చంద్ర‌బాబూ.. ఆక‌లి చావులు ప‌ట్ట‌వా..!

విశాఖ‌:  ఆర్థిక బాధ‌లు తాళ‌లేక కార్మికుల జీవితాలు బ‌లైపోతున్నా ప్ర‌భుత్వంలో చల‌నం క‌ల‌గ‌డంలేదు. విశాఖ జిల్లా త‌మ్మపాల చ‌క్కెర ఫ్యాక్ట‌రీకి చెందిన మ‌రో  కార్మికుడు ద‌య‌నీయ స్థితిలో మృతిచెంద‌డం పాల‌కుల నిర్ల‌క్ష‌వైఖ‌రీ తేట‌తెల్లం మ‌వుతోంది. బ‌వులువాడ రిక్షా కాల‌నీకి చెందిన పొన‌గంటి వెంక‌టేశ్వ‌రావు గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు. కార్మాగారం నుంచి జీతాలు అంద‌క‌పోవ‌డంతో మ‌నోవేద‌న‌కు గురై మృతి చెందాడు. సుమారు 49  నెల‌లుగా జీతాలు ఇవ్వ‌ని తుమ్మ‌పాల చ‌క్కెర క‌ర్మాగారంలో ఎన్ఆర్ఎం కార్మికుడిగా ప‌నిచేసి మాన‌సికంగా కుంగిపోయాడు.  ప్ర‌భుత్వం  సాయం అందిస్తుంద‌ని ఆశ ప‌డిన వెంక‌టేశ్వ‌రావుకు నిరాశే మిగిలింది. క‌ళ్ల ముందు త‌మ్మ‌పాల కార్మికులు ఒకొక్క‌రుగా త‌నువు చాలిస్తుంటే పాల‌కులు ఏం ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డంతో తుమ్మపాల కార్మికులు తీవ్ర నిర్వేదంలో మునిగిపోయారు. త‌మ్మ‌పాల క‌ర్మాగారం ప్రారంభంలో 770 మంది కార్మికులు ప‌నిచేయ‌గా ఇప్పుడు కేవ‌లం రెగ్యుల‌ర్ కార్మికులు 26 మందే మాత్ర‌మే మిగిలిగారు. 230 ఎన్ఎంఆర్ కార్మికుల్ని ఇంటికి పంపించగా రిటైర్ అయిన 142 మంది కార్మికుల‌కు గ్రాట్యుటీ అంద‌లేదు. గ్రాట్యుటీతో పాటు, మిగిలిన కార్మికుల జీతాలు బ‌కాయిలు 15.70 కోట్ల రూపాయ‌లకు చేరుకున్నాయి. ప్రభుత్వ ప‌థ‌కాల ప్ర‌చార ఆర్భాటానికి కోట్లాది రూపాయ‌ల‌ను దుబారా చేస్తున్న ప్ర‌భుత్వానికి తుమ్మ‌పాల కార్మికుల ఆక‌లికేక‌లు వినిపించ‌డంలేదు. స‌హ‌కార‌ రంగంలో కొన‌సాగుతున్న తుమ్మ‌పాల చ‌క్కెర క‌ర్మాగారాన్ని రెండుసార్లు మూయించిన టీడీపీ ప్ర‌భుత్వం 39 కార్మికుల ఆక‌లిచావుల‌కు  ప్ర‌భుత్వ‌మే స‌మాధానం చెప్పాలి.
Back to Top