కుట్రలకు ఆద్యుడు బాబే

– చంద్రబాబు గత చరిత్ర మొత్తం కుతంత్రాల మయం
– ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి నుంచి నేటి వరకు అదే పంథా 
– ప్రజా సంకల్ప యాత్రను అడ్డుకోవడంలోనూ అదే దారి..
– గతంలో ఎవరూ అనుమతి కోరలేదని స్పష్టం చేసిన ఆర్టీఐ చట్టం 

‘ప్రజా సంకల్ప యాత్ర’ ఎప్పుడు మొదలవుతుందా అని రాష్ట్రమంతా ఎదురుచూస్తున్న తరుణంలో టీడీపీ నాయకుల్లో మాత్రం టెన్షన్‌ పట్టుకుంది. పాదయాత్రను అడ్డుకుని తీరడానికి కుటిల పన్నాగాలు పన్నుతున్నారు. ముఖ్యమంత్రి నుంచి డీజీపీ వరకు ప్రజా సంకల్ప యాత్రపై ఎదురుదాడే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పాదయాత్రకు అనుమతులు తీసుకోవాలంటూ కొత్త రాజకీయానికి తెరతీశారు. ముఖ్యమంత్రే స్వయంగా నాయకుల సమావేశం ఏర్పాటు చేసి మరీ జగన్‌ పాదయాత్రపై ఎదురుదాడి చేయమని చెప్పడం రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురిచేసింది. ఆ వెంటనే డీజీపీ అందుకుని సంఘవ్యతిరేక శక్తులు పాదయాత్రలో చేరే ప్రమాదముందంటూ .. తుని ఘటనను దీనికి ముడిపెట్టి పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

మొదలు పెట్టేది చంద్రబాబే.... 
కుక్కను చంపాలంటే ముందుగా దాన్ని పిచ్చి దానిగా ముద్రవేయాలనేది సామెత.. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచీ దీన్ని తూచ తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. మొదటి రాయేసి పక్కకు తప్పుకుంటారు. మిగతా రాళ్లేసి బాధ్యతను పక్కనుండే భజన బృందాలకు అప్పగిస్తాడు. నాడు ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడ్ని చేసేందుకు లక్ష్మీ పార్వతిని పావుగా చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక వ్యక్తి నల్లధనం ప్రకటించారని తనకు కేంద్రం నుంచి సమాచారం అందిందని.. ఆ వ్యక్తి జగనేనని తనకు సమాచారం ఉందంటూ ప్రతిపక్ష నాయకుడిపై నిందారోపణలు చేశాడు. దాన్ని చంద్రబాబు భజన బృందాలు సోమిరెడ్డి, దేవినేని ఉమ వంటి వారు అనుకూల మీడియా ముందుకొచ్చి చెలరేగిపోయారు. సరైన  సమయంలో స్పందించిన ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ దీనిపై ప్రధానికి లేఖ కూడా రాశారు. నల్లధనం ప్రకటించిన వారి వివరాలు బహిర్గతం చేయాలని.. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. నల్లధనం ప్రకటించిన వారి లిస్టులో నా పేరుంటే బహిర్గతం చేసుకోవచ్చని సవాల్‌ విసిరారు. వైయస్‌ జగన్‌ ఇచ్చిన ఈ షాక్‌తో పచ్చ పార్టీ తోక ముడిచింది. 2014 ఎన్నికలకు ముందూ ఇదే జరిగింది. లక్ష కోట్లు దోచుకున్నాడంటూ మందీమార్భలం ఊరూరా తిరిగి అసత్య ఆరోపణలు ప్రచారం చేసి జనాన్ని నమ్మించడానికి తీవ్రంగా శ్రమించారు. డబ్బలు ఖర్చు చేసి మరీ సోషల్‌ మీడియాలో ఫేస్‌బుక్, వాట్సాప్‌ ద్వారా పెయిడ్‌ ప్రచారం చేశారు. 

ఇప్పుడూ అంతే... 
ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ చేసే మహా సంకల్ప యాత్రను అడ్డుకునేందుకు కూడా ఇప్పుడు చంద్రబాబు కూడా ఇలాంటి ప్రచారానికే తెరతీశాడు. అదృశ్య శక్తులు చొరబడే ప్రమాదం ఉందని.. అనుమతులు తీసుకోవాలని డీజీపీని అడ్డం పెట్టుకోని ఎప్పుడూ లేనిది కొత్త రూల్స్‌తో పాదయాత్రకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలోనూ రాష్ట్రంలో జరిగిన పాదయాత్రలను గమనిస్తే ఏ ఒక్కరూ అనుమతులు తీసుకున్న దాఖలాలు లేవు. అంతెందుకు గతంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు వస్తున్నా మీకోసం పేరుతో నిర్వహించిన పాదయాత్ర విషయంలోనూ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోలేదు. కానీ ఇప్పుడు వైయస్‌ జగన్‌ పాదయాత్రకు మాత్రం అనుమతుల పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

సహ చట్టంతో వెలుగులోకి...
 ‘ఇప్పటివరకు పాదయాత్ర చేసిన ఏ నాయకుడూ డీజీపీ కార్యాలయానికి అనుమతుల కోసం దరఖాస్తు చేయలేదు.. చేసినట్టు, అనుమతులు మంజూరు చేసినట్టు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు’ అని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎంతమంది పాదయాత్ర చేశారు, ఎంత మందికి అనుమతి ఇచ్చారో తెలపాలని సమాచార హక్కు చట్టం కింద అగనంపూడికి చెందిన ఆర్టీఐ ఉద్యమకారుడు పట్టా రామ అప్పారావు కోరిన వివరాలకు డీజీపీ కార్యాలయం పై విధంగా సమాధానమిచ్చింది.

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు అనుమతులు తప్పనిసరని పలువురు మంత్రులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో రామ అప్పారావు ఈ వివరాలు కోరారు. పాదయాత్రకు అనుమతుల కోసం తమకు గతంలో ఎవరూ దరఖాస్తులు పంప లేదని, తమ వద్ద అలాంటి రికార్డులు లేవని డీజీపీ కార్యాలయం సమాధానమిచ్చింది. స్థానికంగా యూనిట్‌ ఆఫీసులోనే∙దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.  
Back to Top