చంద్రబాబు ఇల్లు కారలేదే..?– వానొచ్చిన ప్రతిసారీ ఉరుస్తున్న సెక్రటేరియట్‌
– బయటకు రాని సీఐడీ దర్యాప్తు నివేదిక 
– రూ. 900 కోట్లు వాన  నీటి పాలు 
– 2 సెంమీల వర్షానికి 6 సెంమీల వరద 

చంద్రబాబుకు సొంత కార్యక్రమాలను ఒకలా చేయడం... జనానికి సంబంధించిన కార్యక్రమాలను మరోలా చేయడం అలవాటు. సొంత పనులైతే వంద రకాలుగా ఆలోచిస్తారు. ఆఖరుకి మనుమడు అక్షరాభ్యాస కార్యక్రమమైనా సరే. ఒక కుటుంబానికే సంబంధించి కార్యక్రమం అంత శ్రద్ద తీసుకునేట్టయితే.. అలాంటిది రాష్ట్ర ప్రజలకు సంబంధించింది అయితే ఇంకెంత శ్రద్ద తీసుకోవాలి. కానీ చంద్రబాబు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ప్రభుత్వ కార్యక్రమాలు కానీ.. ప్రజలకు సంబంధించి కార్యక్రమాలైతే ఆయన వ్యవహారం చాలా దారుణంగా ఉంటుంది. 

గతంలోనూ ఆంధ్రప్రదేశ్‌ సచివాలయానికి శంకుస్థాపన చేసే కార్యక్రమం, పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణం తదితర కార్యక్రమాలు ఏవి తీసుకున్నా చంద్రబాబు ఏనాడూ కనీసం చెప్పులు తీసని పాపాన పోలేదు. అదే తన సొంతింటికి భూమి పూజ చేసే సందర్భంలో చాలా శ్రద్దగా కాలికి కనీసం సాక్సులు కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. దీనికి సంబంధించిన విజువల్స్, ఫొటోలు చాలా సార్లు సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అవ్వడం దేశవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులు చూసి తిట్టిన తిట్టు తిట్టకుండా ఊరుకోలేదు. అయినా ఆయన వైఖరిలో మార్పు రాలేదు. 

నాసిరకంగా సెక్రటేరియట్‌ నిర్మాణం.. 
వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన సెక్రటేరియట్‌ నిర్మాణం, ఇటీవల చంద్రబాబు హైదరాబాద్‌లో కట్టుకున్న ఇళ్లను పోల్చి చూస్తే ఆయన వైఖరి తెలుస్తుంది. సెక్రటేరిట్‌ కట్టిన నాటి నుంచి వర్షాలు పడిన ప్రతిసారీ ఏదో ఒక చోట లీకులు అవుతూనే ఉన్నాయి. పక్క రాష్ట్రాల వారు తక్కువ ఖర్చులో అద్భుతమైన నిర్మాణాలు, రాజధాని నిర్మించుకున్నామని చెప్పుకుంటుంటే.. చంద్రబాబు మాత్రం 900 కోట్లు పెట్టి ఆధునిక పరిజ్ఞానంతో సెక్రటేరియట్‌ నిర్మించానని పదే పదే ఖర్చును గురించి గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే సెక్రటేరియట్, అసెంబ్లీ ప్రారంభించిన తొలి ఏడాది కురిసిన వర్షాల నుంచే లీకుల కారణంగా భవనాలు వరద నీటి పరవళ్లు కనిపించాయి. తొలి ఏడాది ప్రతిపక్ష నాయకుడు క్యాబిన్‌లోనే లీకులు కనిపించడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. షరామామూలుగానే ఇదంతా కుట్ర టీడీపీ నాయకులంతా కట్టగట్టుకుని కూడబలుక్కుని వచ్చి కూశారు. దానికి ఎల్లో మీడియా కూడా వంత పాడింది. పనిలో పనిగా ఏపీ స్పీకర్‌ కూడా వచ్చి పరిశీలించారు. ఎలుకలు కొరికాయని కట్టు కథలు అల్లారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వచ్చి పరిశీలించాలని ప్రయత్నిస్తే రాకుండా బయటే అడ్డుకున్నారు. సీఐడీ దర్యాప్తు అన్నారు. అదేమైందో ఆ దేవుడికే తెలియాలి. అప్పుట్నుంచి వర్షం కురిసిన ప్రతిసారీ సెక్రటేరియట్‌లో ఏదో ఒక చోట ఉరుస్తూనే ఉంది. తాజాగా ఈ ఏడాది మంత్రులు క్యాబిన్‌లోనే వెల్లవలా నీరొచ్చినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. రాజధాని భూమి పూజ చేసిన రోజునే వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని హెచ్చిరించారు. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లే అవినీతి క్రతువుకు దూరంగా ఉంటానని కూడా చెప్పారు. ఇప్పుడలాగే జరిగింది. రూ. 900 కోట్లు పోసి కట్టిన నిర్మాణం వానొచ్చిన ప్రతిసారీ కారుతుందంటే ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. 
చంద్రబాబు ఇల్లు కూడా ఇలాగే ఉందా..?
రాజధాని నిర్మాణం కంటే ఆలస్యంగా హైదరాబాద్‌లో చంద్రబాబు తన ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. వేగంగా పూర్తి చేశారు. అత్యంత రహస్యంగా గృహ ప్రవేశం జరుపుకున్నా.. అత్యద్భుతంగా కట్టారని టాక్‌ వచ్చింది. అక్కడక్కడా కొన్ని ఫొటోలు లీకయ్యాయి. ఉన్న ఇళ్లు సరిపోవడం లేదని భారీ ఖర్చుతో మరో భారీ భవనాన్ని నిర్మించుకున్నాడు. ఏటా సెక్రటేరియట్‌లో లీకులతో అతలాకుతలం అవుతున్నా... చంద్రబాబు ఇంటిలో నీటి చుక్కయినా కనిపించినట్టు వార్తలు రాలేదు. అది మరి.. చంద్రబాబు తన సొంత వ్యవహారమైతే ఎంత జాగ్రత్త తీసుకుంటాడో చెప్పడానికి ఈ ఒక్క నిదర్శనం చాలదా.. 

తాజా ఫోటోలు

Back to Top