నవ్విపోదురుగాక నారాకేటి సిగ్గు..!

ఏదీ జరక్కపోయినా ఏదో జరిగిపోతుందనే భ్రమ కల్గించి చివరకు ఏదీ చెయ్యకుండా చేతులెత్తేసే బాపతు చంద్రబాబు. పేదల ఇళ్ల విషయంలోనూ చంద్రబాబు ఇదే చాంతాడు సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు. పేదలకోసం లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం అని డబ్బాలు కొట్టుకుంటున్నారు. 12 లక్షల ఇళ్లు కట్టిస్తామని అబద్ధపు హామీలు గుప్పిస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఎన్ని గృహ నిర్మాణాలు జరుగుతన్నాయి? ఎన్ని పూర్తయ్యాయి? ఎందరి చేతికి పట్టాలు అందాయి? అనే లెక్కలు మాత్రం బాబు స్పష్టంగా చెప్పిందే లేదు. పేదలు, అల్పాదాయ వర్గాలకోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి ఆవాస యోజన పట్టణ గృహ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4.20లక్షల గృహాల నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపింది. అయితే గడిచిన మూడేళ్ల పాలనలో 1.9 లక్షల గృహాల నిర్మాణం కోసం 902 కోట్లు కేంద్రం నుంచి గ్రాంటు వచ్చినా వాటిని పూర్తిగా వినియోగించనేలేదు.

 ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహనిర్మాణ పథకంలో గృహాలు మూడు విభాగాలుగా ఉన్నాయి. అవి 5.3 లక్షలు, 6.7 లక్షలు, 7 లక్షలు. ఈ మూడు విభాగాల్లోనూ ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1.5లక్షలు సబ్సిడీగా ఇస్తాయి. లబ్దిదారులు ముందు 50 వేలు చెల్లించాలి. ఆ తర్వాత 6.5 శాతం వడ్డీతో మిగిలిన మొత్తాన్ని బ్యాంకులోనుగా సమకూరుస్తున్నారు. ఐతే,  కేంద్రానికి సమర్పించిన నివేదికలో నిండా 5 లక్షల ఇళ్ల ప్రతిపాదన కూడా లేదు. కేంద్రం విడుదలచేసే నిధుల లెక్క కూడా ఇంకా తేలలేదు. అసలే ఎపి ప్రభుత్వ జమా ఖర్చుల విషయంలో సీరియస్ గా ఉన్న కేంద్రం ఈ పథకానికి ఎంతవరకు గ్రాంట్ ఇస్దుందో కూడా తెలియదు. కానీ చంద్రబాబు మాత్రం రోజుకో ఇల్లుకట్టి పేదలకు పట్టాలిచ్చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చేస్తున్నాడు. ఇంతకుముందు విశాఖలో ఒకప్పుడు కట్టిన గృహాల లబ్దిదారులకు పట్టాలు పంచమంటే... అధికారులు వాళ్ల దగ్గరకు వెళ్లి మామూళ్లు వసూలు చేశారు. జన్మభూమి కమిటీలు అసలైన లబ్డిదారుల ఎంపికలోనే వ్యత్యాసం చూపించాయని, టిడిపి అనుయాయులనే ఎంపిక చేశాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక బాబుగారైతే ఎన్నికల ముందు ఉచిత గృహనిర్మాణం అంటూ తన మేనిఫెస్టోలోనే పెట్టేశారు. ఇంతవరకు ఆ ఊసేలేదు. మరోపక్క కేంద్రప్రభుత్వ పథకాన్ని తన పథకంగా, తన జేబులోంచి ఖర్చుపెట్టి చేస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నాడు. పునాదిరాళ్లు వేసి, బహిరంగలేఖలు రాసేసి, లక్షల కోట్ల అంకెలతో గారడీ చేస్తున్న నారా పేదల ఆశలు తీరుస్తాడంటే మాత్రం ప్రజలు నమ్మరుగాక నమ్మరు.
Back to Top