బాబు పతనం మొదలైంది

– చంద్రబాబు పాలనలో ఎవరూ సంతోషంగా లేరు
– ప్రతిపక్షంలోకి వలసలే అందుకు నిదర్శనం
– ఏ వర్గాన్నీ వదలకుండా సాగుతున్న అరాచకాలు 
– మూడేళ్లలో మూడు తరాలు దాటిన దాడులు 

వినాశకాలే విపరీత బుద్ధి.. అని పెద్దోళ్లు ఊరకే అన్లేదు. మన దుర్మార్గపు బుద్ధి మన పతనానికి కారణమవుతుందని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కళ్లముందు కనిపించేవే. అయితే అవన్నీ ఆయా ప్రాంతాలకు పరిమితమయ్యేవే. అందరికీ తెలిసిన సరైన ఉదాహరణ మాత్రం చంద్రబాబే. ఆయన మనస్తత్వమే ఇప్పుడు బాబు పతనానికి కారణమవుతుంది. కనీసం మూడేళ్లు కూడా నిండని బాబు అరాచక పాలనకు జనంలో విరక్తి పుడుతోంది. అందుకే మరో రెండేళ్లు సమయం సమయం ఉండగానే నాయకులు పార్టీ ఫిరాయింపులు షురూ చేశారు. సాధారణంగా అందరి చూపూ అధికార పక్షం వైపు ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం దానికి భిన్నంగా నాయకులు, మేథావులంతా వైయస్‌ఆర్‌సీపీ వైపు చూస్తున్నారు. వీరంతా జనం నాడిని పసిగట్టకుండానే వైయస్‌ఆర్‌ సీపీలోకి చేరుతున్నారనుకోలేం. 

అన్ని వర్గాలను ముంచాడు...
చంద్రబాబు మూడేళ్ల పాలనకే జనం మూడు తరాలకు సరిపడా కష్టాలు పడుతున్నారు. చంద్రబాబు పాలనలో  వంచనకు గురికాని వర్గమంటూ లేదు. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులకు చేసిన అన్యాయం మామూలుది కాదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తానని కాలేజీ ఫీజులు పెంచేసి విద్యార్థులను.., నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వకుండా నిరుద్యోగులను.., పీఆర్‌సీలు, ఎరియర్స్, డీఏలు ఇవ్వకుండా ఉద్యోగులను వేధించుకు తింటున్నాడు. నిత్యం పబ్లిసిటీ పిచ్చి కోసం వీడియో కాన్ఫరెన్సుల పేరు చెప్పి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బుర్ర పీక్కు తింటున్నాడు. వారికుండే సమయమంతా బాబు హరికథలు వినడానికే సరిపోతోంది. ఎన్నికలకు ముందు వస్తున్నా మీకోసం అని ఊరూరూ తిరిగి బ్యాంకులోన్లు ఎవరూ కట్టవద్దు.. బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారం విడిపిస్తా.. అధికారంలోకి రాగానే బేషరతుగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి అంత చెయ్యడం జరిగే పని కాదని మాటతప్పాడు. అలాగే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మహిళలను నమ్మించి ఓట్లేయించుకున్నాడు. తీరా గెలిచి ముఖ్యమంత్రయ్యాక ముష్టి పదివేలిచ్చి.. అదీ మూడుసార్లు అందునా తిరిగి కట్టాల్సిన రుణమంటా.. ఇలా మహిళలందరికీ నమ్మక ద్రోహం చేశాడు. పెండింగ్‌ బకాయలు చెల్లించాలని, వేతనాలు పెంచాలని అంగన్‌వాడీ మహిళలు ధర్నా చేస్తే పోలీసులను పెట్టి దారుణాతి దారుణంగా కొట్టించాడు. కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరిస్తానని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చి వారి వంక కన్నెత్తి కూడా చూడటం లేదు. సెన్సెస్‌లు, అవగాహన కార్యక్రమాలంటూ టీచర్లను రోడ్లమీద తిప్పి చదువులు కొండెక్కించాడు. టీచర్లకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ట్రాన్స్‌ఫర్ల పేరుతో వేధిస్తున్నాడు. ఉత్తీర్ణత లేదనో.. హాజరు శాతం తక్కువనో గ్రామాల్లోని ఎన్నో పాఠశాలలను ఎత్తేసి చిన్నారులను ఉచిత విద్యకు దూరం చేశాడు. పింఛన్లు వెయ్యి రూపాయలకు పెంచామని ఊదరగొడుతున్నా వాస్తవానికి మాత్రం లబ్ధిదారుల సంఖ్యంలో కోత విధించి అదే సొమ్మును కొద్దిమందికే పంచి పెడుతున్నాడు. ఆరోగ్యశ్రీలో ఉండాల్సిన రోగాల సంఖ్యను ఒక్కొక్కటిగా తొలగించేశాడు.. కేటాయించాల్సిన నిధులు భారీగా తగ్గిపోయాయి. కార్పొరేట్‌ ఆస్పత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయి మేం ఉచితంగా ఆపరేషన్లు చేయలేం బాబోయ్‌.. అనే స్థాయికి ఆస్పత్రి యాజమాన్యాలను తీసుకొచ్చాడు. బాబు ముఖ్యమంత్రి అయ్యాక విద్య, వైద్యం ఖరీదయ్యాయి. నిత్యవసరాల ధరలు చుక్కలనంటాయి. టీడీపీ కీచక నాయకుల మూలంగా మహిళలకు రక్షణ కరువైంది. ఇది చాలదా బాబు హయాంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని చెప్పడానికి. 

భవిష్యత్తు మీద భరోసా లేదు.. ప్రాణాలకు రక్షణ లేదు
బాబు పాలనలో సామాన్యుడు భవిష్యత్తు మీద భరోసా కోల్పోయాడు. ఇంకా చెప్పాలంటే ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. మహిళల సంగతైతే మరీ దారుణంగా తయారైంది. ఎప్పుడు టీడీపీ కీచకలు దాడి చేస్తారోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తుంది. వనజాక్షి లాంటి ప్రభుత్వ ఉద్యోగులు, రోజా, జానీమూన్‌ లాంటి ప్రజా ప్రతినిధులు.. రిషితేశ్వరి లాంటి విద్యార్థులు.. లావణ్య వంటి గృహిణలు.. అంగన్‌వాడీ మహిళలు.. సత్యవతి వంటి ఉద్యమకారులు.. మహిళా రైతులు అందరూ ఎక్కడో చోట హింసకు గురైనవారే. వీరందరూ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన పాపానికి వేధింపులు ఎదుర్కొంటున్నవారే... 
Back to Top