చంద్రబాబు రాజకీయ డ్రామా..!

శంకుస్థాపన పేరుతో నాటకీయ పరిణామాలు..!
దొంగతనం నుంచి బయటపడేందుకే దొంగ ఆహ్వానం..!

రాజధాని శంకుస్థాపన పేరుతో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను అయోమయంలోకి నెట్టేశాడు. రాచమర్యాదలు, రాజభోగాల్లో తూలుతూ సామాన్య ప్రజానీకం కష్టాలపై కన్నెత్తి కూడా చూడడం లేదు. ప్రజలు నానా అవస్థలు పడుతున్నా పట్టించుకునే పచ్చనాథుడే లేకపోయాడు. వందలాది కోట్లు దుబారా చేస్తూ చంద్రబాబు చేస్తున్న హంగూ ఆర్భాటాలపై ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ప్రజాసమస్యలను పక్కనబెట్టి, సొంత ఇమేజ్ కోసం పాకులాడుతున్న చంద్రబాబు...తాను ఆడుతున్న రాజకీయ డ్రామాలో ఎన్ని ట్విస్ట్ లో. 

ప్రధాని వస్తున్నారు సరే..ప్రత్యేహోదా మాటేమిటి..!
చంద్రబాబు చేస్తున్న ఆడంబరాలు, అట్టహాసాలు అన్నీ తన రాజకీయ లబ్ధికోసమేనన్న సంగతి ప్రజలంతా గుర్తిస్తున్నారు. ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన దీక్షను భగ్నం చేసిన చంద్రబాబు..దాన్నుండి దృష్టి మరల్చే ఉద్దేశ్యంతోనే శంకుస్థాపన పేరుతో హైడ్రామా ఆడుతున్నారన్న విషయం అర్థమైపోయింది. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ నిర్విరామంగా తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని పార్టీనేతలు స్పష్టం చేస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని వస్తున్నందున ప్రత్యేకహోదా ప్రకటన చేయించాలని వైఎస్ జగన్ పట్టుబడుతున్నారు. ఈక్రమంలోనే అపాయిట్ మెంట్ ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్  ప్రధానికి లెటర్ కూడా రాయడం జరిగింది. ప్రజల చూపంతా అక్టోబర్ 22నపైనే ఉండడంతో చంద్రబాబు వణికిపోతున్నారు.

భూదాతకు అవమానం..!
రాష్ట్ర రాజధాని పేరుతో రైతులను క్షోభకు గురిచేస్తూ వేలాది ఎకరాల పంటభూములు దోచుకొన్న చంద్రబాబు..తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం గుండుగుత్తగా  సింగపూర్ కు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఐతే, భూములిచ్చిన రైతులను శంకుస్థాపనకు పిలిచేపేరుతో ఘోరంగా అవమానపర్చారు. ఆహ్వానపత్రికల్లో పాస్ ల కోత నుంచి నాసిరకం వస్త్రాల పంపిణీ వరకు ...భూదాత, అన్నం పెట్టే అన్నదాతను అవహేళన చేశారు. ఎవరో అనామకుడి కోసం వీఐపీల పేరుతో ఒక్కో భోజనానికి వేల రూపాయలు ఖర్చు చేస్తున్న చంద్రబాబు..భూములిచ్చిన రైతులకు మాత్రం రూ.100,150 ఖర్చు పెడుతూ కుటిల బుద్ధిని ప్రదర్శిస్తున్నాడు. ప్రభుత్వ ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ  రైతన్నలు వారిమొహన్నే తిప్పికొట్టారు. 

కాళ్లు పట్టుకునేందుకే ఆహ్వానం..!
ఓటుకు కోట్లు కేసులో దొంగతనం చేసి దొరికిపోయిన దొంగ అంటూ గతంలో కేసీఆర్ చంద్రబాబుపై నిప్పులు చెరగడం..కేసీఆర్ ఖబడ్దార్ నన్ను అరెస్ట్ చేసిన వెంటనే నీప్రభుత్వం కుప్పకూలుతుందని చంద్రబాబు మాట్లాడిన డైలాగులు దేశ,విదేశాల్లో మార్మోగాయి. ఆనాటి నుంచి జైలుకు పోతామన్న భయంతో చంద్రబాబు హైదరాబాద్ రాకుండా తప్పించుకు తిరిగుతూనే ఉన్నారు. తాజాగా శంకుస్థాపన ఆహ్వానం పత్రిక పట్టుకొని కేసీఆర్ ఇంటిలో వాలిపోయాడు. ఉప్పునిప్పులా  బద్ధశత్రువులైన చంద్రబాబు, చంద్రశేఖర్ రావులు కలుసుకోవడం వెనక మతలబుపై ప్రజలంతా గుసగుసలాడుకుంటున్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబు కేసీఆర్ ను కలిసినట్లు భావిస్తున్నారు. అందర్నీ బయటకు పంపి  కేసీఆర్ కాళ్లు పట్టుకుని దేహీ అని ప్రాధేయపడ్డాడని అనుకుంటున్నారు. 
Back to Top