నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాఆశీర్వదించండి...!

జగన్ ను పరామర్శించిన వైఎస్ విజయమ్మ...!
దీక్షాస్థలిలో ఉద్విఘ్నభరిత ప్రసంగం..!
కేసులతో భయపెట్టినా బెదరలేదు..!
నిరంతరం ప్రజల కోసమే ..!

గుంటూరుః  వైఎస్సార్సీపీ గౌరవ  అధ్యక్షురాలు, వైఎస్ జగన్ మాతృమూర్తి విజయమ్మ గుంటూరు నల్లపాడు రోడ్డులోని దీక్షాస్థలిలో ఇవాళ వైఎస్ జగన్ ను పరామర్శించారు. ఈసందర్భంగా అక్కడకు వచ్చిన అశేష జనవాహిని ఉద్దేశించి విజయమ్మ ఉద్విఘ్నభరితంగా ప్రసంగించారు.  నాబిడ్డను మీచేతుల్లో పెడుతున్నాను.. పార్టీ పెట్టిన రోజే చెప్పాను. మళ్లీ  చెబుతున్నాను .నా కొడుకున్నా మీచుతుల్లో పెడుతున్నా ఆశీర్వదించండని విజయమ్మ ప్రజలను కోరారు.  వైఎస్ జగన్ పై ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడకుండా ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నాడు.  మీకు ఎక్కడ ఏ ఆపద జరిగినా నాబిడ్డ మీదగ్గరకు వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా రావాలని, ప్రజలకు మేలు జరగాలని వైఎస్ దీక్ష చేస్తున్నారు. నాబిడ్డను ఆశీర్వదించండని విజయమ్మ ఈసందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 

ఆంధ్రుల హక్కుకోసం..!
ఉదయం దీక్షాస్థలికి చేరుకున్న విజయమ్మ వైఎస్ జగన్ ను పరామర్శించారు.  వెన్నంటే ఉండి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అదే సమయయంలో  వైఎస్ జగన్ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న ప్రజలందరికీ  విజయమ్మ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాసమస్యలపై  వైఎస్సార్సీపీ చేపట్టిన దీక్షలు, పోరాటాలు ఎవరూ చేయలేదని విజయమ్మ స్పష్టం చేశారు. ప్రత్యేకహోదాను కోరుతూ వైఎస్  జగన్ చేస్తున్న దీక్ష తన కోసం, తన ఇంటికోసం కాదని, ఆరు కోట్ల ఆంధ్రుల  కోసం చేస్తున్న దీక్ష అన్నారు. రాజధాని శంకుస్థాపనకు ఈనెల 22న ప్రధాని ఇక్కడకు వస్తున్నారని ..అప్పుడైనా మోడీ వైఎస్ జగన్ దీక్షను చూసి ప్రత్యేకహోదా ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రధానికి ప్రత్యేకహోదా ఆకాంక్షను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు.  

దేశాలు తిరుగుతున్నారు..!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డిగారు 70 శాతం ప్రాజెక్ట్ లు పూర్తిచేస్తే ..ఆతర్వాత వచ్చిన కిరణ్, చంద్రబాబు, రోశయ్య ప్రభుత్వాలు దాన్ని విస్మరించాయన్నారు. ప్రత్యేకహోదాతోనే  విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అందరికీ మేలు జరుగుతుందని విజయమ్మ తెలిపారు. ఇవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు దేశాలు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు ఎందుకు పోరాడడం లేదని నిలదీశారు. హోదా లేకుండా  చంద్రబాబు రాష్ట్రానికి పరిశ్రమలెలా తీసుకొస్తారని ప్రశ్నించారు. రాజధాని, ఎయిర్ పోర్టు పేరుతో పేదల భూములు దోచుకుంటూ బిజినెస్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

ఇవాళ ఏమయ్యారు మీరంతా..!
రాష్ట్రానికి ప్రత్యేకహోదా, ప్యాకేజీ రెండు అవసరమేనని విజయమ్మ తేల్చిచెప్పారు.  ప్రత్యేక ప్యాకేజీని యాక్ట్ లో పెడుతూనే రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని మన్మోహన్ హామీ  ఇచ్చారు. ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలని వెంకయ్యనాయుడు కోరారు. మరి ఆనాడు ప్రత్యేకహోదా గురించిన మాట్లాడిన వాళ్లందరూ ఇవాళ ఏం చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలను విజయమ్మ ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీకి దిక్కులేకుండా పోయిందన్నారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కుని, ప్యాకేజీ విభజన చట్టంలోనే ఉందని తెలిపారు.  వచ్చే ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం ఉంటుందో తెలియదు. దీనికి ఎవరు గ్యారంటీ అని నిలదీశారు.  ప్రజలందరూ మేల్కోవాలన్నారు.  
Back to Top