బీజేపీ ని రాచిరంపాన పెడుతున్న టీడీపీ

నెల్లూరు: సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్న తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయిలో త‌న బుద్ది బ‌య‌ట పెట్టుకొంటోంది. బీజేపీ ని అడుగ‌డుగునా అవ‌మానిస్తూనే ఉంది. తాజాగా నెల్లూరు జిల్లా లో బీజేపీ, టీడీపీ నాయకుల మ‌ధ్య విభేదాలు బ‌య‌ట ప‌డ్డాయి.


నెల్లూరు జిల్లా వెంక‌ట గిరి లో చేనేత కార్మికుల కోసం ఉపాధి క‌ల్ప‌న స‌ద‌స్సు ని బీజేపీ ఏర్పాటు చేసింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ దీనికి మోకాల‌డ్డే ప్ర‌య‌త్నం చేశారు. చేనేత కార్మికులు, చేనేత జౌళి శాఖ అధికారులను పిలిపించి బీజేపీ ఆధ్వర్యంలో జరిగే సదస్సుకు హాజరుకావద్దని హెచ్చరించినట్లు స్థానికంగా గుసగుసలు వినిపించాయి. అటు చేనేత కార్మికుల్ని కూడా ఎమ్మెల్యే అనుచ‌రులు బెదిరించిన‌ట్లు స‌మాచారం. ఇందుకు తగ్గట్టుగానే  సదస్సుకు చేనేత కార్మికుల పలుచగా హాజరయ్యారు, చేనేత, జౌళీశాఖ జిల్లా అధికారులు డుమ్మాకొట్టారు. దీంతో  బీజేపీ నాయకులు తెలుగుతమ్ముళ్లపై విమర్శలకు దిగారు.

పరోక్షంగా ఎమ్మెల్యేను ఉద్దేశించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి విమర్శనాస్త్రాలు సంధిం చగా, మృదుస్వభావి అయిన నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి సైతం ఒకింత ఘాటుగా స్పందిం చారు. మిత్రపక్షమవడంతో సంయమనం పాటిస్తున్నామని, పోరాట పటిమ లేక కాదు.. అవసరమైతే రోడ్లపైకి ఈడ్చగలమని అన్నారు. వరద బాధిత చేనేతలకు జన్మభూమి కమిటీలు నిర్ధారిస్తేనే పరిహారం మంజూ రు చేస్తారా.. వృద్ధులు ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకుంటేనే పింఛన్ ఇస్తారా అని విరుచుకుపడ్డారు. 50 శాతం ఓట్లతో గెలిచి నా నియోజకవర్గంలో 100 శాతం ప్రజలకు సేవ చేయాలన్నారు. మీ వారికి న్యాయం చేసుకో, ఇతరులకు అన్యాయం చేస్తే సహించబోమన్నా రు. 
Back to Top