చెవిలో పువ్వులు పెట్టడం ఇలా..


విజయవాడ) ప్రజల చెవిలో పువ్వు పెట్టడంలో చంద్రబాబు సిద్ద హస్తుడు. ఒకే ఎత్తుగడతో అనేక మందిని మోసం చేయటం ఎలా అనేది ఆయనకు తెలిసినట్లుగా ఎవరికీ తెలీదు. 
ఎన్నికలకు ముందు ప్రజలకు భారీగా హామీలు ఇచ్చారు. రుణమాఫీ చేస్తామని రైతులు, డ్వాక్రా మహిళల్ని మభ్య పెట్టారు. ఇంటికో ఉద్యోగం, లేదంటే నిరుద్యోగ భ్రతి ఇస్తామని ఎడాపెడా హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఈ హామీలన్నీ తుంగలోకి తొక్కేశారు. ఏడాది దాటి పోయాక వీటి విషయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరకేత వ్యక్తం అవుతోంది. దీంతో ప్రజల ద్రష్టిని మళ్లించేందుకుమరో మార్గాన్ని ఎంచుకొన్నారు. పనిలో పనిగా ఎమ్మెల్యేలు, మంత్రుల్ని బలి  పశువుల్ని చేసేందుకు ఆలోచన చేశారు. ఈ హామీల్ని గాలికి వదిలేయటం పూర్తిగా చంద్రబాబు తప్పిదం. దాన్ని దాచి పెట్టేందుకు కొన్ని సర్వేలు చేయించినట్లుగా గాలి లెక్కలు బయటకు తీశారు. వీటి ఆధారంగా పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎన్నికల హామీల మీద ప్రజలు చాలా సంత్రప్తికరంగా ఉన్నారని సర్వేల్లో వెల్లడైనట్లు చెప్పుకొంటున్నారు. మాఫీ పేరుతో మంజూరు చేసిన నిధులు వడ్డీలకే సరిపోవటం లేదు. రుణమాఫీ మోసంతో అనేక మందిరైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినప్పటికీ చంద్రబాబు మీద చాలా సంత్రప్తికరంగా ఉన్నట్లు ప్రచారంచేసుకొంటున్నారు. కానీ ఎమ్మెల్యేలు, మంత్రుల పని మీద అసంత్రప్తి గా ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యేలు, మంత్రులు సక్రమంగా లేరని, చంద్రబాబు వైఖరి మాత్రం చాలాచాలా బాగుందని మార్కులు వేయించేసుకొన్నారు.
ఇదంతా చంద్రబాబు మార్కు చవకబారు ఎత్తుగడ గా భావిస్తున్నారు. అందుచేతనే ప్రజల చెవిలో పువ్వు పెడుతున్నారని అంటున్నారు. 
Back to Top