అసెంబ్లీ వేదిక‌గా బుర‌ద జ‌ల్లే య‌త్నం..ఈనాడు లో శిక్ష‌ణ ఫ‌లితం..!

హైదరాబాద్: తెలుగుదేశం అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడికి తిమ్మిని బ‌మ్మిని చేయ‌టం బాగా వ‌చ్చు. అదే ఫార్ములాను ఆయ‌న గారి ప‌చ్చ చొక్కాలు వంట బ‌ట్టించుకొన్నారు. అందుకే ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ అడిగే ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర జ‌వాబులు దొర‌క‌టం లేదు. అందుకే వ్య‌క్తిగ‌తంగా బుర‌ద జ‌ల్లేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీ గెజిట్ గా భావించే ప‌చ్చ ప‌త్రిక ఈనాడు లో ప‌నిచేసిన కాల్వ శ్రీ‌నివాసులు త‌ర్వాత కాలంలో రాజ‌కీయ నాయ‌కునిగా తెలుగుదేశం పార్టీలో చేరారు. గతంలో ఈనాడు ప‌త్రిక‌లో ప‌నిచేసిన‌ప్పుడు తిమ్మిని బ‌మ్మిని చేసి రాయ‌టం బాగా ప్రాక్టీస్ చేసి ఉండ‌వ‌చ్చు గాక‌, అందుకే అసెంబ్లీ వేదిక గా కూడా బుకాయించేందుకు ప్ర‌య‌త్నించారు.  అసెంబ్లీ లో చీఫ్ విప్ కాల్వ శ్రీ‌నివాసులు మాట్లాడుతూ.. భారీ స్థాయిలో రెండు అబ‌ద్దాలు ఆడారు. అవి కూడా ప‌చ్చి నిజాలు అన్న‌ట్లుగా న‌మ్మ‌బ‌లికారు. 

గ‌తంలో శివ శివానీ ప‌బ్లిక్ స్కూల్ లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ప‌త్రాల్ని ఒక విద్యార్థి దొంగ‌త‌నం చేశాడ‌ని, ఆ ర‌కంగా చ‌దువుకొన్న విద్యార్థే వైఎస్ జ‌గ‌న్ అని చెప్పుకొచ్చారు. అడ్డ‌గోలుగా అబ‌ద్దాలు ఆడుతున్నార‌నేందుకు ఇది చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌. ఎందుకంటే అస‌లు వైఎస్ జ‌గ‌న్ శివ‌శివానీ పబ్లిక్ స్కూల్ లో చ‌ద‌వ‌నే లేదు. అక్క‌డ‌కు పోనే పోలేదు. అటువంటిది ఆ స్కూల్ లో చ‌దివిన‌ట్లు ఏవేవో చేసిన‌ట్లుగా క‌థ‌లు త‌యారు చేసి కాల్వ శ్రీ‌నివాసులు చెప్పేస్తున్నారు. 

అంత‌కు మించి మ‌రో అబ‌ద్దం ఏమిటంటే..దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ..ఆయ‌న త‌న సతీమ‌ణి వైఎస్ విజ‌య‌మ్మ గారికి ఒక విషయం చెప్పిన‌ట్లు ప్ర‌స్తావించారు. వైఎస్ జ‌గ‌న్ ను భ‌రించ‌లేక పోతున్నాము, బెంగ‌ళూరుకి పంపించేయ‌మని చెప్పిన‌ట్లుగా ఆమె.. అప్ప‌టి మంత్రి, ప్ర‌స్తుత త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్య కు చెప్పిన‌ట్లుగా కాల్వ శ్రీ‌నివాసులు ఉద‌హ‌రించారు. అస‌లు సంగ‌తి ఏమిటంటే..2001 నుంచి వైఎస్ జ‌గ‌న్ బెంగ‌ళూరు లో ఉంటున్నారు. దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసింది 2004 నుంచి 2009 దాకా. అంటే అప్ప‌టికి వైఎస్ జ‌గ‌న్ బెంగ‌ళూరులో ఉంటున్నారు. అటువంట‌ప్పుడు ఆయ‌న్ని బెంగళూరికి పంపించ‌మని చెప్పార‌ని అంటున్నారంటే వాస్త‌వాల్ని ఏ ర‌కంగా వ‌క్రీక‌రిస్తున్నారో అర్థం అవుతోంది. 

అసెంబ్లీ లో వైఎస్ జ‌గ‌న్ ఒక్క‌రి మీద‌నే మూకుమ్మ‌డిగా దాడి చేయండని చంద్ర‌బాబు ఉసిగొల్పితే తెలుగు త‌మ్ముళ్ల‌ను ఎక్కువ మార్కులు కొట్టేయ‌డానికి ఈ ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు. అందుకే పోటీ ప‌డి మ‌రీ తిట్ల పురాణం అందుకొంటున్నారు. నిన్న స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ..మీ క‌థ తేలుస్తా, మిమ్మ‌ల్ని వ‌దిలి పెట్ట‌ను అని బెదిరిస్తే, ఈరోజు ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర రావు ఏకంగా.. ఏంది రా అంటూ పాతేస్తా అని రంకెలు  వేశారు. ఇంత‌టి అప్ర‌జాస్వామికంగా వ్య‌వ‌హ‌రిస్తూ..పైకి మాత్రం నీతులు చెబుతున్నారు. 
Back to Top