ఆ పుస్త‌కం ఒక సంచ‌ల‌నం..!

న్యూఢిల్లీ) చంద్ర‌బాబు అవినీతి సామ్రాజ్యం మీద రూపొందించిన *చంద్ర‌బాబు.. ఎంప‌రార్ ఆఫ్ క‌ర‌ప్ష‌న్‌* అనే పుస్త‌కం ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.128 పేజీల ఈ పుస్త‌కంలో మూడు ప్ర‌ధాన అంశాల్ని చ‌ర్చించ‌టం జ‌రిగింది. 31 కుంభ‌కోణాల‌కు చంద్ర‌బాబు ఏ విధంగా పాల్ప‌డిన‌దీ ఆధారాల‌తో స‌హా అందించ‌టం జ‌రిగింది. వీటికి తోడుగా జీవో కాపీలు, రిజిస్ట‌ర్ డాక్యుమెంట్ల ప్ర‌తులు జ‌త ప‌రిచారు. ఆయా కుంభ‌కోణాల్లో ఎంత మేర‌కు ల‌బ్ది చేకూరిన‌దీ వివ‌రించారు. వీటి ద్వారా సంపాదించిన సొమ్ముల‌తో చంద్ర‌బాబుఏ విధంగా ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తున్న‌దీ తెలియ చేశారు. ప్ర‌జాస్వామ్యాన్ని ఏ ర‌కంగా అప‌హాస్యం చేస్తున్న‌దీ స్ప‌ష్టం చేశారు.

ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మంలో బాగంగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మ‌రియు పార్టీ నాయ‌కుల బృందం ఢిల్లీ లో పర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో జాతీయ నాయ‌కుల్ని క‌లిసి ఈ పుస్త‌కాల్ని అందిస్తున్నారు. ఆయా పార్టీల నాయ‌కులు, కేంద్ర మంత్రులు ఆస‌క్తిగా ఈ పుస్త‌కాన్ని పరిశీలిస్తున్నారు. వివ‌రాల్ని అడిగి తెలుసుకొంటున్నారు. మొత్తం మీద ఈ పుస్తకం అందరి దృష్టిని ఆక‌ర్షించింద‌ని ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు. 
Back to Top