బ్యాక్ డోర్ బాబు

- పైకేమో బీజేపీతో యుద్ధం.. లోపలేమో కమలనాధులను ప్రసన్నం చేసుకునే యత్నం
- అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీని తిట్టడం..ఢిల్లీలో బీజేపీ నేతలవెంట తిరగడం
- కాంగ్రెస్‌తో  సహజ శత్రుత్వాన్ని మరిచి..చిదంబరంతో చీకటి రాజకీయాలు
- ఇప్పటికీ చిదంబరం, ఆజాద్‌లతో టచ్‌లో బాబు?! 
- బ్యాక్‌ డోర్‌ సూత్రాన్నే నమ్ముకున్న బాబు 

అమ‌రావ‌తి:  ఏపీ సీఎం చంద్రబాబు తన బ్యాక్ డోర్ సూత్రాన్ని కొనసాగిస్తునే ఉన్నారు. గతంలో కాంగ్రెస్ తో పోరాడుతున్నట్లు పైకి నటిస్తూ చికట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్నారు.  ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు బయటకు చెబుతూనే వెనుక వైపు నుంచి కమలనాధులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తునే  ఉన్నారు. పైకి బీజేపీపై  విమర్శలు.  విమర్శలే కాదు..కమలనాధులపై పళ్లు పటపట కొరుకుతారు. బీజేపీ పెద్దలను టార్గెట్ చేస్తూ...మాటల నిప్పులు కురిపిస్తారు. వేలు చూపిస్తూ  బెదిరిపోయేలా మాట్లాడుతారు. టీవీల్లో చంద్రబాబును చూసేవాళ్లకు ..వామ్మో బీజేపీ అంటే చంద్రబాబుకు ఎంత కోపమో అన్న  భ్రమ కలిగేలా అసెంబ్లీ లోపల, బయట  స్పీచ్‌లు దంచుతారు  ఇదంతా పైపైకే. ఇన్‌సైడ్‌లో మాత్రం..కమలనాధులను ఎలా ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచనే. కాంగ్రెస్‌లో కొంత మంది పెద్దలతో చంద్రబాబు టచ్‌లో ఉన్నట్లే..ఇప్పటికీ బీజేపీ పెద్దలతో బాబు సమాలోచనలు చేస్తున్నారనేది టాక్‌. ఆ టాక్‌కు  తగ్గట్లే ఈ  మధ్య కాలంలో చంద్రబాబు చేతలూ ఉన్నాయి.  

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే  నాయకుడు ఎలా ఉండాలి. మాటంటే కట్టుబడి ఉండాలి. ఫెయిర్‌ పాలిటిక్స్‌ చేయాలి. ప్రజాప్రయోజనాలే పరమావధిగా పాలన సాగించాలి. కాని..చంద్రబాబు ఏం చేస్తున్నారు వ్యక్తిగత ప్రయోజనాలే పరమావధిగా పాలన చేస్తున్నట్లు కనిపిస్తుంది. పైకేమో బీజేపీతో యుద్ధం అంటూనే లోపల కమలనాధులను ప్రసన్నం చేసుకునే పనిలో బాబు ఉన్నారు.  అసెంబ్లీ సమావేశాలను బీజేపీని తిట్టడానికే ఉపయోగించుకున్నారు..ఇది అసెంబ్లీలోపలనే ఢిల్లీలో మాత్రం కమలనాధుల చుట్టూ టీడీపీ ఎంపీలు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.  బీజేపీని నమ్ముకుంటే అధోగతి పాలవుతామని ఊరువాడా డప్పు వేయిస్తున్నారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి  చిల్లిగవ్వ  కూడా ఇవ్వలేదని   జోరిగిలా ఐదు కోట్లు ఆంధ్రుల చెవులు పగిలేలా మోతమోగిస్తున్నారు. పైకే ఇవన్నీ... లోపల మాత్రం తనపై కమలనాధులకు కోపం రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు బాబు.


అసలు..టీడీపీ పుట్టిందే కాంగ్రెస్‌ బద్ద శత్రువుగా. ఎన్టీఆర్‌ ఉన్నన్ని రోజులు ఏపీలోనే కాదు..జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌పై టీడీపీ సమరశంఖం పూరించింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్‌ కీలకపాత్ర పోషించడమే కాదు..చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. కాని..చంద్రబాబు ఏంచేశారు ? కాంగ్రెస్‌తో తమకున్న సహజ శత్రుత్వాన్ని కూడా మరిచి...చిదంబరంతో    చీకటి రాజకీయాలు చేశారు.  ఇప్పటికీ   చిదంబరం, గులాంనబీ ఆజాద్‌తో చంద్రబాబు అత్యున్నత సంబంధాలు నెరుపుతారని ఢిల్లీ పాలిటిక్స్‌ మాట. ఆనాడు  కిరణ్‌ సీఎంగా ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బ్యాక్‌ డోర్‌ నుంచి కాపాడింది చంద్రబాబేనని బహిరంగ  రహస్యం. ఇలా బయటకు ఒకలా  ఉండి..బ్యాక్‌ డోర్‌ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని ఆయనను దగ్గర నుంచి చూసినవారు చెబుతుంటారు. ఇప్పుడు కూడా చంద్రబాబు బ్యాక్ డోర్‌ సూత్రాన్నే నమ్ముకున్నారు. ఈ సూత్రం ఆధారంగానే బీజేపీతో బ్యాక్‌ డోర్‌ పాలి టిక్స్‌కు తెరలేపారు. పైకి బీజేపీని ఎదిరిస్తున్నట్లు కనిపిస్తూనే...లోపల బీజేపీ బడానేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు బాబు.

ఢిల్లీలో బీజేపీ నేతలతో సంబంధాలు చెడకుండా చూసుకోవడానికే..తన ఎంపీలతో రాజీనామా చేయించలేదని ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శిస్తున్నాయి. బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉండే బాధ్యతను సుజనా చౌదరికి అప్పగించారనేది కూడా టాక్‌. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి..మళ్లీ మోదీ గ్రాప్‌ పడిపోతుందని తెలియగానే హోదాను అడ్డం పెట్టుకుని వదిలించుకుని..లోలోపల సంబంధాలు కొనసాగించడంపై వైఎస్ఆర్‌ సీపీ నేతలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. 

బాబు మనసులో ఉన్నది బయటకు మాట్లాడరు..బయటకు మాట్లాడింది అమలు చేయరు ..చంద్రబాబు గురించి  బాగా తెలిసినవారు..దగ్గర నుంచి గమనించినవారు చెప్పే మాటలు ఇవి. చంద్రబాబు ఇప్పుడు కేసుల భయంలో ఉన్నారని..అందుకే బీజేపీతో సంబంధాలు చెడకుండా  చూసుకుంటున్నారు. మోదీ గ్రాప్‌ పడిపోయిందని బీజేపీకి దూరం జరిగిన బాబు...రేపు మోదీ గ్రాప్ పెరిగిందంటే...బతిమిలాడో..భంగపడే  మోదీ పక్కన కూర్చుంటారు అనడంలో సందేహం లేదు.  

 
Back to Top