భూ కుంభకోణం అంతా చంద్రబాబే చేయించారు..! రాజధాని కోసం భూ సమీకరణ పేరుతో
మూడు పంటలు పండే అత్యంత విలువైన భూములను రైతుల నుంచి బలవంతంగాలాక్కున్న
ముఖ్యమంత్రి సన్నిహితుల భూములను మాత్రం అంగుళం కూడా తీసుకోలేదు. రాజధాని
సరిహద్దులు బినామీల భూముల సమీపంలోకి వచ్చి ఆగిపోయాయి. లింగమనేని ఎస్టేట్స్  ప్రైవేట్ లిమిటెడ్ భూములకు కేవలం పది మీటర్ల దూరంలో రాజధాని
సరిహద్దు రేఖ ఆగిపోవడమే అందుకు ప్రబల నిదర్శనం. ఇందుకు ప్రతిగా ముఖ్యమంత్రికి
లింగమనేని గెస్ట్ హౌస్‌తో పాటు లింగమనేని ఎస్టేట్స్‌లో బాబు కుటుంబానికి వాటాలు
కూడా దక్కాయన్నది బహిరంగ రహస్యం. ల్యాండ్ పూలింగ్ నుంచి భూములను కాపాడడం.. ప్రతిగా
గెస్ట్‌హౌస్, వాటాలు అందుకోవడం.. క్విడ్ ప్రో
కోకు ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏముంటుంది?

 

లింగమనేనితో బాబు స్నేహ బంధం

లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్
లింగమనేని రమేష్ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్
పూర్తయిన తర్వాత చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు
ఆయనే ప్రత్యేక విమానం సమకూర్చారని టీడీపీ వర్గాల సమాచారం. గుంటూరుజిల్లా మంగళగిరి
మండలం కాజా, తాడికొండ మండలం కంతేరు గ్రామాల్లో
లింగమనేని గ్రూప్స్‌లోని వివిధ కంపెనీలు, కుటుంబ
సభ్యుల  పేర్లతో 2014 జూన్ వరకూ
632 ఎకరాల భూములను కొనుగోలు చేశారు. రాజధానిని గుంటూరు-విజయవాడ
మధ్యన ఏర్పాటు చేస్తామని ఓ వైపు సీఎం చంద్రబాబు, మరో వైపు
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటనలు చేస్తూ వచ్చారు. దాంతో
ఆందోళన చెందిన లింగమనేని రమేష్ తన భూములను కాపాడుకోవడానికి సీఎంపై ఒత్తిడి
తెచ్చారు.లింగమనేనికి రూ. 4 వేల కోట్ల మేర లబ్ది

లింగమనేనితో ఒప్పందం కుదరడంతో.. రాజధాని ఏర్పాటుపై
సీఎం స్పష్టత ఇచ్చారు. తాను అప్పటికే కొనుగోలు చేసిన భూమి పరిసర ప్రాంతాల్లో జూన్ 8, 2014 నుంచి సెప్టెంబరు 4, 2014లోపు మరో 168 ఎకరాలకుపైగా భూమిని ఎకరం కనిష్టంగా రూ.పది లక్షల నుంచి
గరిష్టంగా రూ.40 లక్షల చొప్పున కొనుగోలు చేశారు.
కాజా, కంతేరు గ్రామాలకు ఆనుకుని 804.32
ఎకరాలకుపైగా భూమిలో ఎస్టేట్‌ను ఏర్పాటు చేసి.. ఎవ్వరూ అందులోకి ప్రవేశించకుండా
చుట్టూ కంచెలు, సీసీ కెమెరాలు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ముందస్తు ఒప్పందం మేరకు
చంద్రబాబు కుటుంబ సభ్యులకు అందులో రహస్యంగా వాటా ఇచ్చినట్లు టీడీపీ వర్గాలే
చెబుతున్నాయి. ప్రతిఫలంగా రాజధాని ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి లింగమనేని ఎస్టేట్స్
భూములు రాకుండా ముఖ్యమంత్రి సహకరించారు. భూసేకరణ పరిధిలో ఉన్న నిడమర్రు గ్రామాన్ని
రాజధాని సరిహద్దుగా నిర్ణయించేశారు. అంటే లింగమనేని భూముల్లో ఒక్క ఎకరా కూడా
ల్యాండ్ పూలింగ్‌లోకి వెళ్లకుండా పక్కా ప్లాన్ ప్రకారం రాజధాని ఏరియాను
నిర్ణయించారు. లింగమనేని భూములకు కేవలం పది మీటర్ల లోపే రాజధాని సరిహద్దు రాళ్లు
ఏర్పాటయ్యాయి. దీంతో ప్రధాన రాజధాని ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న లింగమనేని
ఎస్టేట్స్ భూమి ధర అమాంతం పెరిగిపోయింది. ఇపుడు ఎకరం రూ.ఐదు కోట్ల వరకూ
పలుకుతోంది. అంటే.. రాజధాని సరిహద్దులు నిర్ణయించడంలో సీఎం చంద్రబాబు వ్యవహరించిన
తీరు వల్ల ఒక్క లింగమనేని గ్రూప్‌కే రూ.నాలుగు వేల కోట్లకుపైగా లబ్ది
చేకూరిందన్నది అధికారవర్గాల అంచనా. రాజధాని మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా
లింగమనేని ఎస్టేట్‌కు చెందిన ఒక్క అంగుళం భూమి కూడా పోకుండా ప్రణాళికలు
రూపొందించడం గమనార్హం.క్విడ్ ప్రోకో అంటే ఇదీ!

మంగళగిరి మండలం కాజా గ్రామం వద్ద లింగమనేని గ్రూప్స్
నిర్మించిన ఐజేఎమ్ అపార్ట్‌మెంట్స్‌లో 700కు పైగా
ప్లాట్‌లు, విల్లాలు భారీ ధరలకు అమ్ముడయ్యేలా
ప్రభుత్వ పెద్దలు సహకరించారు.  ఫ్లాట్‌లన్నీ
అమ్ముడయ్యాక ప్రభుత్వం తాపీగా రాజధాని తుళ్ళూరులో ఏర్పాటు  చేస్తున్నట్టు మరో ప్రకటన ఇచ్చారు. ఇందుకు ప్రతిఫలంగా
చంద్రబాబు కుటుంబ సభ్యులకు రహస్యంగా లింగమనేని గ్రూప్ వాటాలను బదలాయించారు. అంతే
కాదు కరకట్ట పక్కన కృష్ణా నది ఒడ్డున అనుమతి లేకుండా.. అక్రమంగా నిర్మించిన
లింగమనేని గెస్ట్ హౌస్‌ను సైతం సీఎంకు అప్పగించేశారు. ఆ అతిథి గృహానికి నగిషీలు
దిద్దడానికి.. భద్రత ఏర్పాట్లు చేయడానికి.. రహదారుల నిర్మాణానికి చంద్రబాబు రూ.వంద
కోట్లకుపైగా ప్రభుత్వ ధనాన్ని మంచి నీళ్లలా ఖర్చు చేశారు. కానీ.. డిసెంబర్ 25 వరకూ ఆ గృహాన్ని సీఎం ‘అనధికార’ అతిథిగృహంగా పిలుస్తూ వచ్చారు. ఈ అతిథి గృహంలో రూ.2.27 కోట్లతో ఎలక్ట్రిక్ పరికరాలను అమర్చడానికి పంపిన ప్రతిపాదనలపై
రహదారుల, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ అభ్యంతరం చేశారు. దీంతో చేసేది లేక ఆ
అతిథిగృహాన్ని సీఎం తాత్కాలిక అధికార అతిథిగృహంగా మార్చుతూ డిసెంబర్ 25న ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని బట్టి చూస్తే.. లింగమనేని
గెస్ట్‌హౌస్‌ను చంద్రబాబుకు నజరానాగా ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అసలైన క్విడ్
ప్రోకో అంటే ఇదీ అని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

 

సమీకరణ నుంచి మినహాయించిన భూమి 800 ఎకరాలు

తొలుత లింగమనేని ఆగ్రో డెవలపర్స్, లింగమనేని ఇన్‌ఫోసిటీ ప్రైవేటు లిమిటెడ్ పేర్లతో ఉన్న
కంపెనీలను ఆ తర్వాత లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్‌గా మార్చారు. కంతేరు, కాజా, నిడమర్రు
గ్రామాల పరిధిలో లింగమనేని ఇన్‌ఫోసిటీ ప్రైవేటు లిమిటెడ్, లింగమనేని ఆగ్రో డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్, లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్, లౌక్యా హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ లింగమనేని రమేశ్ తండ్రి
పూర్ణభాస్కరరావు, లింగమనేని
స్వర్ణకుమారి, లింగమనేని రమేశ్, లింగమనేని సుమన, లింగమనేని
ప్రశాంతిల పేర్లతో ఈ భూములను కొనుగోలు చేశారు.

 

లింగమనేని గ్రూప్ కొనుగోలు
చేసిన భూముల సర్వే నెంబర్ల వివరాలు..


లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్: ఖాతానెం 100039లో సర్వేనెంబర్లు 221-1బి, 219-2, 297, 286-2, 298, 356-బి, 360, 365, 366, 368-బి, 375-సి; లింగమనేని ఆగ్రో డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్: ఖాతానెంబరు 100126ల సర్వేనెంబర్లు 163-3, 187/బి, 226-2, 257-ఏ3, 260-ఏ, 260-బి, 260-సి, 262-ఏ, 262-బి, 358-1బి; లింగమనేని
ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్: ఖాతానెంబరు 100157లో
సర్వేనెంబరు 206-1; లింగమనేని
ప్రశాంతి: సర్వేనెంబర్లు 228-సి2, 229-ఏ, 229-బి, 276, 277; లింగమనేని స్వర్ణకుమారి: ఖాతానెంబరు 1488లో సర్వేనెంబర్లు 238, 239, 240-1,
240-2; లింగమనేని సుమన: ఖాతానెంబరు 1488లో
సర్వేనెంబర్లు 278, 279-ఏ, 279-బి, 280, 283-1, 287-5 లౌక్య
హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ లింగమనేని రమేష్ తండ్రి పూర్ణభాస్కరరావు:
ఖాతానెంబరు 2372లో సర్వేనెంబర్లు 372-2ఏ, 373-ఏ... ఇవి
కాకుండా వైట్‌సిటీ ప్రాజెక్ట్సు ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్‌గా
లింగమనేని రమేష్ పేరుతో అనేక ఎకరాల భూములు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన
డాక్యుమెంట్ నెంబర్లు 3350, 3009, 3900, 4893, 4526,
4117, 64/79/2014, 2801, 2237, 2057,

 ఖాజా గ్రామంలో సర్వే నెంబర్లు 219/2, 365, 221/18.

 

Back to Top