బాబూ..ఇది మహా పాపం


సరిగ్గా మూడున్నరేళ్ల క్రితం ముఖ్యమంత్రి కాగానే బెల్టు షాపుల తాట తీస్తామన్నారు బాబుగారు. చెప్పేదొకటి, చేసేది ఒకటి ఆయనగారికి షరామామూలే. మద్యం విషయంలోనూ బాబుగారు తన బాట తప్పలేదు. బారులకొద్దీ బెల్టు షాపులు కనిపిస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు మొబైల్‌ సప్లయ్‌ల పథకం కూడా నడుస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో అక్షరాల 4,380 మద్యం షాపులు ఉన్నాయి. వీటితో పాటు పర్మిట్‌ రూములు ప్రత్యేకం. బార్ల లెక్క అదనం. వీటన్నింటికి మద్యం సరఫరా కోసం 23 డిపోలు ఉన్నాయి. ఏటా ఆదాయం రూ.11 వేల కోట్లు ఉంది. ఇది బాబు గారికి సరిపోలేదట.

ప్రభుత్వ ఖజానా నింపడం కోసమో? తెలుగు తమ్ముళ్ల జేబులు నింపేందుకో మరో 9 డిపోలు తెస్తారట. ఇక్కడి డిస్టిలరీల మద్యం చాలక పొరుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే దిగుమతి చేసుకుంటున్నారు. గోడౌన్ల కొద్దీ నింపేసి ఆపై ప్రజలకు తాపేసి, రూ.11 వేల కోట్ల నుంచి  రూ.17 వేల కోట్లకు ఆదాయం పెంచాలన్నది బాబు లెక్క.

ఇప్పటికే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అటకెక్కాయి. వట్టిమాటల అభివృద్ధి వెక్కిరిస్తోంది. రుణమాఫీల పథకం మరోరూపంలో వడ్డీల మీద వడ్డీలై ప్రజల నడ్డి విరుస్తోంది. ఉపాధి హామీ పథకంలోనూ కూలి డబ్బులు ముట్టని దౌర్భాగ్యం. పింఛన్ల మాటెత్తితే అటు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల కంట కన్నీరే.  జన్మభూమి కమిటీల పేరుతో నరకం ఇక్కడే చూపిస్తున్నారు. ఇంతింతగా సమస్యల వలయంలో చుట్టుకొని రాష్ట్రంలో పాలన గాడి తప్పుతుంటే, ప్రజలు ఎక్కడ కళ్లు తెరిచి చూస్తారనుకున్నాడో ఏమో బాబు. అందుకేనేమో వీలైనంత మందిని మద్యం మత్తులో ముంచాలనుకుంటున్నాడేమో? 

బాబుగారి తెలివి మాట ఏమోగాని, కుటుంబాలకు కుటుంబాలు మద్యం మహమ్మారి దెబ్బకు రోడ్డున పడుతున్నాయి. ఆ లెక్కలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  ఇవి బాబుగారికి కనబడుతున్నాయో? లô దో? సీఎం బాబుగారు.. ఏ మత్తులో పడి ఆ విధంగా ముందుకు పోతున్నారో!
 
Back to Top