తెలుగుదేశంది గోడమీదపిల్లివాటం


హైద‌రాబాద్‌) ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్ర మంతా ఎలుగెత్తి నిన‌దిస్తున్నా అధికారంలో ఉన్న తెలుగుదేశం మాత్రం పెద్ద‌గా గొంతు విప్ప‌టం లేదు. పైగా ప‌చ్చ మీడియా ద్వారా స‌న్నాయి నొక్కులు నొక్కిస్తోంది. ఒక వైపు ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేద‌న్న‌ట్లుగా మాట్లాడుతూ, దీని మీద ప‌చ్చ మీడియాలో మాత్రం పోరాటం చేస్తున్న‌ట్లుగా క‌ల‌రింగ్ ఇచ్చుకొంటున్నారు. 

మొద‌ట నుంచీ అదే విధానం
తెలుగుదేశం అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడుది మొద‌టి నుంచీ అదే విధానాన్ని అవ‌లంబిస్తు వ‌చ్చారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న ఇచ్చిన ప్ర‌ధాన హామీలు అయిదు ఉన్నాయి. 1. రైతులకు రుణ మాఫీ 2. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణ మాపీ 3. నిరుద్యోగులకు ఉద్యోగాలు, లేదంటే నిరుద్యోగ భృతి 4. బ‌డుగుల‌కు గృహ నిర్మాణం 5. ప్ర‌త్యేక హోదా
అధికారంలోకి వ‌చ్చాక ఆయ‌న ఈ అయిదింటిని గాలికి వ‌దిలేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా అయిదింటి మీద దృష్టి పెట్టారు. 1. రాజ‌ధాని పేరుతో భూములు లాక్కోవ‌టం 2. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సార‌వంతమైన భూముల్ని ప్రైవేటు సంస్థ‌ల‌కు, రియాల్ట‌ర్ల‌కు అప్ప‌గించ‌టం, 3. సింగ‌పూర్ సంస్థ‌ల‌కు టోకుగా రాజ‌ధానిని అమ్మేయ‌టం 4. ప‌ట్టిసీమ ప్రాజెక్టును ఏదో ఒక‌లా పూర్త‌యింది అనిపించ‌టం 5. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియాను ప్రోత్స‌హించ‌టం, అడ్డు వ‌స్తే ప్ర‌భుత్వాధికారుల మీద దాడులు చేయించ‌టం
ఎందుకంటే ఈ అయిదింటిలో చంద్ర‌బాబుకి వంద‌ల కోట్ల‌లో లాభాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌చారంలో హామీల‌ను అలాగే గాలికి వ‌దిలేసి పాల‌న సాగిస్తూ ప‌బ్బం గ‌డుపుకొంటున్నారు. 

తీవ్ర‌మవుతున్న నిర‌స‌న‌
అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్న‌ర కావ‌స్తున్నా ప్ర‌ధాన హామీలు అమలు కాక పోవ‌టంతో ప్ర‌జ‌ల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈలోగా ప్ర‌త్యేక హోదా కు సంబంధించి కేంద్రం త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేస్తూ వ‌చ్చింది. కేంద్రం మీద గట్టిగా ఒత్తిడి తేవాలంటే చంద్రబాబుకి ధైర్యం చాల‌టం లేదు. ముఖ్యంగా ఓటుకి కోట్లు కేసులో పూర్తి గా ఇరుక్కొని పోవ‌టంతో దాని నుంచి త‌ప్పించుకొనే మార్గాల కోసం వెద‌కుతున్నారు. కేంద్రంతో పేచీ పెట్టుకొంటే ఎక్క‌డ ఈ కుంభ‌కోణాలు బ‌య‌ట ప‌డ‌తాయో అనిభ‌యం. ముఖ్యంగా సింగ‌పూర్ కంపెనీల‌కు టోకుగా రాజ‌ధానిని అమ్మే ప్ర‌య‌త్నాల్ని కేంద్రం అడ్డుకొంటే మొత్తానికి ముప్పు వ‌స్తుంద‌ని తెలుసు. అందుకే ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న ఎక్కువ‌గా వ‌స్తుండ‌టంతో గోడ మీద పిల్లి వైఖ‌రికి ప‌దును పెట్టింది. 

ఎంపీల‌తో చాటు మాటు చ‌ర్చ‌లు
కేంద్రానికి చంద్ర‌బాబు తెలివిగా వ‌ర్త‌మానం పంపించారు. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌టం కుద‌ర‌దని కేంద్రం చెప్పిన‌ప్పుడు దానికి మ‌ద్దతు ఇచ్చేలా ఆయ‌న ప‌థ‌కాన్ని అమ‌లు చేశారు. చాలా రోజుల నుంచి ఎంపీ ల ద్వారా అదే సందేశాన్ని పంపించారు. ఈ విష‌యాన్ని తెలుగుదేశం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఎప్పుడో చెప్పారు. ప్ర‌త్యేక హోదా రాద‌న్న సంగ‌తి చంద్ర‌బాబుకి ముందే తెలుస‌ని ఆయ‌న కుండ బ‌ద్దలు కొట్టారు. ఈలోగా ప్ర‌త్యేక ప్యాకేజీల‌తో వ‌చ్చే లాభాల మీద ప్ర‌చారం చేయించుకొంటున్నారు. 

Back to Top