నక్కజిత్తులు తెలిసిన నేర్పరి చంద్రబాబు

* వ్యక్తిత్వాన్ని హననం చేయడంలో బాబును మించినవారెవరు
* చంద్రబాబులో ఉన్న గొప్పవరం మతిమరుపు
* ఎవరిపైనైనా బురదజల్లడంలో చంద్రబాబు దిట్ట
* వైయస్ జగన్‌పై అక్రమ కేసులు బాబు దిగజారుడు రాజకీయానికి పరాకాష్ట
* వైయస్‌ఆర్‌పై కూడా కుట్రపూరితంగా కేసులు పెట్టిన చంద్రబాబు
* పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఇప్పటి వరకు ఏం చేశారు
* చట్టపరంగా జైలుకెళ్తారని ప్రతిపక్షనేత చెప్పడం తప్పా..?
* ప్రమాద ఘటనను డైవర్ట్‌ చేయడానికే వైయస్‌ జగన్‌పై కేసు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న గొప్పవరం మర్చిపోవడం. గతంలో ఎంతోమంది అధికారులను పలుసార్లు ``పిచ్చపిచ్చగా ఉందా... ఉద్యోగం ఊడగొడతా`` అని రకరకాలుగా మాట్లాడిన బాబే అవన్నీ మర్చిపోయి తాను పవిత్రంగా ఉన్నానని ఫీలవుతూ జనాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తుంటాడు. ప్రతిపక్షాలపై బుదరజల్లి కడుక్కోమని చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్ష నేతలపై అక్రమంగా కేసులు పెట్టి సంబరాలు చేసుకోవడంలో చంద్రబాబు నేర్పరి. 

అసలు వైయస్‌ జగన్‌ చేసిన తప్పేంటి
కృష్ణా జిల్ ముండ్ల‌పాడు వద్ద రోడ్డు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు పొగొట్టుకుంటే వారిని పరామర్శించడానికి బాధ్యత గల ప్రతిపక్షనేత బాధితులను పరామర్శించడం తప్పా..? ఆసుపత్రిలో పోస్టుమార్టం రిపోర్టులను తారు మారు చేస్తున్న ఆసుపత్రి సిబ్బందిని వైయస్‌ జగన్‌ ప్రశ్నించడం ప్రభుత్వానికి నేరంగా కనిపించింది. అధికారులను ఉద్దేశించి.. తప్పుచేస్తే చట్టపరంగా జైలుకు వెళ్తారని ప్రతిపక్ష నాయకుడు హెచ్చరించడం అన్యాయమా..? బాధ్యత గల పౌరుడిగా అధికారులను ఉద్దేశించి జనరల్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వడం ప్రభుత్వానికి తప్పుగా కనిపించింది. దీంతో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసులు పెట్టించి సంబరాలు చేసుకుంటున్నారు. 

అప్పుడు ఒక్క ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారైనా ప్రశ్నించారా..
గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోతే.. చంద్రబాబు ఇదంతా పోలీసుల తప్పిదమేనని చెప్పినా, ఇంత బాధ్యతాయుతమైన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఒక్కరైనా ప్రశ్నించారా.. లేదు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి 29 మంది మృత్యువాతపడితే ఇప్పటి వరకు కేసు పెట్టని దేశం ఒక్కడైనా ఉంటుందా.. కానీ ప్రతిపక్షనేత అధికారులను ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి సంబరాలు చేసుకుంటారు. ఘోరమైన పుష్కర ఘటనను ప్రభుత్వం పట్టించుకోకుండా.. ప్రతిపక్షాలను ఏదో రకంగా వేధించాలనే కుట్రతో చిన్న స్టేట్‌మెంట్‌లను పట్టుకొని క్రిమినల్‌ కేసులు పెట్టడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పారాకాష్ట. మొదటి నుంచి చంద్రబాబు జిత్తులు తెలిసిన నేర్పరి. ప్రతిపక్షాలపై బురదజల్లి కడుక్కోమనడంలో బాబును మించిన వారు ఈ ప్రపంచంలోనే ఎవరూ ఉండరనేది నగ్నసత్యం. అధికారం ఉంది కదా అని అన్యాయాలు, అక్రమాలకు పాల్పడితే అది చంద్రబాబుకే ఎదురుదెబ్బగా మారుతుంది. బాబు తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు వంటిది.

వైయస్‌ఆర్‌పై కూడా ఇలాగే బాబు కేసుల కుట్ర
ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వాన్ని హననం చేయడంలో చంద్రబాబును మించిన వ్యక్తి దేశంలోనే ఎవరూ కనబడరు. ఎవరిపైనైనా బురదజల్లి కడుక్కొమని చెప్పడంలో బాబు దిట్ట. గతంలో అనేక సందర్భాల్లో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిపై అక్రమంగా కేసులు బనాయించాడు. ఎన్నికల సమయంలో ప్రచార బ్యానర్లు కట్టారని చెప్పి అక్రమంగా వైయస్‌ఆర్‌పై 26 కేసులు పెట్టిన ఘనుడు చంద్రబాబు. చంద్రబాబు నియంత పోకడ వల్ల ఏ నేరం చేయని వైయస్‌ఆర్‌ వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ‘నేను చాలా పవిత్రుడిని, భూ ప్రపంచంలో నాఅంత పవిత్రుడు ఎవరూ ఉండరు.. మిగిలిన వారంతా అపవిత్రులు అనే బాబు తత్వం’చంద్రబాబుది. ఆ మాటకొస్తే పిలనిచ్చిన మామ స్వర్గీయ ఎన్టీఆర్‌ను కూడా వెన్నుపోటు పొడిచారు. పార్టీని తన అధీనంలోకి చేసుకొని ఎన్టీఆర్‌పై అనేక సందర్భాల్లో బురదజల్లారు. సినిమావాళ్లకు రోజులు అయిపోయాయి. ఇప్పుడంతా పాలించే వారివే రోజులని చంద్రబాబు ఎన్టీఆర్‌పై గతంలో ఎదురుదాడికి దిగాడు. ఇప్పుడేమో ఎన్టీఆర్‌ నాకు, మా పార్టీకి ఆదర్శనం, ఆయన తరువాత నేనే వారసుడిని అంటూ గొప్పలు చెప్పుకుంటూ బతుకుతున్నాడు.  చంద్రబాబు చేతులోకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తరువాత విలువలకు సంబంధం లేకుండా తయారైంది. అప్రజాస్వామికంగా పార్టీ ఫిరాయింపులు, ప్రతిపక్ష సభ్యులపై వేధింపులు.. ఇది ప్రజాస్వామ్యమా.. లేక నియంత్రృత్వమా. మేమే అధికారంలో ఉండాలనే కోరిక ఉండడం మంచిదే కానీ, అది దురాలోచనగా మారితే తప్పే.

ప్రమాద ఘటనను డైవర్ట్‌ చేయడానికి బాబు కుట్రలు
రోజు రోజుకు బలపడుతున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని చూసి బాబు సహించలేకపోతున్నాడు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రన్‌వేపై ఆపేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా..? మహిళా ఎమ్మెల్యేను ఎయిర్‌పోర్టులో నిర్భందించడం ఇంతకు ముందు ఎవరైనా చేశారా..? ఇవి తప్పులు కాదా..? చంద్రబాబు ఒకప్పుడు అసెంబ్లీలో అనేక గందరగోళాలు సృష్టించారు. గవర్నర్‌ కుర్చీ లాగేశారు. మహిళా స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆమెను కంటతడి పెట్టించిన నీచ చరిత్ర తెలుగుదేశం పార్టీది. దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురై 11 మంది చనిపోతే ఆ విషయాన్ని నీరుగార్చడానికి వైయస్‌ జగన్‌పై కేసు పెట్టి సంఘటనను తప్పుదోవపట్టించడానికి చంద్రబాబు కుట్రపూరిత రాజకీయం చేస్తున్నారు. గతంలో దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు పాలెంలో ప్రమాదానికి గురైతే ఇదే టీడీపీ నేతలు ఎన్నో విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ ట్రావెల్స్‌ యజమాని జేపీ దివాకర్‌రెడ్డి అదే పార్టీలో ఎంపీగా కొననసాగుతుండటంతో కిక్కురుమనకుండా కేసు నుంచి జేసీని తప్పించడానికి నానా రాద్ధాంతం చేస్తున్నారు. పాలెం ఘటనపై మీడియా ఛానల్స్‌కు నానా హంగామా చేశాయి. ఆ ఘటన మళ్లీ గుర్తు తెచ్చుకునే విధంగా కొవ్వత్తుల ర్యాలీలు కూడా మీడియా ఛానల్స్‌ ఆధ్వర్యంలో జరిగాయి. కానీ ఇప్పుడు ప్రమాద ఘటనను పక్కనబెట్టి వైయస్‌ జగన్‌పై క్రిమినల్‌ కేసు అంటూ రోడ్డు ప్రమాదాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయి. అంటే చంద్రబాబు మీడియాను భయపెట్టి కూడా తనకు అనుకూలంగా మల్చుకున్నారనేది తేటతెల్లమవుతోంది. వైయస్‌ జగన్‌పై అక్రమంగా కేసు పెట్టి ఇదేదో ప్రపంచ సమస్యగా చంద్రబాబు నీచరాజకీయం చేయడం దౌర్భాగ్యం. చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నారనేదానికి వైయస్‌ జగన్‌పై పెట్టిన కేసే నిదర్శనం. 
Back to Top