గెలుపు కాదది.. ఓట్ల వ్యాపారం

– కొనుగోళ్ల పథకంలో ఆరితేరిన బాబు
– వందల కోట్ల అవినీతి సొమ్ముతో ప్రలోభాలు
– వాపును చూసి బలుపునుకుంటున్న టీడీపీ
-బాబు ఓటుకు నోటు రాజకీయాలతో ప్రజాస్వామ్యం ఖూనీ

రాజకీయం అంటే అమ్మడం.. కొనడం.., ఓ తెలుగు సినిమాలో ఫేమస్‌ డైలాగ్‌. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని చూసి రాసుంటారేమో ఈ డైలాగును. ఆయనకు ప్రజలతో పనిలేదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన లేదు.. ఓటేసిన ప్రజలంటే గౌరవం లేదు.. రాష్ట్రం ఏమైపోతుందన్న సోయి లేదు. సొంత బలంలేని మూడు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలిపినప్పుడే అందరికీ అర్ధమైంది డబ్బు పంపకానికి చంద్రబాబు రూటేసుకున్నాడని. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తే అదే నిజమైంది. 

ఓటుకు పాతిక లక్షలు... తిరగడానికి ప్రైవేటు జెట్‌
కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత డబ్బయినా ఖర్చు చేసి ఎలాగైనా గెలిచి తీరాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నాడు. అందుకే ఎక్కడలేని బలగాలను అక్కడ మోహరించింది. ఈ క్రమంలో ఒక ఓటుకు పాతికలక్షల వరకు ఖర్చు చేసింది.  తెలుగుదేశం పార్టీ మూడుచోట్ల క్యాంప్‌ లు రన్‌ చేసింది.  అయితే ఈ మూడు క్యాంప్‌ లు సమన్వయం చేస్తూ, అక్కడ వున్నవారికి అన్ని సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్నది పర్యవేక్షించేందుకు తెలుగుదేశం కీలక ప్రముఖులు ఓ ప్రయివేట్‌ జెట్‌ను వాడింది. కడప, పాండిచ్చేరి, గోవా, బెంగళూరుల నడుమ ఈ జెట్‌ లో రోజూ ఉదయం నుంచి సాయంత్రం చక్కర్లు కొట్టించారు. అంటే ఖర్చు ఏ రేంజ్‌ లో చేసారో అర్థం చేసుకోవచ్చు.

ఓటర్ల సేవలో మంత్రులు.. అసెంబ్లీకి పంగనామం
నిద్ర లేస్తే ఒక చరిత్ర అని మొదలు పెట్టే చంద్రబాబు నీతి వాక్యాలు వల్లిండంలో పరమసుద్ద అబద్దానంద స్వామీజీ అయ్యాడు. చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది అవేవో అన్నట్టు.. అసెంబ్లీ ప్రారంభోత్సవం రోజున చంద్రబాబు చరిత్ర సృష్టించానని హడావుడిగా ప్రెస్‌మీట్‌ పెట్టేసి నాలుగు అబద్ధాలు ఆరు గొప్పలు చెప్పేసి పోయాడు. అసెంబ్లీ ఒక దేవాలయం.. ప్రజా సమస్యలు తీర్చే పుణ్యక్షేత్రం అని చెప్పిన బాబు అలాంటి దేవాలయంలో ప్రజా సమస్యలపై చర్చ జరిగేటప్పుడు మంత్రులను అందుబాటులో ఉంచాలని గుర్తుంచుకోడు. దానిపై మాత్రం సమాధానం చెప్పడు. పోనీ వారేమైనా దేవ కార్యం వెలగబెడుతున్నారనుకుంటే అదీకాదు. వాళ్లు చేస్తుందేమిటంటే ఓటర్లను తీసుకొచ్చి క్యాంపులు నడిపించడమే. అయితే బాబుకు వీరి గురించి మాట్లాడే ధైర్యం లేదు. కనీసం ప్రెస్‌ మీట్‌ పెట్టినప్పుడు కూడా తను చెప్పాలనుకున్నది చెప్పేసి పోతాడే తప్ప విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానాలు చెప్పిన పాపాన పోలేదు. 

మూడు సీట్లు గెలిస్తే రాష్ట్రం గెలిచినట్టుకాదు..
టీడీపీ సంబరాలు చూస్తుంటే మూడు సీట్లు గెలిచాం.. రాబోయే ఎన్నికల్లో గెలిచే స్తామని ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి ఇక్కడ ఓటేసినవారంతా ఎంపీటీసీలు, జడ్పీటీసులు. మూడు జిల్లాల్లో కలిపి మొత్తం ఓట్లు 2776 ఉన్నాయి. నెల్లూరులో 852, కర్నూలులో 1084, కడపలో 840 ఉన్నాయి. ఒక్కో ఓటుకి లక్షల్లో డబ్బులు ఖర్చు చేసి ఎంపీటీసీలు, జడ్పీటీసల ఓట్లతో గెలిచిన టీడీపీ అద్భుతం చేసేసినట్టు జబ్బలు చర్చుకోవడం సిగ్గుచేటు. నిజానికి టీడీపీ వాపును చూసి బలమని సంబరపడిపోతోంది. ఎందుకంటే 2776 మంది ఓట్లు ఐదున్నర కోట్ల మంది మనోభావాలను.. ఒక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తానుకుంటే అంతకంటే అవివేకం ఇంకోటి ఉండదు. పైగా ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీడీపీ మెజారిటీ కూడా అంతంతే. మొత్తమంతా కలిపి 183 ఓట్లు.. అంటే వైయస్‌ఆర్‌సీపీ 183 ఓట్లు వెనకబడి ఉందన్న మాట. అంటే టీడీపీ చేసుకుంటున్న ప్రచారం ప్రకారం 183 మంది రాష్ట్రంలో పార్టీల గెలుపోటములను నిర్దేశిస్తారా...! సో సాడ్‌.. 
Back to Top