చంద్ర‌బాబు మాట‌ల‌కు అర్థాలే వేరులే..!


విజ‌య‌వాడ‌) ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాట‌ల‌కు అర్థాల్ని ఎవ‌రికి వారు వెద‌క్కోవాల్సిందే. రాజ‌ధాని పేరుతో రో్జంతా స‌మీక్ష‌లు నిర్వహించిన చంద్ర‌బాబు.. ఈ వ్య‌వ‌హారంలో త‌న మాట తాను ద‌క్కించుకొనే ప్ర‌య‌త్నం చురుగ్గా చేస్తున్నారు. చివ‌ర‌కు చ‌ట్టాల్లోని మిన‌హాయింపుల్ని అధికారుల‌కు బోధించి ల‌క్ష్యం మేర‌కు భూమిని లాక్కొని సింగ‌పూర్‌, ప్రైవేటు సంస్థ‌ల‌కు అప్ప‌గించేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నారు. 

రాజ‌ధాని పేరుతో జ‌రుగుతున్న‌ది వ్యాపార‌మే..!
రాజ‌ధాని చాటున చంద్ర‌బాబు వ్యాపారం చేస్తున్నార‌న్న సంగ‌తి మొద‌ట నుంచీ అంద‌రూ చెబుతూ వ‌స్తున్నారు. ఒక వైపు తీవ్ర ఆర్థిక లోటు తో ఉన్నామ‌ని చంద్రబాబు బీద ప్ర‌క‌ట‌న‌లు చేస్తుంటారు. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ ప‌డే ఏ ప‌నికోసం అయినా నిదులు లేవ‌ని చెబుతూనే ఉంటారు. అయినా స‌రే, రాష్ట్రం లో ప్ర‌భుత్వం కొలువు తీరిన వెంట‌నే చంద్రబాబు మిగిలిన విష‌యాల్ని ప‌క్క‌న పెట్టేసి రాజ‌ధాని ప‌నుల్లోకి దిగిపోయారు. దేశ‌మంతా నివ్వెర పోయేలా రాజ‌ధానిని నిర్మిస్తామ‌ని ప్ర‌క‌ట‌నలు చేసేశారు. సింగ‌పూర్ సంస్థ‌ల‌తో వ్యాపారానికి శ్రీ‌కారం చుట్టారు.

అంతా సింగ‌పూర్ మ‌యం
ప్ర‌భుత్వంలో ల‌క్ష‌ల రూపాయిల మేర ప‌నులు జ‌ర‌గాల‌న్నా టెండ‌ర్లు ప్ర‌క‌టించటం, నాణ్య‌త అనుభ‌వాల్ని ప‌రిశీలించ‌టం, పూర్వానుభ‌వాన్ని చూడ‌టం,.. చివ‌ర‌కు త‌క్కువ ధ‌ర‌కు ఎవ‌రు నాణ్య‌త‌తో ప‌నులు చేస్తారో చూసుకొని, వారికి ప‌నులు అప్ప‌గిస్తారు. ఇక్క‌డ మాత్రం రాజ‌ధాని విష‌యంలోమాత్రం సింగ‌పూర్‌సంస్థ‌ల‌కు మొత్తాన్ని టోకుగా ఇచ్చేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించేసుకొన్నారు. ఆ త‌ర్వాత అందుకు అనుగుణంగా నిబంధ‌న‌లు మార్చ‌టం, చ‌ట్టాల్ని రూపొందించ‌టం చేస్తూ వ‌చ్చారు. అంతిమంగా సింగ‌పూర్ సంస్థ‌ల చేతిలో మొత్తం రాజ‌ధానిని పెట్ట‌డానికి రంగం సిద్దం చేసుకొన్నారు. 

భూ సేక‌ర‌ణ తో చిక్కులు
వేల ఎక‌రాల్ని సింగ‌పూర్ సంస్థ‌ల‌కు దోచిపెట్టేందుకు చంద్రబాబు అండ్ కో ఒప్పందాలు చేసుకొన్నారు. ఇందులో భాగంగా బెదిరించి, భ‌య‌పెట్టి 40వేల‌కు పైగా భూమిని లాక్కొన్న‌ట్లుగా అధికారులు నివేదిక‌లు త‌యారుచేశారు. అయితే మ‌రో 10, 15వేల ఎక‌రాల్ని తీసుకోవాలంటే ఈలోగా కేంద్రంలో ప‌రిస్థితులు మారిపోయాయి. భూ సేక‌ర‌ణ చ‌ట్టం లో మార్పుల‌కు ఉద్దేశించిన ఆర్డినెన్స్ కు మోక్షం ల‌భించేట్లుగా లేదు. దీంతో పాత చ‌ట్టాల్ని ప్రాతిప‌దిక‌గా తీసుకొని ముందుకు వెళ్లేందుకు ప్ర‌భుత్వం సిద్ద ప‌డుతోంది. 

తాజా ఫోటోలు

Back to Top