బీజేపీ ని చంద్రబాబు ఈ రకంగా వెన్నుపోటు పొడుస్తున్నారా

వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకి పేటంట్ ఉంది. ఎవరికైనా, ఎప్పుడైనా వెన్నుపోటు
పొడవటంలో ఆయన్ని మించిన ఎక్సుపర్ట్ ఉండరు. గతంలో ఆయన పరిపాలన చేసేనప్పుడు కూడా ఎన్డీయే
తో పొత్తులు కొనసాగిస్తూనే రాష్ట్రంలో బీజేపీని అధ: పాతాళానికి తొక్కేశారు.
ఇప్పుడు అదే గేమ్ ను కొనసాగిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావటం లేదని, కేంద్ర ప్రభుత్వం అన్నీపాపాలే చేస్తుందని
ప్రచారం చేసుకొంటున్నారు. ఖజానాకు నిధులు రావటం లేదని , సంక్షేమ పథకాల్లో కోత
కోస్తున్నారని కథనాలు రాయిస్తున్నారు. పేదలకు అందాల్సిన ఫలాలు తగ్గించటానికి కారణం
కేంద్రం నుంచి రాబడి తగ్గటమే అన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం
నుంచి నిధులు రావటం లేదనే సందేశాన్ని ప్రజల్లోకి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కానీ, వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి. కేంద్రం నుంచి పన్నుల్లో వాటా ద్వారా
గత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా రూ. 8, 085 కోట్ల రాబడి లక్ష్యంగా ఉంది. కానీ,
రూ. 9, 702 కోట్ల రూపాయిల మేర రాబడి వచ్చింది. అంటే కేంద్రం నుంచి రావలసిన
దానికన్నా అదనంగా రూ. 1, 617 కోట్ల ఆదాయం వచ్చినట్లు అన్న మాట. ఇంత అదనపు ఆదాయం
కేంద్రం నుంచి వచ్చినా ఏమీ రానట్లే చెబుతున్నారు.

కేంద్రం నుంచి రావలసిన గ్రాంట్లు కూడా సమ్రద్దిగా వస్తున్నాయి. ఏప్రిల్ నుంచి
సెప్టెంబర్ దాకా రూ. 7, 384 కోట్ల రాబడి అంచనా వేశారు. కానీ, రూ. 11, 524 కోట్ల
రూపాయలు వచ్చి పడ్డాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వీరత్వం ఏమీ లేదు. దాదాపు 50
శాతం ఎక్కువగా, అంటేరూ. 4, 140 కోట్ల మేర అదనంగా సొమ్ములు వచ్చి పడ్డాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెవిన్యూ లోటు భర్తీ కింద రూ. 6,609 కోట్ల
నిధుల్ని 14వ ఆర్థిక సంఘం సిఫార్సుచేసింది. ఇందులో ఇప్పటికే సగం అంటే,, రూ.
3,304కోట్ల రూపాయిలు వచ్చిపడ్డాయి.

ఈ స్థాయిలో కేంద్రంనుంచి నిధులు వస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం
కల్లబొల్లి కబుర్లు చెబుతోంది. అసలు నిధులే లేవంటూ కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి
ప్రజా సంక్షేమ పథకాలకు చిల్లు పెట్టేందుకుప్రయత్నిస్తోంది. పనిలో పనిగా పేదల పథకాల్ని
కోత వేయటం తో పాటు గా బీజేపీ కి ప్రజల్లో చెడ్డ పేరు తెప్పించేందుకు
ప్రయత్నిస్తోంది. 

Back to Top