కాపీ, పబ్లిసిటీ చంద్రబాబు రెండు కళ్లు

– ఇదే చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం
– పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారం


పబ్లిసిటీ, కాపీ జీవితానికి అలవాటు పడిన చంద్రబాబు ఎన్ని విమర్శలు వస్తున్నా ఏమాత్రం తగ్గడం లేదు. టీవీలు, పేపర్లు ఎలాగూ మనకే సపోర్టు చేస్తున్నాయి. మనం తప్పు మాట్లాడిన గొప్పగా చూపించే మీడియాలు ఉన్నంతకాలం మనకు నష్టం ఉండదనే ధైర్యంతో చంద్రబాబు వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. ఓటేసి గెలిపించిన జనం అవసరాలను పట్టించుకోకుండా ప్రతిపక్షం వినాశనమే ఏకైక ఎజెండాతో పనిచేస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి ప్రతిపక్షాన్నే లేకుండా చేస్తే సులభంగా గెలిచేయేచ్చని కుటిల ప్రయత్నాలను చేస్తూ ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీని నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. డబ్బు, అధికారం ఎలాగూ ఉండనే ఉంది.. దాన్ని శాశ్వతం చేసుకునే దిశగా అడ్డదారులు వెతుక్కుంటున్నాడీ 40 ఏళ్ల రాజకీయ మేధావి. పైకి నీతులు చెప్పుకుంటూ.. లోపల అవినీతిని ప్రోత్సహిస్తూ చేసిన ప్రాజెక్టులకే మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ కొత్త రకం సంస్కృతికి శ్రీకారం చుట్టేశారు. ప్రశ్నించిన వారిని కేసులు పెట్టి బెదరించడం.... డబ్బులు వెచ్చించి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం లాంటి ఛీప్‌ ట్రిక్కలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. 

కాపీల్లో దిట్ట..

వైయస్‌ఆర్‌సీపీ చేపట్టిన కార్యక్రమాలను ఉన్నది ఉన్నట్టుగా పేరు మార్చి కాపీ కొట్టేశాడు చంద్రబాబు. వైయస్‌ఆర్‌ కుటుంబం పేరుతో వైయస్‌ఆర్‌సీపీ సెప్టెంబర్‌ 11 నుంచి ప్రజల్లోకి వెళ్తుంటే.. చంద్రబాబు కూడా ఇంటింటికీ టీడీపీ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్‌ 17 నుంచి టీడీపీ కూడా ప్రజల్లోకి వెళ్లనుంది. గతంలో కూడా దివంగత మహానేత వైయస్‌ఆర్‌ జన్మదినం సందర్భంగా గడప గడపకు వైయస్‌ఆర్‌సీపీ కార్యక్రమం ప్రారంభిస్తే టీడీపీ కూడా జన చైతన్య యాత్రలు ప్రారంభించి ప్రజల్లోకి వెళితే జనం చీవాట్లు పెట్టారు. రెండేళ్లుగా రాష్ట్రానికి ఏం చేశారని నిలదీయడంతో వారు మధ్యలోనే కార్యక్రమాన్ని ఆపేశారు. కార్యక్రమాలను కాపీ కొట్టడంలోనే కాదు.. ప్రభుత్వం వెబ్‌సైట్‌లను కూడా ఉన్నదున్నట్లు దించేసి అభాసుపాలైంది. తెలంగాణ ప్రభుత్వం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కి రూపొందించిన వివరాలతో ఆంధ్ర ప్రదేశ్‌ కాపీ కొట్టేసి అభాసుపాలైంది. ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ట్విట్టర్‌లో పోస్టు చేసి ఆంధ్ర ప్రభుత్వ పరువు తీసేశాడు. ఆ వార్త అప్పట్లో జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఐటీని కనిపెట్టిన మహానుభావుడికి వెబ్‌సైట్‌ సమాచారాన్ని దొంగిలించే ఖర్మ పట్టింది. ఇవే కాదు ఇప్పుడు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్న నదుల అనుసంధానం గతంలో నరేంద్రమోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది. అయితే బాబు మాత్రం నాలుగైదు సార్లు హారతులిచ్చి ఫాల్స్‌ పబ్లిసిటీతో చీదరించుకునేలా తయారయ్యాడు. తాజా ఫోటోలు

Back to Top