కసాయి పాలన

-నిందితులకు భరోసా..బాధితులకు అన్యాయం
-ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు
– బస్సు ప్రమాదాన్ని పక్కదారి పట్టించడమే టీడీపీ వ్యూహం
– ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకుడిపైనే ఆరోపణలు.. కేసులు
– మనిషి ప్రాణాలకు జంతువుల పాటి విలువ లేదా..?
– 11 మందిని బలిగొన్న ట్రావెల్స్‌కు ప్రభుత్వం అండదండలు
– దివాకర్‌ ట్రావెల్స్‌ను కాపాడటమే బాబు లక్ష్యం

కృష్ణా జిల్లాలో జరిగిన దారుణ బస్సు ప్రమాదంలో 11 మంది చనిపోతే ప్రభుత్వం బాధ్యత వహించి నిందితులపై చర్యలు తీసుకోవడం మాని ప్రతిపక్ష నేతపై పడి ఏడవడం సందేహాస్పదంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడు ఆరోపణలు చేస్తే సమాధానం ఇచ్చుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ మూకుమ్మడిగా ప్రత్యారోపణలు చేయడం ప్రజా హక్కులను కాలరాయడమే. పైగా బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి  వాస్తవాలను తొక్కిపెట్టి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద ఘటనను పరిశీలించేందుకు వైయస్‌ జగన్‌ వస్తున్నారని తెలుసుకుని మృతదేహాలను అక్కడ్నుంచి హడావుడిగా తరలించడం.. బాధితులను కలవనీయకుండా చేయాలనుకోవడం.. మీడియాను బెదిరించి బయకు పంపడం.. ఇవన్నీ నిందితుడిని కాపాడేందుకు చేస్తున్న కుట్రగా స్పష్టమవుతూనే ఉంది. 

ప్రశ్నిస్తే కేసులు 
ప్రైవేటు బస్సు 11 మందిని బలి తీసుకుంది. మితిమీరిన వేగం ఆ బస్సు ప్రమాదానికి కారణం. అలాంటప్పుడు కేసులు ఎవరి మీద నమోదవ్వాలి.? ట్రావెల్స్‌ యాజమాన్యం మీదనే కదా.! కానీ, ఇక్కడ కేసులు నమోదయ్యింది ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మీద.  ఆయన చేసిన నేరం, ప్రమాద ఘటన గురించి తెలుసుకున్నాక బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు రావడమే. కలెక్టర్‌ను, డాక్టర్లను గట్టిగా ప్రశ్నించడమే. కూరగాయల ధరలు పెరగిపోతేనే ఒంటి నిండా వంకాయలు, బీరకాయలు, బెండకాయల దండ వేసుకుని రోడ్డుకెక్కిన పగటి వేషగాడు చంద్రబాబు. గతంలో ప్రతి చిన్నదానికీ మందిని వెంటేసుకని రోడ్డెక్కి ఎంత యాగీ చేశాడో తెలియనిది కాదు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తనను ప్రశ్నిస్తే మాత్రం సహించలేకపోతున్నాడు. 

బాబు ప్రాప్తం కోసం ఐఏఎస్‌ల పాట్లు
సమస్యను కనుమరుగు చేసేందుకు మధ్యలో ఐఏఎస్‌ల సంఘం కూడా ఒకటి నడుం బిగించింది. చంద్రబాబు ప్రాప్తం కోసం ఉన్నట్టుండి ప్రతిపక్ష నాయకుడికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఇంతకీ అక్కడ వైయస్‌ జగన్‌ చేసిన తప్పేంటి. పోస్టుమార్టం చేయకుండా మృతదేహాలను అంత హడావుడిగా ఎందుకు తరలించాల్సి వచ్చిందని ప్రశ్నించడమే నేరమా..? సమాధానం చెప్పకుండా.. పేపర్లు చూపించకుండా మేనేజ్‌ చేసేస్తుంటే జైలుకు పంపుతామన్నారు. అందులో తప్పేంటి.  నిందితులైతే జైలుకు వెళ్లాల్సిందేగా. బాధితులకు పరిహారం అంది మేలు చేకూరాలన్న తపన తప్ప మరొకటి లేదు. కానీ, బాబు ఐఏఎస్ లను కూడా తనకు అనుకూలంగా మల్చుకొని దిగజారుడు రాజకీయాలకు తెరలేపారు. అంతటితో ఆగకుండా ఆస్పత్రి సిబ్బంది, అభివృద్ధి కమిటీతో ప్రతిపక్ష నాయకుడిపై కేసులు వేయించారు. చనిపోయిన కుటుంబాల గోడు పట్టని చంద్రబాబు..కలెక్టర్ పై జగన్ అసహనం వ్యక్తం చేశారంటూ అనుకూల మీడియాలో వార్తలు రాయించి,  ఐఏఎస్‌ల సంఘాన్ని ఉసిగొల్పాడు.   ప్రైవేటు బస్సుల పుణ్యమా అని ఆర్టీసీకి వందల కోట్ల, వేల కోట్ల నష్టం వస్తోందని ప్రభుత్వమే చెబుతోంది. మరి, అదే ప్రైవేటు బస్సులు ప్రయాణికుల ప్రాణాల్ని తోడేస్తున్నా, ప్రభుత్వమెందుకు చర్యలు తీసుకోదు..? 

‘దురదృష్టకరం’తో సరిపెట్టిన జేసీ 
బస్సు ప్రమాదం దురదృష్టకరం అనే చిన్న స్టేట్‌మెంట్‌తో దివాకర్‌ ట్రావెల్స్‌ అధినేత జేసీ దివాకర్‌రెడ్డి సరిపెట్టేసి చేతులు దులుపుకున్నారు. 11మంది మృత్యువాత పడటంపై టీడీపీ నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పందన ఇది. ఓ ఎంపీ గా ఉంటూ, తన ట్రావెల్స్‌ బస్సు కారణంగా 11మంది చనిపోతే, ’దురదృష్టకరం..’ అనే స్టేట్‌మెంట్‌తో చేతులు దులుపుకోవడాన్ని ఏమనాలి.? జేసీ బ్రదర్స్‌ నడుపుతున్న దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులు ప్రమాదాల బారిన పడటం కొత్త కాదు. చాలా ప్రమాదాల్లో ఇదీ ఒకటి.! ఎంతైనా, అధికార పార్టీకి చెందిన నేత తాలూకు ‘ట్రావెల్స్‌ బస్సు’ కదా, అందుకే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుతిమెత్తగా స్పందించింది. రోడ్డు డిజైన్‌ లోపాలేమైనా వున్నాయా.? అన్న కోణంలో విచారణ జరుపుతారట.. ఇది డీజీపీగారి మాట. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు.  జేసీని ప్రమాద ఘటననుంచి తప్పించేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు పచ్చపార్టీ అంతా వైయస్ జగన్ ను ఆడిపోసుకోవడం క్షమించరానిది. మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వని ఇలాంటి ప్రభుత్వాన్ని చూసి ప్రజలు ఛీదరించుకుంటున్నారు. 
Back to Top