బాబు బాగా నటిస్తున్నాడు

()అసెంబ్లీలో బాబు వినేపరిస్థితుల్లో లేడు
()కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలైనా తెలుసుకోవాలి
()అరుణ్ జైట్లీ చెప్పినవన్నీ సత్యదూరం
()వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్

హైదరాబాద్ః కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడిన మాటలు,  అబద్ధాలను  బాబు స్వాగతించడం దుర్మార్గామని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్  మండిపడ్డారు. అసెంబ్లీలో తాము చెప్పేది చంద్రబాబు వినేపరిస్థితుల్లో లేడని...తెలిసినా తెలియనట్టుగా నటించే పరిస్థితిలోకి వెళ్లిపోయాడని అన్నారు. బాబు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మంత్రులు, మిగిలిన శాసనసభ్యులైనా తెలుసుకోవాలన్నారు. అప్పటికైనా హోదా అంటే ఏమీటి.. జైట్లీ చెప్పిన అంశాలు ఎంత సత్యదూరంగా ఉన్నాయన్నది తెలుస్తుందన్నారు. రాష్ట్రానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా అన్యాయం చేస్తున్నాయో సవివరంగా తెలియజేశారు. 

మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...
  • రాష్ట్రంలో ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ ఇస్తున్నామని అరుణ్ జైట్లీ చెప్పారు
  • మా రాష్ట్రానికి మీరేమైనా ఫేవర్ చేస్తున్నారా.. ఇది జాతీయ విధానం
  • కోటి జనాభా దాటిన ప్రతి రాష్ట్రంలో ఐఐటీ ఉంది, ఐఐఎం ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్ఐటీ, ఎయిమ్స్ ఉన్నాయి
  • ఇవేమైనా లేకుండా ఎక్కడైనా ఉన్నాయంటే.. కోటి కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలే
  • దేశంలో 20 ఐఐటీలు, 20 ఐఐఎంలు, 31 ఎన్ఐటీలు ఉన్నాయి 47 సెంట్రల్ యూనివర్సిటీలున్నాయి
  • ఫీజిబులిటీ ఉంటే దుగ్గరాజపట్నంలో పీపీపీ పద్ధతిలో పోర్టు ఏర్పాటుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సూత్రప్రాయ ఆమోదం తెలిపిందన్నారు
  • ప్రభుత్వరంగ సంస్థలైన సెయిల్, పెట్రోకెమికల్ కాంప్లెక్సుల ఏర్పాటుకు పరిశీలిస్తామని చెప్పారు.. అందులో చేసే ఫేవర్ ఏముంది
  • ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైయస్ఆర్‌ జిల్లా ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తోంది
  • దీనికోసం అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్టి చెప్పడం, దాన్ని ఈ పెద్దమనిషి స్వాగతించడం
  • ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు, లేని రాష్ట్రాలకు.. వనరుల లోటు ఎవరికి ఉన్నా కూడా దాన్ని భర్తీ చేయడం తన విధానం అని 14వ ఆర్థిక సంఘం చెబుతోంది
  • దీని ప్రకారం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే కాదు.. 11 రాష్ట్రాలకు వనరుల లోటును భర్తీ చేస్తోంది
  • 22,500 కోట్లు మనకివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అది కూడా 2015 నుంచి 2020 వరకు మాత్రమే
  • 14వ ఆర్థిక సంఘం ప్రత్యేకహోదా ఇవ్వొద్దని చెప్పింది కాబట్టే ఇవ్వట్లేదని జైట్లీ అన్నారు
  • 14వ ఆర్థికసంఘం కమిటీ నివేదికలో ఒక్క పేరాలోనైనా అది ప్రత్యేకహోదా వద్దందని మీరు చూపించగలరా?
  • వాళ్లు కేవలం ప్రత్యేక హోదా ఉన్నా, లేకపోయినా ఎవరికైనా రెవెన్యూలోటును భర్తీ చేయడానికి తేడా చూపించబోమన్నారు తప్ప.. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడా చెప్పలేదు
  • 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా తీసేయమని ఎప్పుడూ చెప్పలేదని ఆ సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ స్వయంగా చెప్పారు
  • పోనీ అసలు వేరే రాష్ట్రానికి దేనికీ ఇవ్వట్లేదా అంటే.. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా తీసేసే ఆలోచన ఏమీ లేదని పార్లమెంటు సాక్షిగా మంత్రి సమాధానం ఇచ్చారు
  • పోనీ ఈ ఆర్థికసంఘం చెప్పినది తప్పనిసరిగా పాటించి తీరాలన్న నిబంధన కూడా ఏమీ లేదు
  • దాని ప్రతిపాదనలను ఆమోదించాలా.. వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు
  • ప్రత్యేక హోదా పదేళ్లు ఇవ్వాలని వెంకయ్య నాయుడు ఎందుకంత గట్టిగా అడిగారు, ఇస్తామన్న హామీతోనే రాష్ట్రాన్ని ఎందుకు విడగొట్టారు.. అదంత ముఖ్యమని ఎందుకు అందరికీ అనిపించింది
  • మన నుంచి హైదరాబాద్ నగరం వెళ్లిపోయింది. ఉత్పాదక రంగంలో 70 శాతం, ఐటీలో 98 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఆ నగరం లేకపోతే దానికి కాంపన్సేట్ చేయాలి.
  • అందుకే ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు
  • ఆ హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు ఉంటాయి
  • పన్నుల్లో నూరుశాతం రాయితీ, రవాణా చార్జీల రీయింబర్స్‌మెంట్, వడ్డీరేటు 3 శాతం, కరెంటు చార్జీలు సగం రాష్ట్రానికే ఇవ్వడం.. ఇవన్నీ హోదా లేని రాష్ట్రాలకు లేవు
  • అందుకే వెంకయ్య నాయుడు రాజ్యసభలో ఈ హోదా కోసం అంత గట్టిగా పట్టుబట్టారు
  • ఇలాంటి ప్రోత్సాహకాలు ఉంటేనే పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల పెట్టుబడులు పెడతారు, వేలల్లో ఉద్యోగాలు వస్తాయి
  • చివరకు ఈవాళ జీఎస్టీ ఆమోదం పొందిన పరిస్థితుల్లో చూస్తే, జీఎస్టీలో కూడా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు ఉన్నాయి
  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చును నూరుశాతం ఇస్తామని ఇప్పుడేదో కొత్తగా చెప్పినట్లుగా చూపించారు
  • అసలు పునర్విభజన చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం.. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఎప్పుడో రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రటించారు
  • పోలవరం ప్రాజెక్టును కేంద్రమే కడుతుందని, అందులో ఎవరూ అనుమానించక్కర్లేదని మన్మోహన్ అప్పట్లో చెప్పారు
  • పోలవరం ప్రాజెక్టు ఖర్చులో రాష్ట్రం ఇంత, కేంద్రం ఇంత పెట్టాలని ఎప్పుడూ చర్చ రాలేదు
  • కేంద్రాన్ని వీళ్లు ఇప్పుడే ఒత్తిడి చేసినట్లు, ఆ తర్వాతే పోలవరం ప్రాజెక్టును కేంద్రం కడతామంటోందని అన్నట్టుగా చంద్రబాబు, వెంకయ్య నాయుడు చెబుతున్నారు
  • ఏపీలో వెనకబడిన జిల్లాలకు ఒక్కో జిల్లాకు 50 కోట్లు ఇస్తున్నారట. అది ఏ మూలకు సరిపోతుంది? ఏదో ముష్టి వేసినట్లు వేస్తున్నారు
  • రెవెన్యూలోటును భర్తీ చేస్తామని అన్నారు.. ఇది పునర్విభజన చట్టంలో ముందే లేదా.. అది కాక కొత్తగా ఏం చేస్తున్నారు
  • అంతర్జాతీయ విమానాశ్రయాల అంశం 13వ షెడ్యూలులో లేదా
  • కొత్తగా స్పెషల్ ప్యాకేజి అని మీరు ఏం చెబుతున్నారో.. అవన్నీ ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నవి కావా, దాని ప్రకారం మాకు రావల్సినవి కావా
  • మాకు రావల్సినవే ఇస్తూ .. ఏదో కొత్తగా ఇస్తున్నట్లు పోజులు కొట్టడం ఎంతవరకు ధర్మం
  • ఇలాంటి సీఎం ఉండే ప్రతి నిమిషం ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరగదా
  • చరిత్ర హీనుడిగా మిగిలిపోతావన్న విషయం మర్చిపోవద్దని చంద్రబాబుకు చెబుతున్నా
  • రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరినీ కోరుతున్నా.. ఇది మన పోరాటం, మన హక్కు. వదిలేస్తే ఎవరూ పట్టించుకోరు
  • చంద్రబాబు స్వాగతించినా, ఎవరు స్వాగతించినా దీన్ని వదిలే పరిస్థితిలేదు. దీని కోసం పోరాటం చేయాలి
  • చంద్రబాబు చేసిన తప్పులను ఎత్తి చూపించేందుకు ఆయనను ప్రశ్నిస్తున్నాం
  • రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రం దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లాలి

Back to Top