రాజ‌ధాని కి సింగ‌పూర్ ఇసుక‌


హైద‌రాబాద్‌ : అమ‌రావ‌తి పేరుతో కొత్త రాజ‌ధానికి స‌న్నాహాలు చేస్తున్నముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాస్ట‌ర్ ప్లాన్ సింగ‌పూర్ సంస్థ‌ల‌తో త‌యారుచేయిస్తే అదేదో అంత‌ర్జాతీయ స్థాయి నిర్మాణాలు అనుకొని తెలుగువాళ్లు మురిసిపోయారు. ఇక్క‌డి వారికి క‌ట్ట‌డం రాదా లేక‌, అంత‌టి నైపుణ్యం లేదా అన్న ప్ర‌శ్న‌లు వినిపించినా చంద్ర‌బాబు అండ్ కో ప‌ట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తాజాగా నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన ఇసుక ను కూడా సింగ‌పూర్ త‌దిత‌ర దేశాల నుంచి తెప్పించేందుకు ప్ర‌యత్నాలు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. 

సాంప్ర‌దాయికంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ నిర్మాణాల‌కు కృష్ణా న‌దిలోని ఇసుక ను వాడుతుంటారు. అందుకే కృష్ణా ఇసుక‌కు చాలా గిరాకీ కూడా ఉంది. దీని కోసం ఇసుక మాఫియా కూడా తెలుగు త‌మ్ముళ్ల క‌నుస‌న్న‌ల్లోనే నడుస్తోంది. అయితే, రాజ‌ధాని ప‌నుల్ని ప‌ర్య‌వేక్షించేందుకు క‌న్స‌ల్టెన్సీల మీద ఆధార‌ప‌డుతున్న చంద్ర‌బాబు , ఇసుక కోసం అదే బాట ప‌డుతున్నారు. ప‌క్క‌నే ఉన్న కృష్ణా న‌దిలో ఇసుక‌ను త‌వ్వితే ఎక్కువ ధర ప‌లుకుతుంద‌న్న రిపోర్ట్ ను రెడీ అవుతోంది. అటు నిపుణులు కూడా స్వ‌యంగా అదే మాట చెబుతున్నారు. ప‌క్క‌నే ఉన్న కృష్ణా న‌దిలోంచి ఇసుక‌ను త‌వ్వి తెచ్చుకొంటే ఎక్కువ రేటు పడుతుంది. సింగ‌పూర్ చుట్టు ప‌క్క‌ల నుంచి ఇసుక‌ను తెప్పించుకొంటే త‌క్కువ ధ‌ర‌కు నాణ్య‌మైన ఇసుక దొర‌కుతుంది అన్న రిపోర్టు ను రెడీ చేస్తున్నారు. వారెవ్వా..ఏమి టెక్నాల‌జీ క‌దా..!

Back to Top