆందోళనకు గురిచేశాడు. ఇదంతా మరువకముందే మళ్లీ కష్ణా పుష్కరాలకు అదే హడావుడి. గోదావరి పుష్కరాల సీన్ రిపిట్ చేయబోయి బాబు భంగపడ్డాడు. అన్ని వైపుల నుంచి బాబుపైకి విమర్శలు వెల్లువెత్తడంతో తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది. లేకుంటే మళ్లీ ఎంతమందని పొట్టనబెట్టుకుని ఉండేవాడో..
విశాఖలో ప్రేమికుల ఉత్సవం..మతిపోయిందా..!త్వరలో విశాఖ నగరంలో ప్రేమికుల ఉత్సవం నిర్వహించడానికి బాబు శ్రీకారం చుట్టారు. విశాఖలో కొన్ని రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారట. ఇందుకోసం దేశం నలుమూలల నుంచీ ప్రేమికులను ఆహ్వానిస్తారట. ప్రేమికులంతా ఇక్కడి హోటళ్లలో దిగుతారు. వ్యాపారమే వ్యాపారం. మామూలుగా అయితే లవర్స్ అంటే హోటల్ నిర్వాహకులు రూమ్‌లు ఇస్తారా? పైగా పోలీసుల రైడింగ్? అదే ప్రభుత్వమే ఆహ్వానిస్తే, హోటళ్లు సాదరంగా స్వాగతిస్తాయి. రూములు ఇస్తాయి. పోలీసులు గమ్మునుంటారు. భలే మంచి అవకాశం అని ప్రతీఒక్కరూ విశాఖలో వాలిపోతారు. ఉత్సవంలో భాగంగా బీచ్ పొడవునా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తారట. వాటిల్లో సరదా పోటీలు, కాసినోల్లాంటివి కూడా వుంటాయట. ఎక్కడికెక్కడ బార్ అండ్ రెస్టారెంట్టు ఇప్పటికే వున్నాయి. అందువల్ల బీర్లకు కొదవే వుండదు. సో.. మొత్తానికి కురక్రారు హోటళ్లలో దిగి, బీచ్ లో తిరిగి, ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేయమని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందన్నమాట. అయితే ఇదంతా ఎందుకు అంటే విశాఖ ఎన్నికలు వస్తున్నాయి కదా, జనాలను ఆకట్టుకోవాలి. అందుకు ఇదో కొత్త స్కీం అన్నమాట. కానీ ఇక్కడే విశాఖ ప్రజలు మాత్రం బాబు చేష్టలకు మండిపడుతున్నారు. హుద్‌హుద్ తుపాన్ వస్తే మమ్మల్ని పట్టించుకోలేదు కానీ ఎన్నికలొస్తున్నాయని హడావుడి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా బాబే స్వయంగా ప్రేమికులను ఆహ్వానించి ఏపీ సంస్కృతీ సాంప్రదాయాలకు బీచ్‌లో పాతరేస్తున్నాడని విమర్శిస్తున్నారు.