బాబు సారధ్యంలో మద్యాంధ్రప్రదేశ్! పల్లెపల్లెకూ పారనున్న మద్యం

స్వర్ణాంధ్రప్రదేశ్
తన లక్ష్యమని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుండేవారు. ఆచరణలో
మాత్రం రాష్ట్రాన్ని ఆయన మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేస్తున్నారు. కొత్తగా ప్రకటించిన
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ చూస్తుంటే ఇక పల్లెపల్లెకు మద్యం ఏరులుగా పారడం ఖాయమని తెలిసిపోతోంది.
ఊరూరా మాత్రమే కాదు ఇంటింటికీ మద్యం చేరేలా నూతన విధానాన్ని చంద్రబాబు ప్లాన్ చేశారు.
కొత్త విధానం ప్రకారం గ్రామాలు, హైవేలు, షాపింగ్‌మాల్స్,
సూపర్ - హైపర్ మార్కెట్లు ఇలా ఎక్కడ చూసినా మద్యం అందుబాటులోకి రానున్నది.

      తాము అధికారంలోకి వస్తే బెల్టుషాపులను రద్దు చేస్తామని, మద్యం ప్రవాహాన్ని కట్టడి చేస్తామని చంద్రబాబు ఎన్నికల సభల్లో ఊదరగొట్టారు.
పార్టీ ఎన్నికల ప్రణాళికలోనూ లిఖితపూర్వక హామీ ఇచ్చారు. ‘‘ మద్యం
బెల్టుషాపులను రద్దు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రెండో సంతకంగా చేస్తుంది.
డీ అడిక్షన్ సెంటర్స్‌ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది.’’ అని ఎలక్షన్ మేనిఫెస్టో 16 వ పేజీలో ప్రముఖంగా పేర్కొన్నారు.  కానీ ఎన్నికలు ముగియగానే ఎన్నికల ప్రణాళికను చెత్తబుట్టలో
వేసిన చంద్రబాబు ఏడాది తిరక్కుండానే మద్యంపై కొత్తపాలసీని తీసుకొచ్చారు.

      ఇంటింటికీ మద్యం ఏరులుగా పారేలా... రాష్ర్టంలో తాగుబోతులను పెంచేలా... రాష్ట్రాన్ని
మద్యాంధ్రగా మార్చేలా... ఈ కొత్త మద్యం పాలసీని ఖరారు చేశారు.

 - కొత్తమద్యం పాలసీలో మరో కొత్త విషయమేమిటంటే
ఈసారి నుంచి ఇక రాష్ట్రప్రభుత్వం నేరుగా మద్యం వ్యాపారంలోకి దిగిపోనున్నది. రాష్ర్టంలోని
4,380 మద్యం షాపులకు గాను 10శాతానికి తగ్గకుండా
మండలానికో మద్యం షాపును రాష్ర్టప్రభుత్వమే నిర్వహించబోతున్నది.  ప్రతి మూడు లెసైన్సు షాపుల మధ్య ఓ ప్రభుత్వ షాపు
ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటారు.

 - షాపింగ్ మాల్స్, సూపర్ - హైపర్ మార్కెట్లలోనూ మద్యం షాపులకు అనుమతి ఇవ్వడం కొత్త మద్యంపాలసీలో
కనిపించిన మరో కొత్త విషయం.

 - ఇంకో కొత్త విషయమేమిటంటే పాలు,
కూల్‌డ్రింకుల మాదిరిగా మద్యం కూడా ఆకర్షణీయమైన టెట్రాప్యాక్‌లలో విక్రయించేందుకు
కొత్త  మద్యం పాలసీలో చంద్రబాబు సర్కారు ప్లాను
వేసింది. నాటుసారా, కల్తీమద్యం, లూజు విక్రయాలను
నిరోధించేందుకే ఈ ప్రయత్నం అని చెబుతున్నా మందుబాబులను మరింతగా ఆకర్షించేందుకేనని వేరే
చెప్పనక్కరలేదు. యూత్ ఇక కూల్‌డ్రింక్స్ ప్యాకెట్లలో మద్యం టెట్రాప్యాక్‌లను కలిపేసుకుని
కనిపించకుండా తీసుకెళ్లేందుకు, ఎవరికీ అనుమానం రాకుండా మద్యం
సేవించేందుకు ఈ ప్లాన్ బాగా ఉపకరిస్తుంది.

 - హైవేల పక్కన ఉన్న మద్యం షాపులను
తొలగించాల్సిందిగా రవాణాశాఖ చాలాకాలంగా మొత్తుకుంటోంది. వాటిని చంద్రబాబు సర్కారు అస్సలు
ఖాతరు చేయలేదు. 50 మీటర్ల దూరంలో షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి
ఆ మేరకు నోటిఫై చేసేశారు. రహదారులపై మద్యం తాగడం వల్ల జరుగుతున్న ప్రమాదాలు 4శాతమేనని ప్రభుత్వం చెబుతుండడం గమనార్హం.

      తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మద్యం మహమ్మారికి అవినాభావ
సంబంధం ఉంది. బెల్టుషాపులకు, చీప్‌లిక్కర్‌కు శ్రీకారం చుట్టిన
పాపం ఆయనదే. 2001లో చీప్‌లిక్కర్‌ను ప్రవేశపెట్టి అధికారికమైన
బెల్టుషాపుల ద్వారా కిరాణా కొట్టులో కూడా మద్యాన్ని అమ్మించిన ఘనత నారా వారిది. ఈ విషయాన్ని
స్టాక్ హోం యూనివర్సిటీకి చెందిన విఖ్యాత పరిశోధకురాలు మారియా లార్సన్ తన పరిశోధన గ్రంథం
‘వెన్ ఉమన్ యునైట్’లో స్పష్టంగా వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సారా వ్యతిరేక ఉద్యమం, అనంతర పరిణామాలపై ఆమె
ఈ గంథాన్ని రచించారు.

      నాడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు మద్యనిషేధం
విధించారు. ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని, పార్టీని లాక్కున్న
చంద్రబాబు నాయుడు సంపూర్ణ మద్యనిషేధానికి తూట్లు పొడిచారు. మద్యం విక్రయాలను పెంచడం
కోసం అధికారులకు టార్గెట్లు పెట్టడం, ప్రమోషన్లు ఇవ్వడం,
అధికాదాయం వచ్చే ప్రాంతాలకు బదిలీలను ఎరగా చూపడం వంటివి చంద్రబాబు పాలనలోనే
జరిగాయి. టార్గెట్లు చేరుకోలేని అధికారులను బదిలీ చేస్తానని చంద్రబాబు హూంకరించడం కూడా
అందరికీ గుర్తే.  దుకాణాల వారీగా కూడా టార్గెట్లు
పెట్టిన ఘనుడు చంద్రబాబు నాయుడు. నాడు విచ్చలవిడిగా దుకాణాలకు అనుమతులిచ్చారు. ప్రతి
బజారులోనూ ఓ బారు ఉండేలా చూశారు. బార్లకు వచ్చే జనాలను పెంచడం కోసం బార్లలో డిస్కోథెక్‌లకు
అనుమతించారు. ప్రతి మద్యం దుకాణానికి 10 నుంచి 15 బెల్టుషాపులను అనుమతించిన ఘనత చంద్రబాబు నాయుడిది.

Back to Top