దటీజ్ చంద్రబాబు

హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనస్సులోని మాటను బయట
పెట్టేశారు. అవినీతి, అరాచకాలతో పాలన్ని సాగిస్తున్నఆయన అదే వైఖరిని స్పష్టం
చేశారు. మంత్రులు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అదే బయట
పెట్టారు.

బాబు ఏమన్నారంటే..

 ‘‘మాది
రాజకీయ పరిపాలన.. మళ్లీ ఎన్నికల్లో గెలవాలంటే మా మాట వినే అధికారులను నియమించాలి.
మాట వినని అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టాలి. జపాన్‌లో
కేబినెట్ కార్యదర్శి కూడా అధికార పార్టీకి చెందిన వారే ఉంటారు. కీలకమైన డీఎస్పీ, ఆర్డీవోల బదిలీలు, నియామకాలకు
సంబంధించిన ఫైళ్లను నాకే పంపించండి. నేను స్వయంగా చూసి ఆదేశాలు జారీ చేస్తా’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉద్యోగుల సాధారణ బదిలీలపై
ముఖ్యమంత్రి  కలెక్టర్లు, ఉన్నతాధికారులతో
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులతోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఉద్యోగుల బదిలీల వ్యవహారాన్ని ఎందుకు
పట్టించుకోవడం లేదని మంత్రులను చంద్రబాబు నిలదీశారు. బదిలీలు పారదర్శకంగా, పనితీరు ఆధారంగానే జరుగుతాయని చెప్పడం వల్ల తాము
పట్టించుకోలేదని కొందరు మంత్రులు అన్నారు. దీంతో ముఖ్యమంత్రి వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు ఫిలాసఫీ
చెబుతున్నావా? పారదర్శకత అంటే రాజకీయంగా
ఆలోచించవద్దా? అని అచ్చెన్నాయుడిని గద్దించారు.  

తల పట్టుకొంటున్న ఉన్నతాధికారులు

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బదిలీలు ఉండాలని, మాట వినే వారికే పోస్టింగ్ ఇవ్వాలని వీడియో కాన్ఫరెన్స్‌లో
ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల కలెక్టర్లు, ఉన్నతాధికారులు
విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా మాట్లాడలేదని
వారు చెబుతున్నారు. ఇటువంటి విధానమే రాష్ట్రమంతా ఉందని, అటువంటప్పుడు సుపరిపాలన ఎలా సాధ్యం
అవుతుందని ఆవేదన చెందుతున్నారు. 

Back to Top