బాబు విఫల ప్రయోగాలు!

ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడిననే పేరుతో అడ్డదిడ్డమైన నిర్ణయాలు చేస్తుండడం, అవి
వికటించి జనం ప్రాణాల మీదకు వస్తుండడం తుఘ్లక్ పాలనను జ్ఞప్తికి తెస్తున్నాయి. ఇసుక,
లిక్కర్ మాఫియాల ఆగడాలను నియంత్రించడం కోసం అనే పేరుతో ఆ వ్యాపారాల నిర్వహణ
బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయించారు. తొలి ప్రయోగం ఇసుక రీచ్‌లపై చేశారు.
ఇసుక రీచ్‌లను డ్వాక్రా మహిళా సంఘాలకు కేటాయించారు. దీనివల్ల ఇసుక మాఫియా కార్యకలాపాలను
నియంత్రించవచ్చని చంద్రబాబు సర్కారు పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అంతేకాదు డ్వాక్రా
సంఘాలు ఆర్థికంగా పరిపుష్టం కావడానికి ఉపకరిస్తాయని కూడా ఊదరగొట్టారు. కానీ ఆ ప్రయోగం
ఆదిలోనే బెడిసికొట్టింది.

 ఇసుక మాఫియాను మహిళలు అడ్డుకోగలరా?

       రీచ్‌లు నిర్వహణ హక్కులను పొందిన మహిళా
సంఘాలను అధికార పార్టీ ఆధ్వర్యంలోని ఇసుక మాఫియాలు నయానో భయానో  తమ అధీనంలోకి తెచ్చేసుకున్నారు. చాలా చోట్ల మహిళలను
ముందు పెట్టి మరింత విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. మహిళలచేత అధికారులపై దాడులు
చేయిస్తున్నారు. కృష్ణాజిల్లాకు చెందిన తహశీల్దార్ వనజాక్షిపై అధికార పార్టీ ఎమ్మెల్యే
చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడి చేసిన ఘటన ఇందుకు తాజా ఉదాహరణ. ఎమ్మెల్యే,
ఆయన అనుచరులే మహిళా అధికారిపై దాడి చేసి పైగా మహిళల చేత అధికారిపై ఎదురు
కేసులు పెట్టించారు. ఇక్కడ మాత్రమే కాదు రాష్ర్టంలో అన్నిచోట్లా ఇలా అధికార పార్టీ
ఎమ్మెల్యేలు, నాయకులు ఇసుక మాఫియా రూపమెత్తారు. వారి కనుసన్నల్లోనే
ఇసుక దందాలు నడుస్తున్నాయి. పేరుకు మహిళా సంఘాలే తప్ప పెత్తనమంతా అధికార పార్టీ నాయకులదే.
గతంలో వీరు నేరుగా వ్యాపారాలు చేసేవారు. ఇపుడు మహిళలను ముందుపెట్టి దందా కొనసాగిస్తున్నారు.
వీరు వెనకుండి మొత్తం నడిపిస్తున్నారు.

 ఇసుక క్వారీలలో తమ్ముళ్ల దందా

 రాష్ర్టంలోని ఇసుక క్వారీలలో అధికార పార్టీ నాయకులదే
హవా. ఈ దందాలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్లు గడించారని అంటున్నారు. అధికారులైనా
సరే భయం లేకుండా అడ్డుకున్నవారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటే ఈ వ్యాపారంలో లాభాలు
ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. బాబు సర్కారు నీరు - చెట్టు కార్యక్రమం ద్వారా చెరువులు, కుంటల్లోని
మట్టిని తవ్వి అమ్ముకుని దోచుకునేందుకు లెసైన్స్ ఇవ్వడంతో ఇసుకతో పాటు మట్టి దందా కూడా
సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శివారుల్లోని రీచ్‌ల నుంచి తెలంగాణా రాష్ర్టంలోని ఖమ్మం
జిల్లాకు ఇసుకను తరలిస్తున్నారు. అక్కడి నుంచి సురక్షితంగా హైదరాబాద్‌కు చేర్చి సొమ్ము
చేసుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులు ఇసుక సిండికేట్లు నిర్వహిస్తున్నారు. పోలీసు,
రెవెన్యూ అధికారులను తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నారు.

 మద్యంషాపులూ మహిళలకు ఇవ్వాలనుకున్నారు...

      ఈసారి మద్యం వ్యాపారంలోకి ప్రవేశించిన చంద్రబాబు ప్రభుత్వం వాస్తవానికి మద్యం
దుకాణాలను కూడా మహిళా సంఘాలకు కేటాయించాలని భావించింది. అయితే వారికి దుకాణాలు అప్పగించినా
పరోక్షంగా మద్యం సిండికేట్ల అదుపాజ్ఞల్లోనే ఈ మహిళా సంఘాలు కూడా పనిచేస్తాయని తాజా
సంఘటనతో రుజువయ్యింది. ఒకవేళ దుకాణాలు కేటాయించినప్పటికీ నిర్వాహక మహిళలంతా ఆ ప్రాంత
మద్యం సిండికేట్ల అనుచరగణంగా మారిపోవలసిందే.

Back to Top