వైయస్సార్సీపీ శ్రేణులకు శుభాభినందనలు

()నిర్వీరామంగా గడప గడపకూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం
()గడపగడపలో పార్టీ శ్రేణులకు ఘనస్వాగతం
()విజయవంతంగా వందరోజులు పూర్తి చేసుకున్న కార్యక్రమం
()టీడీపీ రెండేళ్ల పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ
()ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్న ప్రతిపక్ష సభ్యులు
()మోసపూరిత పాలనకు బుద్ధి చెబుతామంటున్న ప్రజలు

విజయవాడః అధికారం కోసం తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు  అడ్డదారులు తొక్కారు. 2014 ఎన్నికల ముందు అమలుకు సాధ్యంకాని హామీలు గుప్పించారు. తీరా గద్దెనెక్కాక ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజలను నట్టేట ముంచారు.  ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చేసిన ఐదు సంతకాలకు ఇంతవరకు మోక్షం దక్కలేదు.  చంద్రబాబు రెండున్నరేళ్లు పాలనలో ఇంతవరకు ఏ ఒక్క హామీ అమలు కాలేదు. పనికొచ్చే ఒక సంక్షేమ పథకం కూడా ప్రవేశపెట్టలేదు. పచ్చ నేతలకు దోచిపెట్టేందుకు అమలు చేసిన పథకాల్లో అవినీతి కంపు కొడుతోంది. ఈ క్రమంలో ప్రజల పక్షాన నిలబడేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వినూత్న కార్యక్రమం తలపెట్టింది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8న గడప గడపకూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు. 

వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ గ్రామంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై ఆరా తీస్తున్నారు. పార్టీ రూపొందించిన వంద ప్రశ్నలతో కూడిన ప్రజా బ్యాలెట్‌ను పంపిణీ చేస్తూ బాబు పాలనపై మార్కులు వేయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర పాలన మండలి సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు. ఇటీవలే ఈ కార్యక్రమం వంద రోజులు పూర్తి చేసుకోగా, ప్రారంభం నాటి నుంచి నేటి వరకు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రతి గడప తొక్కుతూ..వారి ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నాయకులు వెళ్లిన ప్రతి గ్రామంలోనూ స్థానికులు బ్రహ్మరథం పడుతూ ఘన స్వాగతం పలుకుతున్నారు.  

బాబు పాలన దగా..మోసం..వంచన
ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే దగా..మోసం..వంచన. ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు బేషరతుగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు. ప్రతి ఇంటికీ ఓ ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని వాగ్దానం చేశారు. ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు.  ఇంతవరకు ఏ ఒక్క నిరుద్యోగికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బెల్టు షాపులు రద్దు చేస్తామన్నారు..అయితే ఇప్పుడు ఏ వీధిలో చూసినా అవే దర్శనమిస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చింది మొదలు ఆ పార్టీ నేతలు దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. బాబు అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో రూ.1,45,549 కుంభకోణం జరిగింది. నారా పేరు నీరోగా మారింది. ముడుపులన్నీ చంద్రబాబు తనయుడు లోకేష్‌కు అందుతున్నాయి. సూటుకేస్‌ పేరు ఇప్పుడు లోకేష్‌గా మారింది. ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, టీడీపీలు మాట తప్పాయి. ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వద్ద నిధులు సేకరించి ప్రత్యేక దోపిడీకి పాల్పడుతున్నారు. కేంద్రం నిధులకు లెక్కలు చెప్పకపోవడంతో మిత్రపక్షమే చంద్రబాబును అనుమానిస్తోంది. అది చేస్తాం..ఇది చేస్తామంటూ చంద్రబాబు మాటల గారడీ చేస్తున్నారు. సింగపూర్‌ లాంటి రాజధాని నిర్మిస్తామని, బుల్లెట్‌ ట్రైన్‌ తెస్తానని, అమరావతిలో ఒలింపిక్స్‌ నిర్వహిస్తామని ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో ప్రజల నుంచి బలవంతంగా భూములు సేకరించింది. ఆ భూముల్లో అధికార పార్టీ నేతలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోతే ఇంతవరకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు. పైగా రెయిన్‌గన్లు తెచ్చి కరువును తరిమేశామని ప్రగల్భాలు పలుకుతున్నారు. వరదల కారణంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోతే ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. 

ప్రజలకు అండగా ప్రతిపక్ష నేత
 చంద్రబాబు మోసాలతో దగాపడ్డ ప్రజలకు ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొండంత అండగా నిలబడ్డారు. రెండున్నరేళ్లుగా అధికార పార్టీ నేతలు చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ  చంద్రబాబు సర్కార్‌పై పోరాడుతున్నారు. విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన ప్రత్యేక హోదా సాధనకు ఆది నుంచి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు, నిరాహార దీక్షలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. అయినా సరే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హోదా ఇచ్చేది లేదని మాట తప్పడంతో ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా దశల వారిగా పోరాటం చేస్తూనే..మరోవైపు ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నారు. మహోన్నతమైన అవలక్షణాలు తొణికిపుచ్చుకున్న దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిత్యం జనంలోనే ఉంటూ..వారి కన్నీళ్లు తుడుస్తూ జననేతగా వెలుగొందుతున్నారు. రాజకీయాల్లో తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటూ..వ్యక్తిత్వం, విశ్వసనీయతకు తానే నిర్వచనంలా మారారు. రాష్ట్రంలో ఎక్కడ, ఏ మూలన ఏ సంఘటన చోటు చేసుకున్నా..వెంటనే నేనున్నాని పలకరిస్తూ, ప్రజల బాధలను తన బాధలుగా భావించి వారి పక్షాన నిలబడుతున్నారు.  చంద్రబాబు హామీలు రుణాలు మాఫీ కాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఓదార్చారు. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లడంతో వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో గుంటూరు జిల్లాలో రెండు రోజుల పాటు వైయస్‌ జగన్‌ పర్యటించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక వైపు ప్రజా పోరాటాలు చేస్తూనే..మరో వైపు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమాన్ని నిర్వీరామంగా కొనసాగేలా చైతన్యవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఐదు నెలల పాటు నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో వైయస్‌ఆర్‌సీపీ పట్ల అభిమానం పెరుగుతుండటంతో టీడీపీ నేతలు ఆందోళనలో పడ్డారు. వారు కూడా ప్రజల వద్దకు వెళ్లాలని ప్లాన్‌ చేసుకుంటున్నారు. నవంబర్‌ 1 నుంచి జన చైతన్య యాత్రలకు సిద్ధమవుతుండగా, నియోజకవర్గాల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టకపోవడంతో తాము ప్రజల్లోకి వెళ్లలేమని ఇటీవల నిర్వహించిన టీడీపీ శిక్షణ తరగతుల్లో పార్టీ నేతలే అధినేతకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగడం అభినందనీయం. బాబు పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీకి బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. రాజన్న రాజ్యం వైయస్ జగన్ తోనే సాధ్యమని విశ్వసిస్తున్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top